Vishal : విజయ్ తో సినిమాకి నో చెప్పా.. త్వరలోనే అతనితో నేనే సినిమా డైరెక్ట్ చేస్తా..

విశాల్ మాట్లాడుతూ.. లోకేష్ కనగరాజ్ వచ్చి నాకు కథ కూడా చెప్పాడు. విజయ్ సినిమాలో ఒక పాత్రకి అడిగాడు. నాకు కథ నచ్చింది కానీ డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోయాను. నేను ప్రస్తుతం...........

Vishal : విజయ్ తో సినిమాకి నో చెప్పా.. త్వరలోనే అతనితో నేనే సినిమా డైరెక్ట్ చేస్తా..

Vishal wants to direct a movie with vijay

Vishal :  తమిళ్ స్టార్ హీరో విశాల్ త్వరలో లాఠీ సినిమాతో ప్రేక్షకుల ముందుకి రానున్నాడు. అనంతరం మరో రెండు ప్రాజెక్టుల షూటింగ్స్ తో బిజీగా ఉన్నాడు విశాల్. తెలుగులో కూడా విశాల్ కి మంచి మార్కెట్ ఉంది. తన సినిమాలని ఇక్కడ కూడా రిలీజ్ చేయనున్నాడు. దీంతో లాఠీ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలని తెలియచేశాడు.

విశాల్ మాట్లాడుతూ.. లోకేష్ కనగరాజ్ వచ్చి నాకు కథ కూడా చెప్పాడు. విజయ్ సినిమాలో ఒక పాత్రకి అడిగాడు. నాకు కథ నచ్చింది కానీ డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోయాను. నేను ప్రస్తుతం రెండు ప్రాజెక్ట్స్, లాఠీ సినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నాను. లోకేష్ నన్ను చాలా డేట్స్ అడిగాడు. ఇలాంటి సమయంలో అన్ని డేట్స్ ఇవ్వలేను. అందుకే విజయ్ సినిమాకి నో చెప్పాను అని అన్నారు.

Waltair Veerayya : పూనకాలు లోడింగ్.. వాల్తేరు వీరయ్య నుంచి మాస్ మహారాజ్ టీజర్.. దుమ్ము దులిపేసిన రవితేజ..

అలాగే.. నేను విజయ్ తో సినిమా డైరెక్ట్ చేయాలనుకుంటున్నాను. నాకు ఇప్పుడు ఉన్న సినిమాలన్నీ పూర్తయ్యాక కథ మీద వర్క్ చేసి విజయ్ కి చెప్తాను. కచ్చితంగా విజయ్ హీరోగా నా డైరెక్షన్ లో సినిమా ఉంటుంది అని తెలిపాడు విశాల్. దీంతో ఒక హీరో దర్శకత్వంలో ఇంకో హీరో సినిమా అంటే దీనిపై ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్నారు, ఈ సినిమా త్వరగా అవ్వాలని అనుకుంటున్నారు.