Hyderabad : బంజారాహిల్స్ లో రూ.100కోట్ల స్ధలం కబ్జాకు యత్నం

హైదరాబాద్‌ నగరం నడిబొడ్డు. బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌కు కూతవేటు దూరం. రోడ్‌ నంబర్‌ 10లో కోట్ల విలువైన భూమి. మార్కెట్‌లో దాని వాల్యూ దాదాపు రూ.100 కోట్లు. ఖాళీగా కనిపించిన

Hyderabad : బంజారాహిల్స్ లో రూ.100కోట్ల స్ధలం కబ్జాకు యత్నం

Land Kabja

Hyderabad :  హైదరాబాద్‌ నగరం నడిబొడ్డు. బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌కు కూతవేటు దూరం. రోడ్‌ నంబర్‌ 10లో కోట్ల విలువైన భూమి. మార్కెట్‌లో దాని వాల్యూ దాదాపు రూ.100 కోట్లు. ఖాళీగా కనిపించిన ఈ స్థలంపై రాయలసీమకు చెందిన ఓ నేత సోదరుడి కన్ను పడింది. ఎలాగైనా దాన్ని కబ్జా చేసేయాలని అనుకున్నాడు. ఇంకేముంది అందుకు ఓ భారీ స్కెచ్‌ వేశాడు.

అది ఏప్రిల్‌ 16. అదే రోజు హనుమాన్‌ జయంతి. పోలీసులంతా శోభాయాత్ర డ్యూటీస్‌లో ఉన్నారు. ఇది ముందే ఊహించిన ఖద్దరు చొక్కా సోదరుడు.. పక్కా స్కెచ్‌ వేశాడు. వందకోట్ల విలువైన భూమిని కబ్జా చేసేందుకు మాస్టర్‌ ప్లాన్‌ వేశాడు. పోలీసులు శోభాయాత్ర విధుల్లో ఉన్నారని తెలుసుకుని… రాయలసీమ రౌడీ బ్యాచ్‌ను దించాడు. ఒక్కొక్కరు కాదు… గుంపులు గుంపులుగా దిగిపోయారు. ఒక్కరు కాదు… ఇద్దరు కాదు.. ఏకంగా 90మంది సీమ రౌడీలు వాహనాల్లో వచ్చారు. రాబందుల్లా ఆ ల్యాండ్‌పై వాలిపోయారు. అడ్డొచ్చిన సెక్యూరిటీ సిబ్బందిపై దాడి చేశారు. తమనే అడ్డుకుంటారా అంటూ విచక్షణా రహితంగా కొట్టారు.

మీకు జల్సా మూవీలోని సీన్‌ గుర్తుందా… సీమ ఫ్యాక్షన్‌ లీడర్‌… ఓ ల్యాండ్‌ సెటిల్‌మెంట్‌ చేస్తాడు. గుంపులు గుంపులుగా కార్లలో ల్యాండ్‌పై వాలిపోతారు. అసలు యజమానిని బెదిరిస్తారు. బాంబులు వేస్తారు. మారణాయుధాలతో దాడి చేసి రక్తపుటేరులు పారిస్తారు. చివరికి తనను ప్రాణాలతో వదలిపెట్టాలని ఆ యజమాని సీమ ఫ్యాక్షనిస్టును ప్రాధేయపడతారు. దీంతో అతడిని వదలిలి వెళ్లిపోతాడు.

బంజారాహిల్స్‌ ల్యాండ్‌ కబ్జాయత్నం కూడా ఈ మూవీ సీన్‌లాగే సేమ్‌ టు సేమ్‌ జరిగింది. ల్యాండ్‌లో ఉన్న సెక్యూరిటీ సిబ్బందిని బెదిరించారు. వినకపోతే దాడి చేశారు. ఆ తర్వాత భూమిని కబ్జా చేశారు. స్థలంలోనే మకాం వేశారు. ఎవరొస్తారో అంతు చూస్తాం అంటూ బెదిరించారు. ప్రాణాలు కావాలో… ల్యాండ్‌ కావాలో తేల్చుకోవాలని బెదిరింపులకు పాల్పడ్డారు. ఇక భూమి తమ వశమైందని సీమ లీడర్‌ సోదరుడు సంబరపడిపోయాడు.

అయితే ఇక్కడ మాత్రం జల్సా సినిమాలోలాగా… సీమ లీడర్‌ పప్పులు ఉడకలేదు. ల్యాండ్‌ ఓనర్‌ సీమ లీడర్‌కు సలాం కొట్టలేదు. తనను వదిలిపెట్టని ప్రాధేయపడనూ లేదు. ఇదంతా లీగల్‌గా తేల్చుకోవడానికే రెడీ అయ్యాడు. సెక్యూరిటీ సిబ్బంది మొరపెట్టుకోవడంతో సీన్‌లోకి ఖాకీలు ఎంటరయ్యారు. అసలేం జరిగిందా అని దర్యాప్తు చేశారు. ప్రాథమిక దర్యాప్తు చేసిన పోలీసులు… 32మంది సీమ రౌడీలను అరెస్ట్‌ చేశారు. మిగిలిన వారి కోసం సెర్చింగ్‌ మొదలుపెట్టారు.
Also Read : Jahangirpuri violence : జహంగీర్‌పురి హింసాకాండలో 22మంది అరెస్ట్.. పుష్ప స్టైల్‌లో కోర్టుకు నిందితుడు..

కోట్ల విలువచేసే ల్యాండ్‌ను కబ్జా చేసేందుకు స్కెచ్‌ ఎవరిదన్న దానిపై ఫోకస్‌ పెట్టారు పోలీసులు. ల్యాండ్ కబ్జా యత్నం వెనుక మాస్టర్‌ మైండ్‌ ఎవరిదన్న దానిపై కూపీ లాగుతున్నారు. ఇప్పటికే అదుపులోకి తీసుకున్న 32మంది సీమ రౌడీలను విచారించారు. వారిచ్చిన సమాచారంతో ఓ అంచనాకు వచ్చారు. కర్నూలు జిల్లాకు చెందిన ఎంపి టీజీ వెంకటేశ్‌ సోదరుడి  కుమారుడు విశ్వప్రసాద్ పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అతడే భూ కబ్జాకు యత్నించాడా.. మరెవరి హస్తమైందా ఉందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.