Vishal: విశాల్ ‘లాఠీ’ మూవీ సెన్సార్ రిపోర్ట్.. పోలీసు దెబ్బ మామూలుగా లేదట!

తమిళ హీరో విశాల్ సినిమాలకు తెలుగులోనూ ఎలాంటి క్రేజ్ ఉంటుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘లాఠీ’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీగా ఉంది. ఇటీవల ఈ సినిమాను తెలుగులోనూ ప్రమోట్ చేసింది చిత్ర యూనిట్. ఇక తాజాగా లాఠీ మూవీ సెన్సార్ పనులు కూడా ముగించుకుంది.

Vishal: విశాల్ ‘లాఠీ’ మూవీ సెన్సార్ రిపోర్ట్.. పోలీసు దెబ్బ మామూలుగా లేదట!

Vishal Laththi Completes Censor Work

Vishal: తమిళ హీరో విశాల్ సినిమాలకు తెలుగులోనూ ఎలాంటి క్రేజ్ ఉంటుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘లాఠీ’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీగా ఉంది. ఇటీవల ఈ సినిమాను తెలుగులోనూ ప్రమోట్ చేసింది చిత్ర యూనిట్. ఇక తాజాగా లాఠీ మూవీ సెన్సార్ పనులు కూడా ముగించుకుంది.

Vishal Laatti Trailer : ఫుల్ యాక్షన్‌తో విశాల్ ‘లాఠీ’ ట్రైలర్..

ఈ సినిమాకు సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్‌ను జారీ చేశారు. పవర్‌ఫుల్ పోలీస్ యాక్షన్ డ్రామా మూవీగా లాఠీ ప్రేక్షకులను మెప్పిస్తుందని సెన్సార్ బోర్డు సభ్యులు చిత్ర యూనిట్‌ను అభినందించినట్లుగా తెలుస్తోంది. ఇక నిజాయితీగల పోలీస్ పాత్రలో విశాల్ పర్ఫార్మెన్స్ ఈ సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్తుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. విశాల్ సినిమాలో ప్రేక్షకులు ఏం కోరుకుంటారో, ఆ అంశాలన్నీ కూడా ఈ సినిమాలో పుష్కలంగా ఉన్నాయని చిత్ర యూనిట్ ప్రేక్షకులకు హామీనిస్తోంది.

Vishal : విజయ్ తో సినిమాకి నో చెప్పా.. త్వరలోనే అతనితో నేనే సినిమా డైరెక్ట్ చేస్తా..

ఇక దర్శకుడు ఎ.వినోద్ తెరకెక్కిస్తున్న ఈ పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీలో సునైనా హీరోయిన్‌గా నటిస్తుండగా, ఈ సినిమాకు సామ్ సిఎస్ సంగీతం అందించాడు. డిసెంబర్ 22న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. మరి విశాల్ ‘లాఠీ’ దెబ్బ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సౌండ్ చేస్తుందో చూడాలి.