Loan Insurance : మీకు లోన్ ఇన్సూరెన్స్ ఉందా? లేదంటే భారీగా నష్టపోతారు.. ఎందుకు తీసుకోవాలి? ఎవరికి అవసరం? ఫుల్ అల్టిమేట్ గైడ్..
Loan Insurance : లోన్ ఇన్సూరెన్స్ ఏంటి? ఎవరు తీసుకోవాలి? ఎలా ప్రొటెక్ట్ చేస్తుంది? లోన్ బీమాకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Loan Insurance
Loan Insurance : మీకు లోన్ ఇన్సూరెన్స్ ఉందా? అదేంటి? హోం లోన్, హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ గురించి విన్నాం.. ఈ లోన్ ఇన్సూరెన్స్ ఏంటి అంటారా? మీరు తీసుకున్న ఏదైనా రుణానికి ఇన్సూరెన్స్ తప్పనిసరిగా చేయించుకోవాలి. అది హోం లోన్ కావొచ్చు.. మరి ఏదైనా లోన్ కావొచ్చు.
లాంగ్ టైమ్ లోన్ల పేమెంట్ల విషయంలో ఎలాంటి (Loan Insurance) ఇబ్బంది తలెత్తినా ఈ లోన్ ఇన్సూరెన్స్ ప్రొటెక్ట్ చేస్తుంది. అయితే, ప్రస్తుత రోజుల్లో చాలామందికి హెల్త్, లైఫ్ ఇన్సూరెన్స్ గురించి మాత్రమే తెలుసు. కానీ, హెల్త్, లైఫ్ ఇన్సూరెన్స్ కాకుండా అనేక రకాల ఇన్సూరెన్స్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.
ఇందులో వెడ్డింగ్ ఇన్సూరెన్స్, ట్రావెల్ ఇన్సూరెన్స్, మొబైల్ ఫోన్ ఇన్సూరెన్స్ వంటి మొదలైనవి ఉన్నాయి. లోన్ ఇన్సూరెన్స్ కూడా అలాంటి ఇన్సూరెన్స్ టైప్. ఇంతకీ లోన్ ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకోవాలి? ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి? లోన్ ఇన్సూరెన్స్ ఎలా పనిచేస్తుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
లోన్ ఇన్సూరెన్స్ ఏంటి? ఎలా పనిచేస్తుంది? :
మీరు లోన్ ఇన్సూరెన్స్ తీసుకుంటే.. లోన్ డిఫాల్ట్ అయిన సందర్భంలో ఇన్సూరెన్స్ కంపెనీ మీ రుణాన్ని చెల్లిస్తుంది. ఉద్యోగ నష్టం, మరణం లేదా అనారోగ్యం వంటి వివిధ కారణాల వల్ల లోన్ డిఫాల్ట్‌లు సంభవించవచ్చు. ఇలాంటి పరిస్థితులలో లోన్ ఇన్సూరెన్స్ కీలక పాత్ర పోషిస్తుంది. లోన్ కంపెనీ ఆ మొత్తం రుణాన్ని చెల్లిస్తుంది.
లోన్ ఇన్సూరెన్స్ ఎందుకు ముఖ్యమంటే? :
అన్ని రకాల ఇన్సూరెన్స్ అత్యంత ప్రయోజనకరంగా ఉంటాయి. క్లిష్ట సమయాల్లో అత్యంత ప్రయోజనాలను అందించగలవు, బీమా అవసరాలు వ్యక్తి పరిస్థితిని బట్టి మారుతూ ఉంటాయి. లోన్ ఇన్సూరెన్స్ విషయానికొస్తే.. మీరు లాంగ్ టైమ్ లోన్ తీసుకుంటుంటే అత్యంత ప్రయోజనకరంగా ఉండవచ్చు. ఇంకా, మీ ఉద్యోగంలో స్థిరత్వం లేకపోతే ఈ లోన్ ఇన్సూరెన్స్ తప్పనిసరిగా తీసుకోవాలి.
ఎవరు లోన్ ఇన్సూరెన్స్ తీసుకోకూడదు? :
మీ లోన్ స్వల్పకాలమైతే.. లోన్ ఇన్సూరెన్స్ అవసరం లేదు. ఇంకా, మీకు ఇప్పటికే హెల్త్ లేదా లైఫ్ ఇన్సూరెన్స్ ఉంటే లోన్ ఇన్సూరెన్స్ అవసరం లేదు. మీ రుణాన్ని లైఫ్ ఇన్సూరెన్స్ కవర్ చేస్తుంది. ఇంకా, మీకు స్థిరమైన ఉద్యోగం ఉంటే లోన్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు.
