Russia-Ukraine : ఏ క్షణమైనా ఉక్రెయిన్ పై రష్యా దాడి..అడుగు ముందుకేస్తే తీవ్ర పరిణామలు తప్పవని అమెరికా వార్నింగ్

ఏ క్షణమైనా ఉక్రెయిన్ పై దాడికి సిద్ధంగా ఉంది. భారీగా రష్యా బలగాలు ఉక్రెయిన్ సరిహద్దుల్లో మోహరించి ఉన్నాయి. రష్యా దాడి..అడుగు ముందుకేస్తే తీవ్ర పరిణామలు తప్పవని అమెరికా వార్నింగ్.

Russia-Ukraine : ఏ క్షణమైనా ఉక్రెయిన్ పై రష్యా దాడి..అడుగు ముందుకేస్తే తీవ్ర పరిణామలు తప్పవని అమెరికా వార్నింగ్

Russia Attack On Ukraine..is Ready

Russia Attack On Ukraine..Is ready: రష్యా తమ దేశం మీద మరికొన్ని గంటల్లో దాడికి దిగుతుందని ప్రకటించారు ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్​ స్కీ ఫేస్ బుక్ వేదికగా స్వయంగా వెల్లడించారు. ఇప్పటికే ఉక్రెయిన్ సరిహద్దుల్లో అమెరికా సేనలు మోహరించాయని..భారీ ఎత్తున రష్యన్​ బలగాలు మోహరించిన క్రమంలో ఉక్రెయిన్ అధ్యక్షుడి చేసిన వ్యాఖ్యలు దేశ ప్రజల్లో మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. ఏం జరిగినా దేశ ప్రజలంతా ఐకమత్యంగా ఉండాలని..రేపు యునిటీ డేగా జరుపుకోవాలని దేశ ప్రజలకు వొలోదిమిర్ పిలుపునిచ్చారు. దీంతో దేశ ప్రజలు బిక్కు బిక్కుముంటున్నారు.

Also read :  Indian Market : రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధ మేఘాలు.. భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్

కాగా..ఉక్రెయిన్ పై దాడి చేస్తే..తీవ్ర పరిణామలు తప్పవని అమెరికా వార్నింగ్ రష్యాకు వార్నింగ్ ఇస్తోంది. ఓ పక్క రష్యా, చైనాలో జతకట్టి అమెరికాకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు. ఇంకోపక్క ఉక్రెయిన్ కు రక్షణగా అమెరికా ప్రెసిడెంట్ బైడెన్ స్టాండ్ తీసుకుంటున్నారు. ఉక్రెయిన్ పై రష్యా సేనలు దాడికి యత్నిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు బైడెన్. ఓ వైపు బైడెన్ ఉక్రెయిన్ పై దాడి చేస్తే తీవ్రపరిణామాలు తప్పవని హెచ్చరిస్తుంటే మరోపక్క ఉక్రెయిన్​ రాజధానిలోని అమెరికా రాయబారా కార్యాలయాన్ని వేరే ప్రాంతానికి తరలిస్తున్నట్లు ప్రకటించారు ఆ దేశ విదేశాంగ మంత్రి బ్లింకెన్.

ఉక్రెయిన్​ ఆక్రమణే లక్ష్యంగా రష్యా ఆ దేశసరిహద్దుల్లో భారీ ఎత్తున బలగాలను మోహరించింది. ఆ దేశంలోకి చొచ్చుకెళ్లేందుకు క్రిమియా, బెలారస్‌తో పాటు తూర్పు ఉక్రెయిన్‌లలో రష్యన్​ బలగాలు సిద్ధంగా ఉన్నాయి. త్వరలోనే రష్యా.. ఉక్రెయిన్​పై దాడి చేయొచ్చు అని అమెరికా హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఉక్రెయిన్​ అధ్యక్షుడు వొలోదిమిర్​​ జెలన్‌ స్కీ ఫేస్​బుక్​ పోస్ట్​ మరింత ఆందోళన కలిగిస్తోంది. ఈనెల 16నే (బుధవారమే) ఉక్రెయిన్​పై రష్యా బలగాలు దాడికి దిగుతాయని, ఈ మేరకు తమకు సమాచారం అందినట్లు ఆయన పేర్కొన్నారు. ఉక్రెయిన్​ ప్రజలు అందరూ ఐకమత్యంగా ఉండాలని.. ఇందుకు ప్రతీకగా అదే రోజును ఐక్యతా దినోత్సవంగా జరుపుకోవాలని తెలిపారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు.

Also read : Ukraine-Russia: బైడెన్ గారూ మీరు ఉక్రెయిన్ రండి: ఉక్రెయిన్ అధ్యక్షుడు

రాయబార కార్యాలయం తరలింపు..ఉక్రెయిన్​ రాజధాని కీవ్​లో ఉన్న అమెరికా రాయబార కార్యాలయాన్ని తాత్కాలికంగా.. పశ్చిమాన ఉన్న లివివ్​ నగరానికి తరలిస్తున్నట్లు అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకన్​ వెల్లడించారు. ​సరిహద్దులో రష్యా బలగాల కదలికలు వేగవంతం అవడం వల్ల తమ అధికారుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

రష్యా ఇప్పటికే సరిహద్దులో లక్షకు పైగా సైనిక బలగాలను మోహరించింది. రష్యా చర్యలపై అమెరికా, నాటో దేశాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నా ఆ దేశం వెనక్కి తగ్గట్లేదు. ఉక్రెయిన్​పై రష్యా ఎప్పుడైనా దాడి చేయవచ్చని అమెరికా హెచ్చరిస్తుంటే.. అలాంటిదేమీ లేదంటూ ఆ విషయాన్ని రష్యా ఖండిస్తూ వస్తోంది. ఉక్రెయిన్​పై దాడికి దిగితే తీవ్ర పరిణామాలు తప్పవంటూ అమెరికా అధ్యక్షుడు బైడెన్​ ఇప్పటికే హెచ్చరించారు.