Gems Land Capture: బంజారాహిల్స్ ల్యాండ్ కబ్జా కేసులో సూత్రధారుల కోసం పోలీసులు ముమ్మర గాలింపు

హైదరాబాద్ నగరంలో సంచలనం కలిగించిన రూ.100 కోట్ల ల్యాండ్ కబ్జా కేసులో అసలు సూత్రధారుల కోసం పోలీసులు ముమ్మర గాలింపు చేపడుతున్నారు

Gems Land Capture: బంజారాహిల్స్ ల్యాండ్ కబ్జా కేసులో సూత్రధారుల కోసం పోలీసులు ముమ్మర గాలింపు

Bhills

Gems Land Capture: హైదరాబాద్ నగరంలో సంచలనం కలిగించిన రూ.100 కోట్ల ల్యాండ్ కబ్జా కేసులో అసలు సూత్రధారుల కోసం పోలీసులు ముమ్మర గాలింపు చేపడుతున్నారు. ఈ కేసులో ఇప్పటికే మొత్తం 58 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టు ఆదేశాలతో వారిని రిమాండుకు తరలించారు. కేసులో అసలు నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. హైదరాబాద్ నగర నడిబొడ్డులోని బంజారాహిల్స్ రోడ్ నంబర్10లో..ఉన్న ఏపీ జెమ్స్ అండ్ జ్యూవెలర్స్ పార్క్ స్థలాన్ని..సినిమా షూటింగ్ అంటూ వచ్చిన కొందరు వ్యక్తులు కబ్జాకు యత్నించారు. ఈకేసులో నిందితులు స్థలాన్ని కబ్జా కోసం యత్నించినట్లు స్పష్టమైన ఆధారాలు సేకరించిన పోలీసులు…ఆమేరకు ఆరోజు స్థలాన్ని ఆక్రమించుకునేందుకు వచ్చిన వారిని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ కబ్జా కేసులో ఏ1 నిందితుడైన టీజీ విశ్వప్రసాద్ తో పాటు..పరారీలో ఉన్న సుభాష్ పులిశెట్టి, మిధున్ కుమార్ అనే మరికొందరి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.

Also read:Crime news : పూజకోసం గుడికొచ్చిన భక్తురాలిని హత్యచేసిన పూజారి.. అరెస్ట్ చేసిన పోలీసులు..

ఏ1 విశ్వప్రసాద్ ప్రస్తుతం అమెరికాలో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు..ఆమేరకు ఆయన్ను నగరానికి రప్పించేందుకు భారత దౌత్య కార్యాలయానికి పోలీసులు లేఖ రాయనున్నారు. ఇక ఈ కేసులో ఏ5గా ఉన్న రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ అరెస్ట్ అంశంపై న్యాయ సలహా కొరనున్నారు. టీజీ వెంకటేష్ అరెస్ట్ పై ముందే రాజ్యసభ వైస్ చైర్మన్ కు సమాచారం ఇవ్వాలా ?..లేక అదుపులోకి తీసుకున్నాక తెలపాలా అనే అంశంపై పోలీసులు ఆలోచన చేస్తున్నారు. కేసులో ప్రధాన నిందితుల వాంగ్మూలం ఆధారంగానే ఎంపీ టీజీ వెంకటేష్ ను ఏ5గా చేర్చబడిందని పోలీసులు పేర్కొన్నారు. బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 10లోని ఈ స్థలాన్ని సినిమా షూటింగ్ పేరుతో పక్కా వ్యూహంతోనే నిందితులు ఈ స్థలాన్ని కబ్జా చేసేందుకు యత్నించారని పోలీసులు తమ రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.

Also read:Rajasthan Court: సంతానం కావాలి నా భర్తను పంపించండి: జైలులో ఉన్న భర్త కోసం భార్య పిటిషన్

కొందరు వ్యక్తులు ఆక్రమించుకునేందుకు వచ్చారంటూ స్థలానికి కాపలాదారుడిగా ఉన్న వ్యక్తి నుంచి సమాచారం అందిందని..అక్కడికి వెళ్లి చూడగా కొందరు వ్యక్తులు కత్తులు, కర్రలు పట్టుకుని, జేసీబీ, కంటైనర్, కెమెరా వంటి ప్రాపర్టీతో అచ్చు సినిమా షూటింగ్ సెటప్ చేశారని పోలీసులు నివేదించారు. అక్కడున్న వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వారంతా ఆదోని, మంత్రాలయం, నుంచి వచ్చిన వారీగా గుర్తించారు. ఈ కేసులో కీలక నిందితుల అరెస్ట్ అనంతరం మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంది.

Also read:Matrimony Site Cheat : మ్యాట్రిమోనీ సైట్‌లో పరిచయమైంది, పెళ్లి చేసుకుంటానంది.. కట్ చేస్తే రూ.46 లక్షలు కాజేసింది