Ukraine : యుక్రెయిన్ వీడి ఇండియా రండి.. ఎంబసీ కీలక ప్రకటన

భారతీయ విద్యార్థులు తక్షణం ఉక్రెయిన్ వీడి స్వదేశానికి వెళ్లాలని సూచించింది. ఉక్రెయిన్‌లో కొనసాగుతున్న ఉద్రిక్తతలను దృష్టిలో ఉంచుకుని, తప్పనిసరి అని భావించే వారు తప్పా

Ukraine : యుక్రెయిన్ వీడి ఇండియా రండి.. ఎంబసీ కీలక ప్రకటన

India and ukraine

Indian Embassy Asks Citizens To Leave Ukraine : యుక్రెయిన్, రష్యా మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకునే ఉన్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందోనని జనం టెన్షన్ పడుతున్నారు. యుక్రెయిన్ వేర్పాటువాదులు జనాలను తరలిస్తున్నారనే సంగతి తెలిసిందే. యుక్రెయిన్‌ – రష్యా మధ్య యుద్ధం జరిగితే ఆ ప్రభావం భారత్‌పై భారీగా పడనుందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. ఈ తరుణంలో భారత రాయబార కార్యాలయం 2022, ఫిబ్రవరి 20వ తేదీ ఆదివారం కీలక ప్రకటన విడుదల చేసింది. భారతీయ విద్యార్థులు తక్షణం ఉక్రెయిన్ వీడి స్వదేశానికి వెళ్లాలని సూచించింది. ఉక్రెయిన్‌లో కొనసాగుతున్న ఉద్రిక్తతలను దృష్టిలో ఉంచుకుని, తప్పనిసరి అని భావించే వారు తప్పా మిగతా భారతీయ పౌరులు విద్యార్థులందరూ ఉక్రెయిన్‌ను తాత్కాలికంగా విడిచిపెట్టాలని ప్రకటనలో వెల్లడించింది. భారతీయ విద్యార్థులు చార్టర్ విమానాల గురించిన అప్‌డేట్‌ల కోసం సంబంధిత విద్యార్థి కాంట్రాక్టర్‌లను కూడా సంప్రదించాలని తెలిపింది.

Read More : Russia-Ukraine : ఉక్రెయిన్ – రష్యా ఉద్రిక్తతలు… అప్రమత్తమైన భారత్

రష్యా – ఉక్రెయిన్ దేశాల మధ్య మొదలైన ఆందోళనల నేపథ్యంలో ఎయిరిండియా స్పందించింది. ఉక్రెయిన్ లో చదువుకుంటున్న విద్యార్థులను స్వదేశానికి చేర్చేందుకు గానూ మూడు విమానాలను నడపనుంది. వందే భారత్ మిషన్ లో భాగంగా ఈ సర్వీసులను నడుపుతామని ఎయిరిండియా ప్రకటనలో వెల్లడించింది. ఉక్రెయిన్ లోని అతిపెద్ద విమానాశ్రయమైన బోరిస్పిల్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నుంచి ఈ సర్వీసులు నడుస్తాయి. భారత ప్రభుత్వం ఉక్రెయిన్ నుంచి వచ్చే ఎయిర్ బబుల్ అరేంజ్మెంట్ ను తొలగించిన తర్వాతే ఈ ప్రకటన వెలువడింది. ఉక్రెయిన్ – ఇండియాల మధ్య ఫిబ్రవరి 22, 24, 26తేదీల్లో మూడు విమాన సర్వీసులు నడపనున్నట్లు, ఎయిరిండియా బుకింగ్ ఆఫీసెస్, వెబ్‌సైట్, కాల్ సెంటర్, ఆథరైజ్డ్ ట్రావెల్ ఏజెంట్స్ ద్వారా బుకింగ్ చేసుకోవచ్చు అని ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.