Ukraine-Russia: బైడెన్ గారూ మీరు ఉక్రెయిన్ రండి: ఉక్రెయిన్ అధ్యక్షుడు

బైడెన్ - పుతిన్ మధ్య చర్చలు ఎటూ తేలకపోవడంపై ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ ఆందోళన వ్యక్తం చేశారు. బైడెన్ వెంటనే బయలుదేరి కీవ్ రావాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.

Ukraine-Russia: బైడెన్ గారూ మీరు ఉక్రెయిన్ రండి: ఉక్రెయిన్ అధ్యక్షుడు

Ukriane

Ukraine-Russia: ఉక్రెయిన్ పై రష్యా ఏ క్షణమైనా దాడికి దిగొచ్చన్న అమెరికా నిఘావర్గాల హెచ్చరికలు.. యూరోపియన్ దేశాలతో పాటు..ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తుంది. యుద్ధమే అనివార్యం అయితే..తూర్పు ఐరోపాలో ప్రజలు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. దీంతో ఎట్టి పరిస్థితుల్లోనూ యుద్ధాన్ని నిలువరించేందుకు అటు అమెరికా, ఇటు ఫ్రాన్స్, జర్మనీ దేశాధినేతలు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. మరోవైపు.. ఉక్రెయిన్ ఈశాన్య సరిహద్దుల్లో రష్యా బలగాలు తిష్టవేసుకుని ఉన్న ఉపగ్రహ ఛాయాచిత్రాలు..కలవరపాటుకు గురిచేస్తున్నాయి. ఈక్రమంలో యుద్ధంపై వెనక్కు తగ్గాలంటూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆదివారం రష్యా అధ్యక్షుడు పుతిన్ తో నేరుగా ఫోన్ సంభాషణ జరిపారు. సుమారు గంటకుపైగా జరిపిన ఈ సంభాషణలో.. సమస్య ఎటూ తేలకపోవడం.. మరింత గుబులు రేపుతూ యుద్ధం తధ్యం అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

Also read: Farmers in AP: ఏపీలో “పంట బీమా పధకం”తో రైతులకు ఉపయోగంలేదు: రైతు సంఘం

బైడెన్ – పుతిన్ మధ్య చర్చలు ఎటూ తేలకపోవడంపై ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ ఆందోళన వ్యక్తం చేశారు. బైడెన్ వెంటనే బయలుదేరి కీవ్ రావాల్సిందిగా వోలోడిమిర్ జెలెన్స్కీ విజ్ఞప్తి చేశారు. జర్మనీ ఛాన్సలర్ ఒలాఫ్ సైతం సోమవారం నాడు ఉక్రెయిన్ అధ్యక్షుడితో చర్చలు జరిపి అనంతరం రష్యా అధ్యక్షుడు పుతిన్ తో సమావేశం కానున్నారు. ఉక్రెయిన్ పై యుద్ధం చేసే ఆలోచన లేదంటూనే, సరిహద్దుల వద్ద బలగాలను మోహరింపజేయడంపై యూరోపియన్ యూనియన్ దేశాలు పుతిన్ పై మండిపడుతున్నారు.

Also read: ISRO – PSLV-C52: మూడు ఉపగ్రహాలతో నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్ఎల్వీ సీ52

ఇక ఫిబ్రవరి 16 నుంచి ఏ సమయంలోనైనా ఉక్రెయిన్ పై రష్యా దాడికి దిగొచ్చన్న అమెరికా నిఘావర్గాల హెచ్చరికలతో.. ఉక్రెయిన్ లోని పలు దేశాల రాయబార కార్యాలయాలు కీలక ప్రకటనలు జారీ చేశాయి. తమ దేశ పౌరులు వెంటనే బయలుదేరి రావాలంటూ ఇప్పటికే అమెరికా ప్రకటించగా.. మరికొన్ని ఆసియ, ఆఫ్రికా, దక్షిణ అమెరికా దేశాలు సైతం ఆయా దేశాల పౌరులకు సూచనలు జారీ చేసాయి. ఈక్రమంలో ఆదివారం నుంచే ఉక్రెయిన్ కి వెళ్లే అని ప్రధాన విమాన సర్వీసులను విమానయాన సంస్థలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించాయి.

also read: Anna Hazare: ఆమరణ నిరాహార దీక్షను విరమించుకున్న అన్నా హజారే