Russia-Ukraine : ఉక్రెయిన్ – రష్యా ఉద్రిక్తతలు… అప్రమత్తమైన భారత్

రష్యా తమ దేశం మీద కొన్నిగంటల్లో దాడికి దిగనున్నట్లు ప్రకటించారు ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్​ స్కీ. భారీ ఎత్తున రష్యన్​ బలగాలు మోహరించిన క్రమంలో ఉక్రెయిన్ అధ్యక్షుడి చేసి

Russia-Ukraine : ఉక్రెయిన్ – రష్యా ఉద్రిక్తతలు… అప్రమత్తమైన భారత్

Russia Ukraine

Russia-Ukraine :  రష్యా తమ దేశం మీద కొన్నిగంటల్లో దాడికి దిగనున్నట్లు ప్రకటించారు ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్​ స్కీ. భారీ ఎత్తున రష్యన్​ బలగాలు మోహరించిన క్రమంలో ఉక్రెయిన్ అధ్యక్షుడి చేసిన వ్యాఖ్యలు దేశ ప్రజల్లో మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో ఉక్రెయిన్‌లో విద్యను అభ్యసిస్తున్న విధ్యార్ధులకు కేంద్రం సూచనలు ఇచ్చింది.

అక్కడ మెడిసిన్, ఇంజనీరింగ్ చదువుతున్న తెలుగు విద్యార్థులు భయంతో అక్కడ ఉండలేక, చదువులను మధ్యలో వదిలేసి రాలేక సతమతమవుతున్నారు. వందలాది మంది తెలుగు విద్యార్థుల తల్లితండ్రులు ఆందోళనలో ఉండగా కేంద్రం సూచనలు ఇచ్చింది. వారిలో తెలంగాణ, ఏపీకి చెందిన 200 మందికి పైగా విద్యార్థులున్నారు.

ఉక్రెయిన్‌లోని భారతీయ విద్యార్థులు కచ్చితంగా అక్కడే ఉండాల్సిన అవసరం లేదని భారతదేశానికి తిరిగి రావాలని కేంద్రం సూచించింది.

Russia Attack On Ukraine..is Ready

పరిస్థితులు తీవ్రతరమైతే తమను స్వదేశం తరలించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారని మెడిసిన్ చదువుతున్న ఓ విద్యార్థి చెప్పారు. పేరు, వయసు, పాస్ పోర్ట్ నంబర్, ఉక్రెయిన్ లో ఉంటున్న ప్రదేశం, భారత్ లోని ఏ రాష్ట్రం నుంచి వచ్చారు వంటి వివరాలను తీసుకున్నారని తెలిపారు.

పరిస్థితులు తీవ్రమైతే ఇండియాకు పంపించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారని మెడిసిన్ విద్యార్థి ఒకరు చెప్పారు. పేరు, వయసు, పాస్ పోర్ట్ నంబర్, ఉక్రెయిన్ లో ఉంటున్న ప్రదేశం, భారత్ లోని ఏ రాష్ట్రం నుంచి వచ్చారు వంటి వివరాలను తీసుకున్నారని తెలిపారు.

రాలేని పక్షంలో అక్కడే ఉండిపోయిన విద్యార్థులు ఉక్రెయిన్ లోని భారత్ ఎంబసీతో టచ్‌లో ఉండాలని తెలిపింది. ఉక్రెయిన్ లోని భారత రాయబార కార్యాలయం యథావిధిగా పనిచేస్తూ ఉందని కేంద్ర విదేశాంగ శాఖ వెల్లడించింది. భారత రాయబార కార్యాలయం వెబ్ సైట్ ప్రకారం భారత్ కు చెందిన 18 వేల మంది విద్యార్థులు ఉక్రెయిన్ లోని వివిధ వర్సిటీల్లో ఎంబీబీఎస్, ఇంజనీరింగ్ వంటి కోర్సులు చదువుతున్నారు.

Read Also : ఏ క్షణమైనా ఉక్రెయిన్ పై రష్యా దాడి..అడుగు ముందుకేస్తే తీవ్ర పరిణామలు తప్పవని అమెరికా వార్నింగ్