Waltair Veerayya : పూనకాలు లోడింగ్.. వాల్తేరు వీరయ్య నుంచి మాస్ మహారాజ్ టీజర్.. దుమ్ము దులిపేసిన రవితేజ..

వాల్తేరు వీరయ్య సినిమాని సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. తాజాగా ఈ సినిమా నుంచి రవితేజకి సంబంధించిన టీజర్ ని విడుదల చేశారు. డైరెక్టర్ బాబీకి లైఫ్ ఇచ్చిన హీరో రవితేజ. దీంతో తన హీరోని ఇంకా మాస్ గా చూపించాడు బాబీ.

Waltair Veerayya : పూనకాలు లోడింగ్.. వాల్తేరు వీరయ్య నుంచి మాస్ మహారాజ్ టీజర్.. దుమ్ము దులిపేసిన రవితేజ..

Raviteja teaser released fro Waltair Veerayya movie

Waltair Veerayya :  మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కుతున్న సినిమా వాల్తేరు వీరయ్య. చాలా రోజుల తర్వాత చిరంజీవి ఫుల్ మాస్ క్యారెక్టర్ లో కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన గ్లింప్స్ తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో మాస్ మహారాజ్ రవితేజ ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు అని ప్రకటించడంతో అంచనాలు మరింత పెరిగాయి. ఇక ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుంది.

వాల్తేరు వీరయ్య సినిమాని సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ప్రస్తుతం చిత్ర యూనిట్ యూరప్ లో సాంగ్ షూట్ తో బిజీగా ఉన్నారు. తాజాగా ఈ సినిమా నుంచి రవితేజకి సంబంధించిన టీజర్ ని విడుదల చేశారు. డైరెక్టర్ బాబీకి లైఫ్ ఇచ్చిన హీరో రవితేజ. దీంతో తన హీరోని ఇంకా మాస్ గా చూపించాడు బాబీ.

టీజర్ లో ఓ మేకపిల్లని పట్టుకొని ‘మేకపిల్లని పట్టుకొని మొదటిసారి పులి వస్తుంది’ అంటూ మాస్ వాయిస్ తో సాఫ్ట్ గా ఎంట్రీ ఇచ్చిన రవితేజ మరింత మాస్ గా ఫైట్ చేయడం చూపించారు. ఏంరా వారి, పిస పిస చేస్తున్నావు, నీకింకా సమాజ్ గాలే, నేను ఎవ్వని అయ్యకి వినను అని.. అంటూ మాస్ డైలాగ్స్ చెప్పాడు. టీజర్ మొత్తం రవితేజని ఫుల్ మాస్ గా చూపించాడు. ఈ సినిమాలో రవితేజ పోలీసాఫీసర్ గా కనిపించనున్నట్టు తెలుస్తుంది. దీంతో రవితేజ అభిమానులతో పాటు మెగా అభిమానులు కూడా ఫుల్ ఫిదా అవుతున్నారు.

Joker 2 : జోకర్ 2 షురూ.. 2024కి థియేటర్స్ లో..

ఈ టీజర్ తో వాల్తేరు వీరయ్య సినిమాపై మరిన్ని అంచనాలు పెంచేశారు. మెగా అభిమానులు, రవితేజ అభిమానులు ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కచ్చితంగా ఈ సంక్రాంతికి ఈ సినిమా పెద్ద హిట్ కొడుతుందని అంటున్నారు.