Home » Marriage cheating
విడాకులు తీసుకున్న వారు, లేటు వయస్సు పెళ్లి కొడుకులే ఆమె టార్గెట్. మ్యారేజి బ్రోకర్లను సంప్రదించి వారి ద్వారా అలాంటి వారిని సంప్రదించి వారిని పెళ్లి చేసుకుంటుంది. ఆతర్వాత వారి ఆస్తులను కాజేయటం ఆమె పనిగా పెట్టుకుందని మూడో భర్త ఆరోపించాడు.
ఓ మహిళ పెళ్లి పేరుతో ఘరానా మోసానికి పాల్పడింది. ఓ వ్యక్తి నుంచి ఏకంగా రూ.46లక్షలు కాజేసింది.
భార్యకు తెలియకుండా రెండో పెళ్లి చేసుకుంటున్న భర్తను భార్య రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని పోలీసులకు అప్పగించిన ఘటన కృష్ణాజిల్లాలో చోటు చేసుకుంది.
రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలో ఓ 40 ఏళ్ల వ్యక్తి మహిళ చేతిలో ఇలాగే మోసపోయాడు. పెళ్లైన రెండో రోజే ఇంట్లో ఊన్న నగదు, బంగారం, వెండి తీసుకుని పరారయ్యింది ఆ పెళ్లి కూతురు.
ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తి మోసం చేయడంతో హిజ్రా బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది.
ఉత్తరప్రదేశ్లోని బరేలిలో దారుణం చోటు చేసుకుంది. పెళ్లైన 10 రోజులకు భార్యకు కడుపు నొప్పి వచ్చింది. పరీక్షలు చేయగా ఆమె 8వ నెల గర్భవతని తేలింది. దీంతో కొత్త పెళ్లికొడుకు స్పృహతప్పాడు
మ్యాట్రిమోనీ సైట్లలో యువతులకు ఎర వేశాడు. బట్టతలను దాచి...పలువురు యువతులను మోసగించి...రూ. లక్షల్లో నగదు లూటీ చేశాడు.
మ్యాట్రిమోనియల్ వెబ్ సైట్ లో పరిచయం చేసుకుని పెళ్ళి చేసుకందామని చెప్పి హైదరాబాద్ కు చెందిన యువతి నుంచి రూ.10 లక్షలు దండుకున్ననైజీరియన్ ను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు.
ప్రేమ పేరుతో వల విసిరి, అనాధనంటూ మగవారికి దగ్గరవుతుంది. తనకు ఎవరూ తోడు లేరంటూ వారిని పెళ్లి చేసుకుంటుంది. అనంతరం వారి వద్దనుంచి డబ్బులు, నగదు తీసుకుని ఉడాయిస్తున్న కిలాడీ లేడీని చిత్తూరు జిల్లా అలిపిరి పోలీసులు అరెస్ట్ చేశారు.