Kadapa : వర్క్ చేస్తుండగా పేలిన ల్యాప్ టాప్, సాప్ట్ వేర్ ఇంజినీర్లు జాగ్రత్త

ల్యాప్‌టాప్‌.. బాంబుగా మారింది. పని చేయాల్సిందే ప్రాణాల మీదకు తెచ్చింది. కడప జిల్లా బద్వేల్‌లో ల్యాప్‌టాప్‌ ఒక్కసారిగా పేలిన ఘటనలో ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ తీవ్ర గాయాలపాలైంది....

Kadapa : వర్క్ చేస్తుండగా పేలిన ల్యాప్ టాప్, సాప్ట్ వేర్ ఇంజినీర్లు జాగ్రత్త

Kadapa

Laptop Exploded : కరోనా కాలంగా చాలా మంది ఇంటి నుంచే పని చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. పరిస్థితిలో కొంత మార్పు వచ్చినా.. కొన్ని కంపెనీల ఉద్యోగులు ఇంటి నుంచే పని చేస్తున్నారు. ఉదయం నుంచే ల్యాప్ టాప్ లను పట్టుకుని వర్క్ చేయడం ప్రారంభిస్తున్నారు. వర్క్ చేసే క్రమంలో.. ల్యాప్ టాప్ లో ఆఫ్ అయిపోతుండడంతో చార్జింగ్ పెట్టి మరీ పని చేస్తున్నారు. ఇలా చేయడమే ఓ మహిళా సాఫ్ట్ వేర్ ప్రాణాల మీదకు వచ్చింది. ల్యాప్ టాప్ పేలిన ఘటనలో ఓ మహిళా సాప్ట్ వేర్ ఇంజినీర్ తీవ్రంగా గాయపడింది. కడపలో ఈ ఘటన చోటు చేసుకుంది.

Read More : Kodali Nani : పశువుల కొట్టంలో పడుకున్న మాజీ మంత్రి కొడాలి నాని

ల్యాప్‌టాప్‌.. బాంబుగా మారింది. పని చేయాల్సిందే ప్రాణాల మీదకు తెచ్చింది. కడప జిల్లా బద్వేల్‌లో ల్యాప్‌టాప్‌ ఒక్కసారిగా పేలిన ఘటనలో ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ తీవ్ర గాయాలపాలైంది. కాలిన గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.మేకవారిపల్లెకు చెందిన 24ఏళ్ల సుమలతకు తీవ్ర గాయాలయ్యాయి. ఛార్జింగ్ పెట్టి ల్యాప్‌టాప్‌లో ఆఫీస్‌ వర్క్‌ చేసుకుంటుండగా ఒక్కసారిగా ల్యాప్‌టాప్‌ నుంచి మంటలు చెలరేగాయి. పెద్ద బాంబులాగా అది పేలిపోయింది. ఆ ధాటికి సుమలత తీవ్రంగా గాయపడింది. దీంతో వెంటనే ఆమెను కడపలోని ఓ ప్రైవేట్‌ హాస్పిటల్‌కు తరలించారు బంధువులు.

Read More : Village Volunteer: తూర్పుగోదావరి జిల్లాలో బాలికపై గ్రామ వాలంటీర్ అత్యాచారం

సాఫ్ట్‌ వేర్‌ ఇంజినీర్లు అంతా కరోనా టైమ్‌ నుంచి వర్క్‌ ఫ్రమ్‌ హోమే చేస్తున్నారు. ల్యాప్‌టాప్‌లతో ఇంటి దగ్గరే కుస్తీ పడుతున్నారు. కంటిన్యూస్‌గా పనిచేస్తుండటంతో చార్జింగ్‌ పెట్టుకొని మరీ పని చేస్తున్నారు. ఇలా చేసుకుంటుండగానే బద్వేల్‌లో ల్యాప్‌టాప్‌ పేలింది. మంటలు చెలరేగి ప్రాణాల మీదకు తెచ్చింది. అయితే ఇక్కడ నాసిరకం చార్జర్‌ వల్లే ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. ఏది ఏమైనా సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు జాగ్రత్తగా ఉండాలని ఈ ఘటన హెచ్చరిస్తోంది. చార్జింగ్‌ పెట్టి పని చేయడం ప్రమాదకరమని వార్నింగ్‌ ఇస్తోంది.