Rajasthan Court: సంతానం కావాలి నా భర్తను పంపించండి: జైలులో ఉన్న భర్త కోసం భార్య పిటిషన్

జైలు శిక్ష అనుభవిస్తున్న తన భర్త ద్వారా సంతానం పొందే హక్కు ఉందంటూ ఓ మహిళ..కోర్టును ఆశ్రయించగా..స్పందించిన కోర్టు భర్తను 15 రోజుల పెరోల్ పై విడుదల చేసింది.

Rajasthan Court: సంతానం కావాలి నా భర్తను పంపించండి: జైలులో ఉన్న భర్త కోసం భార్య పిటిషన్

Rajasthan

Rajasthan Court: జైలు శిక్ష అనుభవిస్తున్న తన భర్త ద్వారా సంతానం పొందే హక్కు ఉందంటూ ఓ మహిళ..కోర్టును ఆశ్రయించగా..స్పందించిన కోర్టు భర్తను 15 రోజుల పెరోల్ పై విడుదల చేసింది. చట్టపరంగా అరుదుగా చెప్పుకునే ఈ ఘటన రాజస్థాన్ లో చోటుచేసుకుంది. అందిన సమాచారం మేరకు.. రాజస్థాన్ కు చెందిన నందలాల్(34) అనే వ్యక్తి ఓ కేసు విషయంలో జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. ఈక్రమంలో నందలాల్ భార్య..తన భర్తతో కలిసి సంతానం పొందేందుకు కోర్టును ఆశ్రయించింది. మహిళలకు స్వతహాగా ఉన్న “సంతానం యొక్క హక్కు”ను ఉపయోగించుకుని కోర్టును ఆశ్రయించింది సదరు మహిళ. మహిళ పిటిషన్ ను జోధ్‌పూర్ హై కోర్ట్ ధర్మాసనం విచారణకు స్వీకరించింది. విచారణ అనంతరం న్యాయమూర్తులు సందీప్ మెహతా మరియు ఫర్జాంద్ అలీలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం నందలాల్ కు 15 రోజుల పాటు పెరోల్ పై విడుదల చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు.

Also read:Minor Mother: పెళ్లికాకుండా 17 ఏళ్లకే తల్లి అయిన బాలిక, 12 ఏళ్ల బాలుడే కారణం?

“నందలాల్ భార్య నిర్దోషి అని మరియు “వైవాహిక జీవితాలతో ముడిపడి ఉన్న ఆమె లైంగిక మరియు భావోద్వేగ అవసరాలు భర్త యొక్క ఖైదు కారణంగా ప్రభావితమవుతున్నాయి” అని న్యాయమూర్తులు తమ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఖైదీ యొక్క జీవిత భాగస్వామి సంతానం పొందే హక్కును కోల్పోలేరని కూడా భావించడం సముచితమైనది” అని ధర్మాసనం ఏప్రిల్ 5 నాటి ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ పిటిషన్ విచారణ సందర్భంగా న్యాయస్థానం ఋగ్వేదంతో సహా హిందూ గ్రంధాలను ఉదహరించింది. అలాగే జుడాయిజం, క్రిస్టియానిటీ మరియు కొన్ని ఇతర మతాల సిద్ధాంతాలను సూచించింది. “మేము విషయాన్ని మతపరమైన కోణంతో చూస్తే; హిందూ తత్వశాస్త్రం ప్రకారం, గర్భధాన్, అంటే గర్భ సంపదను పొందడం 16 మతకర్మలలో మొదటిది” అని ధర్మాసనం వివరించింది.

Also read:Matrimony Site Cheat : మ్యాట్రిమోనీ సైట్‌లో పరిచయమైంది, పెళ్లి చేసుకుంటానంది.. కట్ చేస్తే రూ.46 లక్షలు కాజేసింది

చట్టపరమైన అంశాన్ని ప్రదర్శిస్తూ, రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 కింద హామీ ఇచ్చినట్లుగా సంతానం పొందే హక్కును జీవించే ప్రాథమిక హక్కుతో కోర్టు అన్వయించింది. “చట్టం ద్వారా ఏర్పరచబడిన ప్రక్రియ ప్రకారం తప్ప ఏ వ్యక్తి తన జీవితాన్ని మరియు వ్యక్తిగత స్వేచ్ఛను కోల్పోకూడదని రాజ్యాంగం హామీ ఇస్తుంది. దాని పరిధిలో ఖైదీలు కూడా ఉన్నారు” అని ఈసందర్భంగా న్యాయమూర్తులు చెప్పారు. ఓ కేసు విషయంలో రాజస్థాన్‌లోని భిల్వారా కోర్టు నందలాల్ కు 2019లోజీవిత ఖైదు విధించింది. అజ్మీర్ సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. కోర్టు ఉత్తర్వుల ప్రకారం ఇటీవలే అతన్ని విడుదల చేశారు అధికారులు. గతంలో 2021లోనూ నందలాల్ 20 రోజుల పెరోల్ పై బయటకు వచ్చారు.

Also Read:AP Covid : ఏపీలో మెల్లిగా పెరుగుతున్న కరోనా కేసులు… 24 గంటల్లో..