Karnataka : కర్నాటక శివమొగ్గలో పాఠశాలలు మూసివేత

శివమొగ్గలోని సీగెహెట్టిలో ఓ వ్యక్తిని దారుణంగా హతమార్చారు గుర్తు తెలియని దుండగులు. చనిపోయిన వ్యక్తి హర్షగా గుర్తించారు. ఇతను వృత్తిరీత్యా టైలర్ తో పాటు భజరంగ్ దళ్ కార్యకర్తగా ఉన్నా

Karnataka : కర్నాటక శివమొగ్గలో పాఠశాలలు మూసివేత

Karnataka Shivamogga: కర్నాటక రాష్ట్రంలోని శివమొగ్గలో భజరంగ్ దళ్ కార్యకర్త దారుణ హత్యకు గురి కావడం కలకలం రేపుతోంది. ఈ హత్యకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని హిందూ సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి. నిరసనలకు దిగడంతో శాంతిభద్రతలకు విఘాతం కలిగింది. వాహనాలకు నిప్పంటించి హింసాత్మక ఘటనలకు పాల్పడ్డారని తెలుస్తోంది. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. ఆదివారం రాత్రి జరిగిన ఈ ఘటనతో సోమవారం 1వ తరగతి నుంచి 12 వరకు తరగతి గదులను మూసివేశారు. ఎలాంటి ఘటనలు జరుగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా… 144 సెక్షన్ విధించారు. పోలీసులు భారీ బందబస్తు ఏర్పాటు చేశారు.

Read More : Ukraine : యుక్రెయిన్ వీడి ఇండియా రండి.. ఎంబసీ కీలక ప్రకటన

శివమొగ్గలోని సీగెహెట్టిలో ఓ వ్యక్తిని దారుణంగా హతమార్చారు గుర్తు తెలియని దుండగులు. చనిపోయిన వ్యక్తి హర్షగా గుర్తించారు. ఇతను వృత్తిరీత్యా టైలర్ తో పాటు భజరంగ్ దళ్ కార్యకర్తగా ఉన్నాడని పోలీసులు నిర్ధారించారు. అనంతరం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న పలు హిందూ సంస్థలు ఆసుపత్రి వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టాయి. నిరసనల్లో భాగంగా పలువురు హింసాత్మక ఘటనలకు పాల్పడ్డారు. వాహనాలకు నిప్పంటించి తగులబెట్టారు.

Read More : India Covid : భారత్‌‌‌లో భారీగా తగ్గిన కరోనా కేసులు

అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. శివమొగ్గలో భారీగా పోలీసులు మోహరించారు. 144 సెక్షన్ విధించారు. ఈ ఘటనపై సీఎం బసవరాజు బొమ్మై స్పందించారు. ఆదివారం రాత్రి జరిగిన ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారని, కీలక సమాచారం సేకరించినట్లు తెలిపారు. సీఎం, హోం మంత్రి సొంత జిల్లాలో ఇలాంటి ఘటన జరగడం బాధాకరమని, నిందితుడిని ఉరి తీయడంతో పాటు.. రాష్ట్ర హోం మంత్రి రాజీనామా చేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య డిమాండ్ చేశారు.