AP CMRF : ఏపీ సీఎంఆర్ఎఫ్ స్కామ్‌లో ఆసక్తికర విషయాలు

ఏపీ సీఎంఆర్ఎఫ్ నిధులు గోల్‌మాల్ కేసులో ఏసీబీ అధికారులు వేగం పెంచారు. ఇప్పటికే ఈ కేసులో పలువురిని అదుపులోకి తీసుకున్న ఏసీబీ... తాజాగా మరో నలుగురిని అరెస్ట్ చేసింది.

AP CMRF : ఏపీ సీఎంఆర్ఎఫ్ స్కామ్‌లో ఆసక్తికర విషయాలు

Acb

ACB investigating on AP CMRF scame : ఏపీ సీఎంఆర్ఎఫ్ స్కామ్‌లో తవ్వేకొద్ది ఆసక్తికర విషయాలు బయటపడుతున్నాయి. ఏపీ సీఎంఆర్ఎఫ్ నిధులు గోల్‌మాల్ కేసులో ఏసీబీ అధికారులు వేగం పెంచారు. ఇప్పటికే ఈ కేసులో పలువురిని అదుపులోకి తీసుకున్న ఏసీబీ… తాజాగా మరో నలుగురిని అరెస్ట్ చేసింది. సచివాలయంలో పనిచేసే చలువాది సుబ్రమణ్యం, సోక రమేశ్‌లతో పాటు మరో ఇద్దరు ప్రైవేట్ వ్యక్తులు చదలవాడ మురళీ కృష్ణ, ధనరాజును అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఇప్పటికే ఏపీ సచివాలయంలో పనిచేస్తోన్న 50 మందిని పూర్తిస్థాయిలో విచారించింది ఏసీబీ. దీంతో CMRF కేసులో ఎప్పుడు, ఎవరిని అరెస్ట్ చేస్తారో అని సచివాలయ ఉద్యోగుల్లో అలజడి నెలకొంది.

CMRF చెక్కుల పంపిణీలో అక్రమాలు చోటుచేసుకున్నాయన్న ఆరోపణలతో… రంగంలోకి దిగిన ఏసీబీ పలువురు ఏపీ సచివాలయ ఉద్యోగుల పాత్ర ఉందని గుర్తించింది. జూన్‌ 29న సచివాలయంలో పనిచేస్తున్న కొంతమంది చిన్నస్థాయి ఉద్యోగుల నుంచి పెద్దస్ధాయి ఉద్యోగులను విచారించింది. ఈ విచారణలో సచివాలయ ఉద్యోగులతో పాటు కొంతమంది ప్రజాప్రతినిధుల పీఏలు, అనుచరుల ప్రమేయం ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు.

CM Jagan : ఇళ్ల పట్టాల పంపిణీ.. సీఎం జగన్ కీలక ఆదేశాలు

రోగులకు సంబంధించిన వివరాలను ఆసుపత్రుల నుంచి సేకరించి… ఆ సమాచారంతో సచివాలయం ఉద్యోగస్తులతో కుమ్మకై కొంతమంది ప్రైవేట్‌ వ్యక్తులు కూడా నిధులు స్వాహా చేసినట్లుగా ఏసీబీ విచారణలో వెల్లడైంది. ఈ కేసులో ఇప్పటికే అనేక మందిని అరెస్ట్ చేసింది. తాజాగా మరో నలుగురి అరెస్ట్‌తో ఏపీ సెక్రటేరియట్‌లో కలకలం రేగింది.

CMRF చెక్కుల పంపిణీలో సుమారు 117 కోట్ల రూపాయలకు పైగా నిధులు పక్కదారి పట్టినట్లు ఏసీబీ గతంలోనే గుర్తించింది. ఈ వ్యవహారంపై 2020 సెప్టెంబర్‌లో కేసు నమోదు చేశారు. గతంలో చెక్కుల గురించి ఢిల్లీ, కోల్‌కత్తా, బెంగళూర్‌కు సంబంధించి బ్యాంక్ మేనేజర్ల నుంచి పూర్తి వివరాలను సేకరించింది.

TTD Board : టీటీడీ బోర్డు నియామకంపై ఏపీ హై కోర్ట్ సీరియస్-ప్రభుత్వ జీవో సస్పెండ్

2014 నుంచి 2015లో CMRFలో అవకతవకలు జరిగినట్లు ఏసీబీ గుర్తించింది. అయితే ఈ అవినీతి కేసులో అసలు సూత్రధారులను కనిపెట్టే పనిలో ఏసీబీ నిమగ్నమైంది. CMRF చెక్కుల గోల్‌మాల్‌లో ఇంకెంతమంది ప్రమేయం ఉందో త్వరలోనే బయటపడే అవకాశం ఉంది.