Anakapalle : పెళ్లి ఇష్టం లేదని కాబోయే భర్త గొంతు కోసేసింది

అనకాపల్లి జిల్లాలోని రావికమతం మండలంలో ఇష్టం లేని యువకుడితో పెళ్లి చేస్తున్నారనే కారణంతో ఓ యువతి దారుణానికి పాల్పడింది...ఆమె చెప్పినట్లే.. కళ్లు మూసుకున్నాడు. వెంటనే షాపులో కొన్న...

Anakapalle : పెళ్లి ఇష్టం లేదని కాబోయే భర్త గొంతు కోసేసింది

Crime

Anakapalle District : తెలుగు రాష్ట్రాల్లో దారుణాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రేమించలేదని, ప్రేమ వివాహం చేసుకుందని.. ఇలా వివిధ కారణాలతో దారుణ హత్యలకు తెగబడుతున్నారు. కూతురు పెళ్లి చేసుకున్న అనంతరం కొద్ది రోజుల తర్వాత సుఫారీ ఇచ్చి అల్లుడిని మామ హత్య చేయించిన ఘటన తెలంగాణలో సంచలనం సృష్టించింది. అలాగే కామారెడ్డిలో తల్లి, కొడుకులు ఆత్మహత్య కేసు కూడా కలకలం రేపింది. ఏపీ రాష్ట్రంలో కూతురి వెంట పడుతున్నాడనే కారణంతో ఓ తండ్రి యువకుడిని చితకబాదడమే కాకుండా.. మర్మాంగాలపై తీవ్రంగా గాయపరిచిన అమానుష ఘటన వెలుగు చూసింది. తాజాగా.. ఏపీ రాష్ట్రంలోని అనకాపల్లి జిల్లాలోని రావికమతం మండలంలో ఇష్టం లేని యువకుడితో పెళ్లి చేస్తున్నారనే కారణంతో ఓ యువతి దారుణానికి పాల్పడింది.

Read More : Bhuvanagiri ACP : రామకృష్ణ గౌడ్‌‌ను చిత్ర హింసలు పెట్టి చంపేశారు.. మామే హత్య చేయించాడు – ఏసీపీ

ఆ యువకుడి గొంతు కోసేసింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పాడేరుకు చెందిన రాము నాయుడుకి రావికమతం మండలానికి చెందిన పుష్పతో వివాహం నిశ్చయం అయ్యింది. వచ్చేనెల 29న నిశ్చితార్థం నిర్ణయించారు. యువకుడు హైద్రాబాద్ సీఎస్ఐఆర్ (CSIR) పరిశోధకుడిగా చేస్తున్నాడు. అయితే.. ఈమెకు ఈ వివాహం ఇష్టం లేదు. ఇటీవల హైద్రబాద్ నుండి యువకుడు విశాకు వచ్చాడు. నీతో మాట్లాడాలని యువకుడికి యువతి చెప్పింది. దీంతో వారిద్దరూ కలిసి కొమ్మలపూడి సాయిబాబా కొండపైకి వెళ్లారు. ఒక సర్ ఫ్రైజ్ ఉందని.. కళ్లు మూసుకుంటే.. ఇస్తానని యువతి చెప్పింది.

Read More : Kodada Rape Incident : కోదాడలో దారుణం.. కూల్ డ్రింక్‌లో మత్తుమందు కలిపి 3 రోజులుగా అత్యాచారం

దీంతో ఆమె చెప్పినట్లే.. కళ్లు మూసుకున్నాడు. వెంటనే షాపులో కొన్న చాకుతో యువకుడి గొంతు ఒక్కసారిగా కొసేసింది. దీంతో అతను రక్తపు మడుగులో కొట్టుమిట్టాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలికి పోలీసులు చేరుకుని అతడిని అనాకపల్లిలోని ఉష ఫ్రేమ్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అతడి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని, తల్లిదండ్రులకు చెప్పినా వినిపించుకోలేదని పోలీసులకు ఆ యువతి తెలిపింది. విషయం తెలుకున్న యువకుడి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకని దర్యాప్తు చేపడుతున్నారు.