Girl Students Fight: నడిరోడ్డుపై జట్టు పట్టుకుని కొట్టుకున్న విద్యార్థినిలు: విజయవాడలో ఘటన

ఇద్దరు కాలేజీ విద్యార్థినిలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. అమ్మాయిలమనే సంగతే మర్చిపోయి నడిరోడ్డుపై జుట్టు పట్టుకుని మరి కొట్టుకున్నారు

Girl Students Fight: నడిరోడ్డుపై జట్టు పట్టుకుని కొట్టుకున్న విద్యార్థినిలు: విజయవాడలో ఘటన

Fight

Girl Students Fight: కళాశాలకు వెళ్లి ఉన్నత చదువులు చదివి దేశ భవిష్యత్తును తీర్చి దిద్దాల్సిన విద్యార్థులు పెడదోవపడుతున్నారు. విద్యార్థులమనే సంగతి మరచి నడిరోడ్డుపై యువతులు రచ్చ చేసిన ఘటన విజయవాడ నగరంలో చోటుచేసుకుంది. శుక్రవారం వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ఇద్దరు కాలేజీ విద్యార్థినిలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. అమ్మాయిలమనే సంగతే మర్చిపోయి నడిరోడ్డుపై జుట్టు పట్టుకుని మరి కొట్టుకున్నారు. పక్కనే ఉన్న మరికొందరు విద్యార్థులు ఆపే ప్రయత్నం చేసినా..ఆ ఇద్దరు విద్యార్థినిలు వెనక్కు తగ్గలేదు సరికదా, ఒకరినొకరు దుర్భాషలాడుకుంటూ నానా హంగామా సృష్టించారు. ప్రేమ వ్యవహారమే విద్యార్థినిల ఘర్షణకు కారణమై ఉంటుందని తోటి విద్యార్థులు తెలిపినట్టు స్థానికులు వివరించారు.

Also read:Gems Land Capture: బంజారాహిల్స్ ల్యాండ్ కబ్జా కేసులో సూత్రధారుల కోసం పోలీసులు ముమ్మర గాలింపు

ఈ తతంగాన్ని అక్కడే ఉన్న స్థానికుడొకరు సెల్ ఫోన్లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అవి కాస్త వైరల్ అయ్యాయి. కొట్టుకున్న విద్యార్థినిలు విజయవాడ కేబీఎన్ కాలేజీకి చెందిన వారుగా స్థానికులు పేర్కొన్నారు. కాలేజీ స్టూడెంట్లమనే విషయాన్నే మరిచి జుట్టు పట్టుకుని నడి రోడ్డుపై ఇష్టం వచ్చినట్లు కొట్టుకున్నారు ఇద్దరు. అందరూ చూస్తుండగానే విద్యార్థినిలు అలా దాడి చేసుకోవడంతో స్థానికులు అవాక్కయ్యారు. అయితే ఈ వ్యవహారంపై కళాశాల యాజమాన్యం విద్యార్థినుల పై ఎలాంటి చర్యలు తీసుకుంటుందో తెలియాల్సి ఉంది.

Also read: Luxury Car Thief : పోలీసులకే సవాల్ విసిరిన లగ్జరీ కార్ల దొంగ సత్యేంద్ర అరెస్ట్..!