Matrimony Site Cheat : మ్యాట్రిమోనీ సైట్‌లో పరిచయమైంది, పెళ్లి చేసుకుంటానంది.. కట్ చేస్తే రూ.46 లక్షలు కాజేసింది

ఓ మహిళ పెళ్లి పేరుతో ఘరానా మోసానికి పాల్పడింది. ఓ వ్యక్తి నుంచి ఏకంగా రూ.46లక్షలు కాజేసింది.

Matrimony Site Cheat : మ్యాట్రిమోనీ సైట్‌లో పరిచయమైంది, పెళ్లి చేసుకుంటానంది.. కట్ చేస్తే రూ.46 లక్షలు కాజేసింది

Matrimony Site Cheat

Matrimony Site Cheat : మోసగాళ్లు రెచ్చిపోతున్నారు. కొత్త కొత్త పద్ధతుల్లో మోసాలకు పాల్పడుతున్నారు. మాయ మాటలతో నమ్మించి డబ్బులు దోచుకుంటున్నారు. మగాళ్లే కాదు కొందరు మహిళలు కూడా చీటింగ్ చేస్తున్నారు. తాజాగా ఓ మహిళ పెళ్లి పేరుతో ఘరానా మోసానికి పాల్పడింది. ఓ వ్యక్తి నుంచి ఏకంగా రూ.46లక్షలు కాజేసింది.

హైదరాబాద్ కి చెందిన ఓ వ్యక్తి మాట్రిమోనీ సైట్ లో ప్రొఫైల్ పెట్టాడు. ఓ యువతి నుంచి అతడికి మేసేజ్ వచ్చింది. నీ ప్రొఫైల్ నచ్చింది, నిన్ను పెళ్లి చేసుకుంటానని ఆ యువతి అతడిని నమ్మించింది. ఆ తర్వాత పలు కారణాలు చెప్పి అతడి నుంచి డబ్బు గుంజడం స్టార్ట్ చేసింది. తాను ఇంజనీరింగ్ చదువుతున్నానని.. కాలేజీ ఫీజులు కట్టాలని ఓసారి డబ్బు తీసుకుంది.

Crime news : ప్రియుడితో కలిసి భర్తను హత్యచేసిన ఇల్లాలు.. మూడ్నెళ్ల తరువాత వీడిన మిస్టరీ.. ఎలా దొరికారంటే?

తనకు, తన తల్లికి కోవిడ్ వచ్చిందని మరోసారి డబ్బు గుంజింది. ఇలా పలు కారణాల చెప్పిన కిలేడీ.. యువకుడిని మోసం చేసింది. బాధితుడి నుండి విడతల వారిగా రూ.46 లక్షలు కాజేసింది. ఎంత డబ్బు ఇచ్చినా ఇంకా డబ్బు అడుగుతోంది. పైగా పెళ్లి మాట ఊసెత్తడం లేదు. దీంతో బాధితుడికి అనుమానం వచ్చింది. తాను మోసపోయానని తెలుసుకుని లబోదిబోమన్నాడు. వెంటనే హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతడి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు.

మ్యాట్రిమోనీ సైట్లు, సోషల్ మీడియా సైట్లు, సోషల్ మీడియా యాప్ ల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తూనే ఉన్నారు. అపరిచితులతో పరిచయాలు వద్దని వారిస్తూనే ఉన్నారు. ముందు వెనుకా చూసుకోకుండా పరిచయాలు చేస్తే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చాలాసార్లు చెప్పారు. ఆ తర్వాత ఎంత చింతించిన ప్రయోజనం ఉండదు. పోలీసులు ఎంత చెప్పినా ఇంకా కొందరిలో మార్పు రావడం లేదు. గుడ్డి నమ్మేసి అడ్డంగా మోసపోతున్నారు.

pushpa: ‘సర్‌ప్రైజ్‌’కు ముందు సెల్ఫీ.. ఫొటో వైరల్!

అటు సైబర్ క్రిమినల్స్ కూడా రెచ్చిపోతున్నారు. కొత్త కొత్త పద్ధతుల్లో మోసాలకు పాల్పడుతున్నారు. జనాల అమాయకత్వాన్ని క్యాష్ చేసుకుంటున్నారు.

 

మెడికల్ సీట్ల పేరుతో సైబర్ కేటుగాళ్లు ఏకంగా రూ.20 లక్షలు దోచుకున్నారు. ఎంబీబీఎస్ మెడికల్ సీట్లు ఇప్పిస్తామని నమ్మించి రూ.20 లక్షలు కాజేశారు. హైదరాబాద్ కి చెందిన ముగ్గురు విద్యార్థులు ఈ విధంగా మోసపోయారు. తాము మోసపోయామని తెలుకున్న బాధితులు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.