Vishal : చంద్రబాబుతో పోటీపై మరోసారి స్పందించిన హీరో విశాల్..

తమిళ నటుడు విశాల్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం 'లాఠీ'. డిసెంబర్ 22న విడుదలకు సిద్దమవుతున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉన్నాడు హీరో విశాల్. ఈ క్రమంలోనే నిన్న చెన్నైలో మీడియా విలేకర్లతో సమావేశమయ్యింది చిత్ర యూనిట్. ఈ సమావేశంలో విశాల్ రాజకీయ రంగప్రవేశం మరియు కుప్పంలో చంద్రబాబుతో పోటీ గురించి ప్రశ్నించారు విలేకర్లు.

Vishal : చంద్రబాబుతో పోటీపై మరోసారి స్పందించిన హీరో విశాల్..

Vishal gives clarity on kuppam election battle

Vishal : తమిళ నటుడు విశాల్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘లాఠీ’. యాక్షన్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ మూవీలో విశాల్ ఒక పోలీస్ కానిస్టేబుల్‌గా కనిపించబోతున్నాడు. ఇక ఈ సినిమాలో దాదాపు 45 నిమిషాలు పాటు యాక్షన్ సీక్వెన్స్ ఉండబోతున్నట్లు ప్రకటించారు మేకర్స్. క్రిస్టమస్ కానుకగా డిసెంబర్ 22న విడుదలకు సిద్దమవుతున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉన్నాడు హీరో విశాల్.

Vishal: విశాల్ ‘లాఠీ’ మూవీ సెన్సార్ రిపోర్ట్.. పోలీసు దెబ్బ మామూలుగా లేదట!

ఈ క్రమంలోనే నిన్న చెన్నైలో మీడియా విలేకర్లతో సమావేశమయ్యింది చిత్ర యూనిట్. ఈ సమావేశంలో విశాల్ రాజకీయ రంగప్రవేశం మరియు కుప్పంలో చంద్రబాబుతో పోటీ గురించి ప్రశ్నించారు విలేకర్లు. గతంలోనే ఈ విషయంపై స్పందించిన విశాల్, మరోసారి కుప్పం పోటీపై క్లారిటీ ఇచ్చాడు. ‘నేను రాజకీయంలోకి రావడం అనేది కచ్చితంగా జరుగుతుంది. సామజిక సేవే లక్ష్యంగా ఎన్నికల్లో పోటీ చేస్తా’ అని తన రాజకీయ ప్రవేశం గురించి వెల్లడించాడు.

అలాగే కుప్పం పోటీ గురించి మాట్లాడుతూ.. “కుప్పం ప్రజలతో నాకు ఒక ప్రత్యేక అనుబంధం ఉంది. మా నాన్న గారు గ్రానైట్ బిజినెస్ చేస్తున్నప్పుడు, అక్కడే మూడేళ్ళ పాటు ఉన్నాము. అయితే 2024 ఎన్నికల్లో కుప్పం నుంచి నారా చంద్రబాబునాయుడుపై పోటీ చేస్తాను అనే వార్త మాత్రం అవాస్తం” అంటూ కొట్టేపడేశాడు హీరో విశాల్. కాగా పెళ్లి గురించి ప్రశ్నించగా.. ఇప్పటిలో ఆ ఉద్దేశం లేదంటూ బదులిచ్చాడు విశాల్.