Tollywood Heros : నిజంగా జరిగితే ఎంత బాగుండో.. స్టార్ హీరోలు ఒకే చోట చాయ్ తాగుతూ.. వైరల్ అవుతున్న AI ఫొటోలు..

తెలుగు సినిమాకి సంబంధించిన స్టార్లంతా ఓ చోట మీట్ అయితే ఎలా ఉంటుందనే కాన్సెప్ట్‌ని అప్లై చేస్తూ ఏఐ ఫొటోలతో మనసు గెలుచుకుంటున్నారు. (Tollywood Heros)

Tollywood Heros : నిజంగా జరిగితే ఎంత బాగుండో.. స్టార్ హీరోలు ఒకే చోట చాయ్ తాగుతూ.. వైరల్ అవుతున్న AI ఫొటోలు..

Tollywood Heros

Updated On : November 26, 2025 / 5:43 PM IST

Tollywood Heros : సోషల్ మీడియాలో ప్రస్తుతం ఏఐ ట్రెండ్ నడుస్తోంది. దాన్ని మన సినిమా ఫ్యాన్స్ వాడుకుంటూ తమ క్రియేటివిటీకి పదును పెడుతున్నారు. ఫ్యాన్స్ సరదా ఆలోచనలను పర్ఫెక్ట్‌ రూపం ఇస్తోంది ఏఐ. వాడేది ఏ టూల్ అయినా కానీ ఏఐ ఫోటోలు ఇప్పుడు సోషల్‌ మీడియాని ముంచెత్తుతున్నాయి.(Tollywood Heros)

తాజాగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన టాప్ స్టార్లంతా ఓ చోట మీట్ అయితే ఎలా ఉంటుందనే కాన్సెప్ట్‌ని అప్లై చేస్తూ ఏఐ ఫొటోలతో ఆడియెన్స్ మనసు గెలుచుకుంటున్నారు. ఫ్యాన్స్ అంటే ఇతర హీరోలపై నెగటివ్ కామెంట్స్ పెడుతూ, ట్రోల్స్ చేసేవాళ్లు. ఇప్పుడు చాలా మంది సోషల్ మీడియాలో అదే చేస్తున్నారు. మన పనులు మానుకొని మరీ పక్క హీరోలను ఎలా నెగిటివ్ చేయాలి, పక్క హీరోల సినిమాలను ఎలా నాశనం చేయాలనే ఆలోచిస్తున్నారు. హీరోలంతా వాళ్లకు వాళ్ళు బాగానే ఉన్నా ఫ్యాన్స్ మాత్రం మారట్లేదు. మారమని హీరోలే స్వయంగా చెప్పినా వినట్లేదు.

Also Read : Mahesh Babu Vs Allu Arjun : మహేష్ బాబుతో పోటీకి అల్లు అర్జున్.. రాజమౌళి వర్సెస్ అట్లీ.. బన్నీ సినిమా రిలీజ్ ఫిక్స్..

ఇలాంటి సమయంలో పలువురు నెటిజన్లు స్టార్ హీరోలు అంతా కలిసి సరదాగా రాత్రి పూట చాయ్ తాగితే ఎలా ఉంటుంది అనే ఆలోచనకు ఏఐ వాడి ఫోటోలను జనరేట్ చేసారు. ఇంకేముంది ఈ ఫొటోలు వైరల్ గా మారాయి. అంతే కాకుండా ఈ కూల్ సీజన్‌లో ఓ రాత్రిపూట టీస్టాల్స్ దగ్గర కూర్చుని హీరోలు, దర్శకులు మాట్లాడుకుంటే ఎలా ఉంటుంది, వాళ్ల మధ్య ఎలాంటి స్టోరీ సిట్టింగ్స్ నడుస్తాయ్.. ఇలాంటి థీమ్‌లతో ఏఐ సాయంతో చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Tollywood Star Heros Meets at One Place AI Photos goes Viral

అసలు హైలైట్ ఏమిటంటే ఈ ఏఐ ఫోటోలలో హీరోలకి ఇచ్చిన కాస్ట్యూమ్స్, వాళ్లు నిలబడే పద్దతి నుంచి హావభావాల వరకూ మనం చెప్తే కానీ ఏఐ ఫోటోలని వెంటనే గుర్తు పట్టలేనంతగా క్రియేటర్లు వీటిని తయారు చేసి ఇంటర్నెట్‌ని ఊపేస్తున్నారు. మహేశ్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్, ప్రభాస్‌, రామ్ చరణ్, నాని కలిసి టీ తాగుతుంటే ఎలా ఉంటుందనే ఊహకి ఈ ఫోటోలకు ప్రతిరూపం. కొంతమంది అయితే ఏకంగా వీడియోలు కూడా తయారు చేస్తున్నారు అందరు హీరోలు కలిసి సరదాగా తిరుగుతున్నట్టు.

Also Read : Samantha : ఇకనైనా ఆపండి.. వేధింపులపై సమంత పోరాటం.. వీడియో వైరల్..

మొత్తానికి కొంతమంది సరదాగా చేసినా ఈ ఏఐ ఫొటోలు వైరల్ గా మారుతున్నాయి. ఇవి చూసైనా ఫ్యాన్స్ మారి వేరే హీరోలపై, వేరే హీరోల సినిమాలపై నెగిటివ్ ప్రచారం చేయకుండా ఉంటే అదే మంచిది సినీ పరిశ్రమకు.

Tollywood Star Heros Meets at One Place AI Photos goes Viral