Samantha : ఇకనైనా ఆపండి.. వేధింపులపై సమంత పోరాటం.. వీడియో వైరల్..
తాజాగా సమంత పెట్టిన ఓ వీడియో వైరల్ గా మారింది.(Samantha)
Samantha
Samantha : సమంత ప్రస్తుతం సినిమాలు తగ్గించి బిజినెస్ లు చేస్తూ ఆరోగ్యం పై దృష్టి పెట్టి, హెల్త్ కి సంబంధించిన వీడియోలు చేస్తూ ప్రచారం చేస్తుంది. తాజాగా సమంత పెట్టిన ఓ వీడియో వైరల్ గా మారింది.(Samantha)
సోషల్ మీడియాలో మహిళల మీద వేధింపులు, నెగిటివ్ కామెంట్స్ ఇలాంటి వాటికి వ్యతిరేకంగా పోరాడాలంటూ సమంత ముందుకొచ్చింది. ఐక్యరాజ్యసమితితో కలిసి ఈ విషయంలో సమంత పనిచేయనుంది. యూఎన్ విమెన్ ఇండియా నిర్వహించే NO Excuse కార్యక్రమంలో సమంత భాగమైంది. నవంబర్ 25 నుంచి డిసెంబర్ 10 వరకు 16 రోజుల పాటు జరగనున్న ఈ కార్యక్రమంలో సమంత పాల్గొంటున్నట్టు, తనతో మీరు కూడా పాల్గొనండి అని తెలుపుతూ ఓ వీడియో పోస్ట్ చేసింది.
Also Read : Star Heroine : స్టార్ హీరోయిన్.. మహేష్ బాబు సినిమా ఫ్లాప్ అవ్వడం వల్లే.. టాలీవుడ్ కి దూరమయిందట..
ఈ వీడియో సమంత మాట్లాడుతూ.. మహిళల మీద హింసని ముగించాలి అనే కార్యక్రమం సందర్భంగా మీకొక మెసేజ్. మనం హింస గురించి ఆలోచించినప్పుడు వీధుల్లో, ఇంట్లో, వర్క్ ప్లేసెస్ లో జరుగుతుంది అనుకుంటాము. కానీ ఇవాళ ఆన్లైన్ లో కూడా జరుగుతుంది. ముగ్గురిలో ఒక మహిళ హింసని ఎదుర్కొంటుంది. ఆన్లైన్ హింస చాలా మంది మహిళలను ప్రభావితం చేస్తుంది. ఆన్లైన్ లో వేధింపులు, వెంబడించడం, డీప్ ఫేక్, టాక్సిసిటి.. ఇవన్నీ జరుగుతున్నాయి. వీటి వల్ల మహిళలలో భయం, సైలెన్స్ ఏర్పడుతుంది. ఇది ఒక కామెంట్, మెసేజ్, ఫేక్ ఫోటోతో మొదలైనా ఒకరి జీవితంతో ఎండ్ అవుతుంది. ఇప్పటికే బయట చాలా మంది మహిళల జీవితాలు కెరీర్ ఆగిపోయాయి, కాన్ఫిడెన్స్ పోయింది. ఇప్పుడు ఆన్లైన్ లో వైలెన్స్ కూడా హానికరం. ఇది నివారించాలి. ఆన్లైన్ లో అబ్యూజ్ చేయడాన్ని జోక్ గా ట్రీట్ చేయడం ఆపేస్తే మనం ఇంటర్నెట్ ని బెటర్ గా మార్చొచ్చు. ఇది మహిళలకు భద్రతగా మారుతుంది అని తెలిపింది.
View this post on Instagram
Also See : NBK 111 Movie Opening : గ్రాండ్ ఓపెనింగ్.. బాలయ్య – నయనతార కొత్త సినిమా.. NBK 111 ఫొటోలు..
