Mahesh Babu Vs Allu Arjun : మహేష్ బాబుతో పోటీకి అల్లు అర్జున్.. రాజమౌళి వర్సెస్ అట్లీ.. బన్నీ సినిమా రిలీజ్ ఫిక్స్..
టాలీవుడ్ లో అందరి చూపు రెండు సినిమాల మీదే ఉంది. ఒకటి రాజమౌళి - మహేష్ బాబు అయితే ఇంకోటి అల్లు అర్జున్ - అట్లీ. (Mahesh Babu Vs Allu Arjun)
Mahesh Babu Vs Allu Arjun
Mahesh Babu Vs Allu Arjun : ప్రస్తుతం టాలీవుడ్ లో అందరి చూపు రెండు సినిమాల మీదే ఉంది. ఒకటి రాజమౌళి – మహేష్ బాబు అయితే ఇంకోటి అల్లు అర్జున్ – అట్లీ. ఈ రెండు కాంబోలు ఎవరూ ఊహించనివి, మొదటి సారి కావడం, ఇద్దరూ భారీగా సినిమాలు తీయడం, వరుస హిట్స్ తో ఉన్న దర్శకులు కావడంతో ఈ రెండు సినిమాలపై భారీ అంచనాలు ఉన్నాయి.(Mahesh Babu Vs Allu Arjun)
ఇటీవలే రాజమౌళి – మహేష్ బాబు సినిమా వారణాసి అనే టైటిల్ ప్రకటించి 2027 సమ్మర్ లో రిలీజ్ చేస్తామని తెలిపారు. అందుకోసం భారీ ఈవెంట్ ని నిర్వహించారు. దీంతో ఈ సినిమా 2027 ఏప్రిల్ లో ఉగాదికి రిలీజ్ అవుతుందని సమాచారం. ఇందుకోసం రాజమౌళి శరవేగంగా సినిమాని తీస్తున్నాడు. ఇప్పటికే మూడు షెడ్యూల్స్ షూటింగ్ అవ్వగా త్వరలో నాలుగో షెడ్యూల్ షూటింగ్ హైదరాబాద్ లో వేసిన సెట్లో జరగనుంది. ఈ సినిమాతో రాజమౌళి హాలీవుడ్ ని టార్గెట్ చేసాడు.
Also Read : Star Heroine : స్టార్ హీరోయిన్.. మహేష్ బాబు సినిమా ఫ్లాప్ అవ్వడం వల్లే.. టాలీవుడ్ కి దూరమయిందట..
ఇక మరోవైపు తమిళ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో హాలీవుడ్ రేంజ్ లో సై ఫై యాక్షన్ సినిమా తీస్తున్నాడు అల్లు అర్జున్. ఈ సినిమాలో గ్రాఫిక్ వర్క్ ఎక్కువ ఉందని, హాలీవుడ్ సినిమాలకు పనిచేసిన సంస్థలు దీనికి పని చేస్తున్నాయని మూవీ యూనిట్ ఇప్పటికే ప్రకటించింది. బన్నీ – అట్లీ సినిమా షూటింగ్ ముంబైలో జరుగుతుంది. ఇందులో బన్నీ ట్రిపుల్ రోల్ అని టాక్ రావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే తాజా సమాచారం ప్రకారం బన్నీ – అట్లీ సినిమా కూడా 2027 సమ్మర్ లో రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారట. 2026 మే వరకు షూటింగ్ మొత్తం అవగొట్టేలా ప్లాన్ చేశారట.
దీంతో మహేష్ బాబు – అల్లు అర్జున్ ఒకేసారి కాకపోయినా అటు ఇటుగా నెల రోజుల గ్యాప్ లో తమ సినిమాలతో ప్రేక్షకుల ముందుకొస్తారని తెలుస్తుంది. దీంతో ఈ రెండు సినిమాల మధ్య పోటీ ఉండటం ఖాయం. బన్నీ – అట్లీ సినిమా 800 కోట్లతో తెరకెక్కుతుండగా పాన్ ఇండియా వైడ్ రిలీజ్ అవ్వనుంది. 2000 కోట్ల కలెక్షన్స్ టార్గెట్ గా ఈ సినిమా రానుంది.
Also Read : Samantha : ఇకనైనా ఆపండి.. వేధింపులపై సమంత పోరాటం.. వీడియో వైరల్..
ఇక రాజమౌళి – మహేష్ బాబు వారణాసి సినిమా 1200 కోట్లతో తెరకెక్కుతుండగా హాలీవుడ్ ని టార్గెట్ పెట్టుకొని రిలీజ్ కానుంది. 3000 కోట్ల కలెక్షన్స్ టార్గెట్ పెట్టుకున్నారు ఈ సినిమాకు. దీంతో 2027 సమ్మర్ మహేష్ బాబు వర్సెస్ అల్లు అర్జున్, రాజమౌళి వర్సెస్ అట్లీ వార్ జరగనుంది అని ఫ్యాన్స్, నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
