Suicide : భర్త కళ్లెదుటే ఉరేసుకుని భార్య ఆత్మహత్య

నెల్లూరు జిల్లా ఆత్మకూరులో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. భర్త కళ్లెదుటే భార్య ఉరేసుకుని సూసైడ్‌ చేసుకుంది. భార్య ఉరేసుకుంటుంటే ఆపాల్సిన భర్త అడ్డుకోకుండా ఆమెను ప్రోత్సహించాడు.

Suicide : భర్త కళ్లెదుటే ఉరేసుకుని భార్య ఆత్మహత్య

Suicide (2)

Wife suicide in front of husband : నెల్లూరు జిల్లా ఆత్మకూరులో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. భర్త కళ్లెదుటే భార్య ఉరేసుకుని సూసైడ్‌ చేసుకుంది. భార్య ఉరేసుకుంటుంటే ఆపాల్సిన భర్త అడ్డుకోకుండా ఆమెను ప్రోత్సహించాడు. కళ్ల ముందే ఆమె ప్రాణం పోతున్నా పట్టించుకోకుండా తాపీగా సెల్‌ఫోన్‌లో వీడియో తీశాడు.

మృగం మనిషి రూపంలో ఉంటే.. రాక్షసుడు మనిషిలాగా పుట్టి… మన మధ్యే తిరిగితే.. ఎలా ఉంటాడో తెలుసా? ఇదిగో వీడిలా ఉంటాడు. అచ్చం ఈ వెధవలాగే ఉంటాడు. కట్టుకున్న భార్య కళ్లముందే ఉరేసుకుంటుంటే… చచ్చిపో అంటూ ఎంకరేజ్‌ చేశాడు. నువ్వు చావకపోతే నేనే చంపిస్తానంటూ శాడిస్టు లాగా ప్రవర్తించాడు. చివరకు కళ్లముందే భార్య గిలగిలా కొట్టుకుని చచ్చిపోతుంటే… వీడు రాక్షసానందం అనుభవించాడు. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో జరిగిన ఈ ఘటన మనుషుల్లో ఎలాంటి మృగాలున్నాయో ప్రత్యక్షంగా చూపించింది.

Wash Womens Clothes : రేప్ కేసు.. మహిళల బట్టలు ఉతకాలని కోర్టు ఆదేశం

భార్య కొండమ్మపై అనుమానం పెంచుకున్న పెంచలయ్య.. ఆమెను కొద్దిరోజులుగా వేధిస్తున్నాడు. తాజాగా మరోసారి భర్త గొడవపడటంతో మనస్తాపానికి గురైన కొండమ్మ ఆత్మహత్య చేసుకోవాలని డిసైడైంది. భర్త కళ్లెదుటే ఇంట్లోని ఫ్యాన్‌కు ఉరేసుకుని ప్రాణాలు తీసుకుంది. కళ్లముందే భార్య చనిపోతున్నా పెంచలయ్య చలించలేదు. ఆమెను కాపాడకుండా వీడియో తీసి ఎంజాయ్‌ చేశాడు.

నువ్‌ చస్తే నాకేంటి? నాకోసం చస్తున్నావా అంటూ సూసైడ్‌కు పురిగొల్పాడు. వేస్కో.. ఉరేస్కో అంటూ ఒకటికి పదిసార్లు అంటూ… ఆమె ప్రాణం పోయేదాకా అక్కడే నిలబడి చూశాడు. వీడు చేసిన శాడిస్టు పనిని వీడియో తీసుకున్నాడు. అంతటితో ఆగకుండా ఆత్మహత్య చేసుకుంటున్న దృశ్యాల్ని ఆమె బంధువులకు పంపించాడు.

AP CMRF : ఏపీ సీఎంఆర్ఎఫ్ స్కామ్‌లో ఆసక్తికర విషయాలు

కొండమ్మ ఆత్మకూరు మెప్మాలో రిసోర్స్‌ పర్సన్‌గా పనిచేస్తుండగా… పెంచలయ్య సెక్యూరిటీ గార్డ్‌ ఉద్యోగం వెలగబెడుతున్నాడు. పెంచలయ్యపై కేసు నమోదు చేసుకున్న ఆత్మకూరు పోలీసులు… అతడ్ని అరెస్ట్‌ చేసి విచారిస్తున్నారు. పెంచలయ్యపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ మెప్మా సిబ్బంది ఆందోళనకు దిగారు. అసలు ఇలాంటి మృగాల్ని ఏం చేయాలో కూడా ఎవరికీ అర్థం కాని పరిస్థితి. పెంచలయ్య చేసిన పాపానికి గరుడ పురాణంలోని శిక్షలన్నీ వేసినా తక్కువే అంటున్నారు కొండమ్మ బంధువులు.