Bhuvanagiri ACP : రామకృష్ణ గౌడ్‌‌ను చిత్ర హింసలు పెట్టి చంపేశారు.. మామే హత్య చేయించాడు – ఏసీపీ

రెండు కొడవళ్లు, లక్ష రూపాయలు, బొమ్మ పిస్టల్, సుత్తి, ఇండికా కారు, రెండు బైక్ లను స్వాధీనం చేసుకున్నామన్నారు. పోస్టుమార్టం నిమిత్తం రామకృష్ణ గౌడ్...

Bhuvanagiri ACP : రామకృష్ణ గౌడ్‌‌ను చిత్ర హింసలు పెట్టి చంపేశారు.. మామే హత్య చేయించాడు – ఏసీపీ

Ramakrishna Goud

Ramakrishna Goud Case : రామకృష్ణ హత్య కేసులో ప్రధాన సూత్రధారి మామ వెంకటేషేనని నిర్ధారించినట్లు ఏసీపీ వెల్లడించారు. సుపారీ హత్య చేసినట్లు, అతను కూడా ఒప్పుకోవడం జరిగిందన్నారు. హత్య అనంతరం డెడ్ బాడీని లద్దారం కాల్వలో పడేసినట్లు తెలిపారు. లతీఫ్ తో పాటు దివ్య, అఫ్సర్, మహేష్ లను సిద్ధిపేటలో అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు. మిగతా ఏడుగురిలో పోలాస మహేష్, మహ్మద్ సిద్దిఖి, తోట్ల నరేందర్, తోట్ల ధనలక్ష్మీ, తోట్ల భాను ప్రకాష్ లను అరెస్టు చేయడం జరిగిందన్నారు. రెండు కొడవళ్లు, లక్ష రూపాయలు, బొమ్మ పిస్టల్, సుత్తి, ఇండికా కారు, రెండు బైక్ లను స్వాధీనం చేసుకున్నామన్నారు. పోస్టుమార్టం నిమిత్తం రామకృష్ణ గౌడ్ మృతదేహాన్ని వారి బంధువులకు అప్పచెప్పామని తెలిపారు. హత్యకు సంబంధించిన వివరాలను 2022, ఏప్రిల్ 18వ తేదీ సోమవారం విలేకరులకు ఏసీపీ తెలియచేశారు. ఈనెల 16 ఉదయం తన భర్త రామకృష్ణ కనబడడం లేదని భార్గవి ఫిర్యాదు ఇచ్చినట్లు, ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టామన్నారు.

Read More : Honour Killing : హోంగార్డు రామకృష్ణ మృతదేహానికి నేడు పోస్టుమార్టం

అమృత్ రావు అనే వ్యక్తి ద్వారా పూర్తి వివరాలు బయటపడ్డాయన్నారు. ఇతర విషయాలు తెలియచేస్తే.. చంపేస్తామని నిందితులు అమృతరావును బెదిరించడంతో చెప్పలేదన్నారు. గుండాల మండలానికి తీసుకెళ్లి చంపినట్లు నిందితులు పేర్కొన్నారని, లతీఫ్ గ్యాంగ్తో పాటు దివ్య, మహేష్, మహ్మద్ అప్సర్ లను అరెస్ట్ చేశామన్నారు. వెంకటేష్ భార్గవి తండ్రి సుపారీ ఇచ్చి చంపించినట్లు, ఇందుకు రూ. 10 లక్షల సుపారీ ఇచ్చారన్నారు. ఆర్థికంగా కష్టాల్లో ఉండడంతో ఒప్పుకున్నట్లు నిందితులు తెలియచేయడం జరిగిందన్నారు. హోం గార్డ్ యాదగిరి, రాములు పరిచయం అయ్యాడు.. రాములు లతీఫ్ గ్యాంగ్ ను పరిచయం చేశాడన్నారు. మొత్తం ఈ కేసులో 11 మందిని అరెస్ట్ చేసినట్లు, నలుగురు నిందితులను రిమాండ్ చేశామన్నారు. మిగిలిన 7 గురిని రిమాండ్ చేస్తామని, ఇది పరువు హత్య కాదని తాము భావించడం జరుగుతోందన్నారు.
ఇది ముమ్మాటికీ ఆర్ధిక లావాదేవీలకు సంబంధించిన హత్యగా భావిస్తున్నట్లు ఏసీపీ తెలిపారు.

Read More : Kadapa : వర్క్ చేస్తుండగా పేలిన ల్యాప్ టాప్, సాప్ట్ వేర్ ఇంజినీర్లు జాగ్రత్త

హోంగార్డుగా సస్పెండ్ అయిన తర్వాత.. రామకృష్ణ గౌడ్ యాదగిరిగుట్టలో ఉండేవాడని తెలిపారు. అక్కడ వీఆర్వో వెంకటేష్ పరిచయం అయ్యాడని, ఇతడిని అమ్మాయిని రామకృష్ణ గౌడ్ ట్రాప్ చేసి పెళ్లి చేసుకున్నాడన్నారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన వారని, వయస్సు రీత్యా తేడా ఉండడం, ఆర్థికంగ రామకృష్ణ గౌడ్ కు ఇబ్బందులున్నాయన్నారు. ఇది వెంకటేష్ జీర్ణించుకోలేకపోయాడని, కొన్ని నెలల అనంతరం వారికి పాప జన్మించిందన్నారు. దీంతో ఆలోచనను కొద్ది రోజులు విరమించుకున్నాడని తెలిపారు. చివరకు రామకృష్ణ గౌడ్ ను చంపేయాలని నిర్ధారించుకున్నాడన్నారు. హోం గార్డ్ యాదగిరి, రాములు పరిచయం అయినట్లు..రాములు లతీఫ్ గ్యాంగ్ ను పరిచయం చేశాడన్నారు.

Read More : Honour Killing : భువనగిరి పరువు హత్యకేసులో 13 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

రూ. 10 లక్షల సుపారీకి ఒప్పందం జరిగినట్లు వెల్లడించారు. నెల రోజుల నుంచి ఆస్తుల విషయంలో కూతురిపై రామకృష్ణ గౌడ్ ఒత్తిడి తీసుకొచ్చాడని, క్రిమినల్ బ్యాక్ గ్రౌండ్ ఉండడంతో తన పిల్లలను కూడా చంపే అవకాశం ఉందని తాను భావించినట్లు వెంకటేష్ వెల్లడించడం జరిగిందన్నారు ఏసీపీ. రామకృష్ణ గౌడ్ ను ఇష్టమొచ్చినట్లు కొట్టారని, రాయితో తలపై కొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయన్నారు. ఇతరుల సహాయంతో అతడిని చంపేశారని, లతీఫ్ ఇతరులు సిద్ధిపేటలో ఉండేవారని, ఇక్కడి ప్రాంతాలు తెలియకపోయేసరికి… మల్లన్న సాగర్ కాల్వ పరిసర ప్రాంతంలో డెడ్ బాడీని పాతిపెట్టారన్నారు. ఆరు లక్షలు తీసుకున్నామని నిందితులు చెప్పారన్నారు. సీన్ రీ కన్ స్ట్రక్షన్ కోసం వారిని ఇక్కడకు తీసుకరావడం జరుగుతుందని, కోర్టు నిర్ణయం అనంతరం కస్టడీకి తీసుకుంటామని ఏసీపీ తెలిపారు.