Parineeti Chopra : ప్లీజ్ సౌత్ సినిమాల్లో ఛాన్స్ ఇవ్వండి..
పరిణీతి చోప్రా మాట్లాడుతూ.. ''నేను సౌత్ సినిమాల్లో నటించడానికి ఎదురు చూస్తున్నాను. నేను సౌత్ సినిమాల్లో నటించడానికి ఎంతలా ఆరాటపడుతున్నానో మీకు తెలియదు. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ............

Parineeti Chopra eagerly waiting for south movie chance
Parineeti Chopra : ఇటీవల సౌత్ సినిమాలకి డిమాండ్ పెరిగిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ వాళ్లంతా సౌత్ సినిమాల మీద పడ్డారు. ఇక్కడి సినిమాలని రీమేక్ చేయడం లేదా ఇక్కడి దర్శకులతో సినిమాలు చేయడం లేదా ఇక్కడి సినిమాల్లో నటించడమో చేస్తున్నారు. బాలీవుడ్ హీరోయిన్స్ కూడా సౌత్ హీరోల సరసన నటించడానికి ఎదురు చూస్తున్నారు.
తాజాగా బాలీవుడ్ భామ పరిణీతి చోప్రా సౌత్ సినిమాల్లో అవకాశం ఇమ్మని అడుక్కుంటుంది. బాలీవుడ్ లో వరుసగా సినిమాలు చేస్తున్న పరిణీతి ఇటీవల ఢిల్లీలో జరిగిన అజెండా ఆజ్‌తక్ 2022 అనే కార్యక్రమంలో పాల్గొంది. ఈ ఈవెంట్ లో మీడియాతో మాట్లాడుతూ సౌత్ సినిమాల గురించి మాట్లాడింది.
Gunasekhar Daughter Reception : డైరెక్టర్ గుణశేఖర్ కూతురి రిసెప్షన్ గ్యాలరీ..
పరిణీతి చోప్రా మాట్లాడుతూ.. ”నేను సౌత్ సినిమాల్లో నటించడానికి ఎదురు చూస్తున్నాను. నేను సౌత్ సినిమాల్లో నటించడానికి ఎంతలా ఆరాటపడుతున్నానో మీకు తెలియదు. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ.. ఏ భాష అయినా పర్లేదు. సౌత్ లో ఒక మంచి సినిమాలో నటించాలనుకుంటున్నాను. దయచేసి మీకు తెలిసిన దర్శకులు ఉంటే వారికి నా గురించి చెప్పండి” అంటూ రిక్వెస్ట్ చేసింది. పరిణీతి ఇంత రిక్వెస్ట్ చేయడంతో ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. మరి ఆమె మాటలు విని సౌత్ డైరెక్టర్ ఎవరైనా ఆమెకి ఛాన్స్ ఇస్తాడేమో చూడాలి.