Vishal Laatti Trailer : ఫుల్ యాక్షన్‌తో విశాల్ ‘లాఠీ’ ట్రైలర్..

తమిళ స్టార్ హీరో విశాల్ సినిమాలు అంటే ఫ్యాన్స్ లో చాలా అంచనాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ హీరో చేసే యాక్షన్ సీక్వెన్స్ కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. తాజాగా ఈ యాక్షన్ హీరో 'లాఠీ' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇక ఈ సినిమా క్రిస్టమస్ కానుకగా డిసెంబర్ 22న విడుదల కాబోతుంది. దీంతో నేడు చిత్ర యూనిట్ లాఠీ ట్రైలర్ ని విడుదల చేసింది.

Vishal Laatti Trailer : ఫుల్ యాక్షన్‌తో విశాల్ ‘లాఠీ’ ట్రైలర్..

Vishal Laatti Trailer Released

Vishal Laatti Trailer : తమిళ స్టార్ హీరో విశాల్ సినిమాలు అంటే ఫ్యాన్స్ లో చాలా అంచనాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ హీరో చేసే యాక్షన్ సీక్వెన్స్ కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. దీంతో విశాల్ కూడా తన ప్రతి సినిమాలో హై వోల్టేజ్ సీన్స్ ఉండేలా చూసుకుంటున్నాడు. తాజాగా ఈ యాక్షన్ హీరో ‘లాఠీ’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ మూవీతో విశాల్ పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగుపెడుతున్నాడు.

Vishal : విజయ్ తో సినిమాకి నో చెప్పా.. త్వరలోనే అతనితో నేనే సినిమా డైరెక్ట్ చేస్తా..

ఇక ఈ సినిమా క్రిస్టమస్ కానుకగా డిసెంబర్ 22న విడుదల కాబోతుంది. దీంతో నేడు చిత్ర యూనిట్ లాఠీ ట్రైలర్ ని విడుదల చేసింది. ఇప్పటికే ఈ మూవీ సెకండ్ హాఫ్‌లో 45 నిమిషాలు పాటు యాక్షన్ సీక్వెన్స్ ఉండబోతున్నట్లు ప్రకటించారు మేకర్స్. తాజాగా విడుదలైన ట్రైలర్ లో కూడా ఫుల్ యాక్షన్‌ సీన్స్ తో నింపేశారు. ట్రైలర్ మొత్తం హై వోల్టేజ్ ఇంటెన్సిటీతో సాగిపోయింది.

గతంలో కూడా విశాల్ పోలీస్ పాత్రల్లో నటించాడు. కానీ ఈ సినిమాలోని పాత్ర వాటికి బిన్నంగా ఉండబోతున్నట్లు తెలుస్తుంది. ఈ మూవీలో విశాల్ పోలీస్ గానే కాదు, ఒక మధ్యతరగతి తండ్రిగా కూడా కనిపిస్తున్నాడు. వినోద్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సునైనా హీరోయిన్ గా నటిస్తుంది. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నాడు.