Honour Killing : హోంగార్డు రామకృష్ణ మృతదేహానికి నేడు పోస్టుమార్టం

భువనగిరి హత్య కేసులో అల్లున్ని చంపించిన మామ వెంకటేశ్‌ కోసం పోలీసులు వేట కొనసాగిస్తున్నారు. ఈ కేసులో దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు ఇప్పటికే నలుగురిని అరెస్ట్‌ చేశారు. ప్రధాన

Honour Killing : హోంగార్డు రామకృష్ణ మృతదేహానికి నేడు పోస్టుమార్టం

Venkatesh

Honour Killing :  భువనగిరి హత్య కేసులో అల్లున్ని చంపించిన మామ వెంకటేశ్‌ కోసం పోలీసులు వేట కొనసాగిస్తున్నారు. ఈ కేసులో దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు ఇప్పటికే నలుగురిని అరెస్ట్‌ చేశారు. ప్రధాన నిందితుడు వెంకటేశ్‌తో పాటు.. మిగతావారి కోసం గాలిస్తున్నారు.

బిడ్డను ప్రేమ పేరుతో పెళ్లి చేసుకోవడం, తన ఆస్తికి అడ్డు వస్తాడనే అనుమానంతోనే అతన్ని హత్య చేయించినట్టు పోలీసులు గుర్తించారు. ఈ హత్యకు లతీఫ్‌ గ్యాంగ్‌కు పది లక్షలు సుపారీ ఇచ్చినట్టు నిర్దారించారు. ఇటు రామకృష్ణ మృతదేహానికి ఇవాళ గజ్వేల్‌ ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టమ్‌ నిర్వహించనున్నారు.
Also Read :Hyderabad : బంజారాహిల్స్ లో రూ.100కోట్ల స్ధలం కబ్జాకు యత్నం
అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు పోలీసులు. నిన్న లకుడారంలో రామకృష్ణ మృతదేహాన్ని వెలికితీశారు. ఆయన మృతదేహంపై తీవ్రమైన గాయాలున్నట్టు గుర్తించారు. దీనిపై లోతుగా దర్యాప్తు జరుపుతున్నారు.