Marriage Cheating : భర్త చేసుకోబోయిన మూడు పెళ్లిళ్లను అడ్డుకున్న భార్య
భార్యకు తెలియకుండా రెండో పెళ్లి చేసుకుంటున్న భర్తను భార్య రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని పోలీసులకు అప్పగించిన ఘటన కృష్ణాజిల్లాలో చోటు చేసుకుంది.

marriage
Marriage Cheating : భార్యకు తెలియకుండా రెండో పెళ్లి చేసుకుంటున్న భర్తను భార్య రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని పోలీసులకు అప్పగించిన ఘటన కృష్ణాజిల్లాలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే నల్గోండ జిల్లా భువనగిరికి చెందిన మధుబాబు అనే వ్యక్తికి హైదరాబాద్ బోడుప్పల్ కు చెందిన కళ్యాణి( పేరు మార్చాము) అనే యువతితో నాలుగేళ్ల క్రితం వివాహాం అయ్యింది. అత్తింటి వారి వరకట్న వేధింపుల కారణంగా గత 3 ఏళ్ళుగా కళ్యాణి పుట్టింట్లోనే ఉంటోంది. ఈవిషయమై భువనగిరి పోలీసు స్టేషన్ లో కేసు కూడా నమోదయ్యింది. కేసు కోర్టు విచారణలో ఉంది.
ఈనేపధ్యంలో మధుబాబు గతంలో రెండుసార్లు కళ్యాణికి తెలియకుండా పెళ్లి చేసుకోవాలని చూసినా ఆమె వాటిని అడ్డుకుంది. తాజాగా ముడోసారి కూడా కళ్యాణికి తెలియకుండా పెళ్లి చేసుకోనే ప్రయత్నం చేశాడు. ఈ సారి మధుబాబు కోదాడ సమీపంలోని గ్రామానికి చెందిన యువతిని పెళ్లి చేసుకునేందుకు ఆదివారం కృష్ణాజిల్లాపెనుగంచిప్రోలులోని తిరుపతమ్మ ఆలయానికి వచ్చాడు.
ఆలయంలో పెద్ద తిరునాళ్లు జరుగుతూ ఉండటంతో ఆలయం అంతా రద్దీగా ఉంది. మధుబాబు కొత్త భార్యతో పీటల మీద కూర్చుని ఉన్నాడు. ఈలోపు కళ్యాణి తన కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి పెళ్లి కుమారుడిగా ఉన్న మధుబాబుపై దాడి చేసి వివాహాన్ని అడ్డుకుంది. గతంలో జరిగిన వివాహం.. మధుబాబు మళ్లీ రెండు సార్లు వివాహాం చేసుకోవాలని చేసిన ప్రయత్నాలను ఆడపెళ్లివారికి వివరించింది.
Also Read : Karnataka : కర్నాటక శివమొగ్గలో పాఠశాలలు మూసివేత
దీంతో వారు మధుబాబు కుటుంబ సభ్యులపై ఆగ్రహించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. కళ్యాణి ఆమె కుటుంబ సభ్యులు మధుబాబును స్ధానిక పోలీసుస్టేషన్‌కు తీసుకురాగా…. ఇప్పటికే భువనగిరిలో కేసు ఉన్నందున పెనుగంచిప్రోలులో కేసు అవసరంలేదని ఎస్సై చెప్పటంతో వారు హైదారాబాద్ బయలు దేరి వెళ్లిపోయారు.