Brandix : బ్రాండిక్స్ లో మరోసారి గ్యాస్ లీక్…పరుగులు పెట్టిన సెక్యూరిటీ సిబ్బంది

అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్ లోని బ్రాండిక్స్ సీడ్స్ లో మరోసారి విషవాయువు లీక్ అయ్యింది. ఈరోజు ఆదివారం కావటం... ఉద్యోగస్తులు ఎవరూ లేకపోవటంతో పెను ప్రమాదం తప్పింది. కానీ అక్కడే ఉన్న సెక్యూరిటీ సిబ్బంది భయంతో పరుగులు పెట్టారు.

Brandix : బ్రాండిక్స్ లో మరోసారి గ్యాస్ లీక్…పరుగులు పెట్టిన సెక్యూరిటీ సిబ్బంది

Anakapalli Sez

Brandix :  అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్ లోని బ్రాండిక్స్ సీడ్స్ లో మరోసారి విషవాయువు లీక్ అయ్యింది. ఈరోజు ఆదివారం కావటం… ఉద్యోగస్తులు ఎవరూ లేకపోవటంతో పెను ప్రమాదం తప్పింది. కానీ అక్కడే ఉన్న సెక్యూరిటీ సిబ్బంది భయంతో పరుగులు పెట్టారు.

విషయం తెలుసుకున్న పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు హుటాహుటిన సంఘటనా స్ధలానికి చేరుకుని పరిస్ధితిని సమీక్షించారు. మూడు  రోజుల క్రితం బ్రాండిక్స్ సీడ్స్ నుంచి విషవాయువు లీక్ కావటంతో మూడు వందల మందికి పైగా మహిళలు అస్వస్ధతకు  గురైన సంగతి తెలిసిందే.

వీరిని సకాలంలో ఆస్పత్రులకు తరలించటంతో ప్రాణాపాయం తప్పింది. పరిస్ధితి చక్కదిద్దేంత వరకు సెజ్ ను మూసివేసి రెండు రోజులు సెలవు ప్రకటించారు. కాలుష్య నియంత్రణ అధికారులు నిన్నటి  నుంచి సెజ్ లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీలో విషవాయువు ఎక్కడి నుంచి వచ్చిందో అర్ధం  కాని సమయంలో మరోసారి విషవాయువు లీక్ కావటం కలకలం రేపింది.

Also Read : maharashtra: మాజీ సీఎం ఫ‌డ్న‌వీస్‌కు క‌రోనా నిర్ధార‌ణ‌