Joker 2 : జోకర్ 2 షురూ.. 2024కి థియేటర్స్ లో..

హీరో జోక్విన్‌ ఫోనిక్స్‌ తోనే డైరెక్టర్ టాడ్ ఫిలిప్స్ జోకర్ 2 సినిమాని తెరకెక్కిస్తున్నాడు. తాజాగా జోకర్ 2 షూటింగ్ మొదలుపెట్టినట్టు డైరెక్టర్ తెలిపాడు. ఈ మేరకు షూట్ లోని ఒక స్టిల్ ని తన సోషల్ మీడియాలో...............

Joker 2 : జోకర్ 2 షురూ.. 2024కి థియేటర్స్ లో..

Joker 2 movie shoot started

Joker 2 :  హాలీవుడ్‌ హీరో జోక్విన్‌ ఫోనిక్స్‌ మెయిన్ లీడ్ లో మూడేళ్ళ క్రితం వచ్చిన జోకర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ విజయం సాధించింది. కలెక్షన్లని కూడా బాగా రాబట్టింది. ఆస్కార్ అవార్డులు కూడా సాధించింది. ఈ సినిమాలో మ్యూజిక్, హీరో జోక్విన్‌ ఫోనిక్స్‌ క్యారెక్టర్ బాగా వైరల్ అయ్యాయి. సోషల్ మీడియాలో కూడా బాగా వైరల్ అయింది ఈ క్యారెక్టర్. దీంతో కొన్ని నెలల క్రితం ఈ సినిమాకి సీక్వెల్ అనౌన్స్ చేశాడు దర్శకుడు.

హీరో జోక్విన్‌ ఫోనిక్స్‌ తోనే డైరెక్టర్ టాడ్ ఫిలిప్స్ జోకర్ 2 సినిమాని తెరకెక్కిస్తున్నాడు. తాజాగా జోకర్ 2 షూటింగ్ మొదలుపెట్టినట్టు డైరెక్టర్ తెలిపాడు. ఈ మేరకు షూట్ లోని ఒక స్టిల్ ని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. జోకర్ సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకి ‘జోకర్‌: ఫోలీ ఏ డీక్స్‌’ అనే పేరుని పెట్టారు.

Parineeti Chopra : ప్లీజ్ సౌత్ సినిమాల్లో ఛాన్స్ ఇవ్వండి..

ఇక ఈ జోకర్ 2 సినిమాని 2024లో రిలీజ్ చేయనున్నట్టు తెలిపారు. అలాగే ఈ సినిమాలో స్టార్ పాప్ సింగర్ లేడీగాగా ఓ కీలక పాత్రలో నటించనుంది. దీంతో ఈ సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి. జోకర్ సినిమా అభిమానులు ఈ సీక్వెల్ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.

View this post on Instagram

A post shared by Todd Phillips (@toddphillips)