CM Jagan : ఇళ్ల పట్టాల పంపిణీ.. సీఎం జగన్ కీలక ఆదేశాలు

కలెక్టర్లు, ఎస్పీలతో జరిగిన స్పందన కార్యక్రమంలో ఇళ్ల పట్టాల పంపిణీపై సీఎం జగన్ అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. ఇళ్ల పట్టాల పంపిణీకి సంబంధించిన కోర్టు కేసులపై దృష్టి పెట్టాలని కోరా

CM Jagan : ఇళ్ల పట్టాల పంపిణీ.. సీఎం జగన్ కీలక ఆదేశాలు

Cm Jagan

CM Jagan : కలెక్టర్లు, ఎస్పీలతో జరిగిన స్పందన కార్యక్రమంలో ఇళ్ల పట్టాల పంపిణీపై సీఎం జగన్ అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. ఇళ్ల పట్టాల పంపిణీకి సంబంధించిన కోర్టు కేసులపై దృష్టి పెట్టాలని కోరారు. అలాగే పెండింగ్ దరఖాస్తులను వెరిఫై చేయాలన్నారు. నెల రోజుల్లో పెండింగ్‌ కేసులన్నీ పరిష్కారం అవుతాయని ఆశిస్తున్నట్లు తెలిపారు. వన్ టైమ్ సెటిల్ మెంట్ పథకంలో రిజిస్ట్రేషన్ పట్టాలిచ్చే కార్యక్రమం డిసెంబర్ లోగా పూర్తి చేయాలన్నారు. 1980 నుంచి 2011 వరకు ఉన్న అన్ని ఇళ్లు, ఇంటి స్థలాలను విడిపించుకునేలా వన్ టైమ్ సెటిల్ మెంట్ సౌకర్యం తెస్తున్నట్టు జగన్ చెప్పారు. లబ్ధిదారులకు లే అవుట్ల వారీగా వివరాలు అందించాలని అధికారులను జగన్ ఆదేశించారు.

RTC, Electricity Charges : కరెంట్, ఆర్టీసీ బస్ ఛార్జీలు పెంచే యోచనలో ప్రభుత్వం

”పెండింగ్‌ దరఖాస్తులను వెరిఫికేషన్‌ చేయాలి. వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌​ పథకంలో రిజిస్ట్రేషన్‌ పట్టాలిచ్చే కార్యక్రమం డిసెంబర్‌లోగా చేయాలి. లే అవుట్లలో విద్యుత్‌, నీటి వసతిపై అధికారులు దృష్టి పెట్టాలి. మహిళలకు రూ.35 వేలు పావలా వడ్డీకే బ్యాంకర్లు రుణాలు ఇచ్చేలా చూడాలి. వారానికొకసారి ఇళ్ల నిర్మాణంపై కలెక్టర్లు సమీక్ష చేయాలి” అని సీఎం జగన్‌ ఆదేశించారు.

Card tokenisation: ఆన్‌లైన్‌లో క్రెడిట్ కార్డ్ వాడే వాళ్లకు గుడ్ న్యూస్

లే అవుట్‌ వారీగా, ప్లాట్ల వారీగా లబ్ధిదారుల వివరాలను తెలియజేస్తూ మ్యాపింగ్‌ చేసి, ప్రభుత్వం తయారు చేసిన యాప్‌లో ఈ వివరాలన్నింటినీ ఉంచాలని తెలిపారు. లే అవుట్ల వారీగా వివరాలు తెలపాలని అధికారులను సీఎం జగన్‌ ఆదేశించారు. దాని వల్ల మిగిలిన ప్లాట్లను కొత్తగా లబ్ధిదారులకు కేటాయించడానికి వీలు కలుగుతుందన్నారు. మిగిలిపోయిన 12.6 శాతం మ్యాపింగ్‌ పనులను కలెక్టర్లు వెంటనే పూర్తి చేయాలని సూచించారు. ఇళ్ల పట్టాల కోసం పెట్టుకున్న దరఖాస్తుల్లో పెండింగ్‌ ఉంటే వెంటనే వెరిఫికేషన్‌ పూర్తి చేయాలన్నారు.

జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం
లబ్ధిదారులకు ఇదివరకే ఉన్న లే అవుట్లలో 45వేల 600 మందికి, ప్రభుత్వ లే అవుట్లలో 10వేల 851 మందికి డిసెంబర్‌లో పట్టాలు అందించాలన్నారు. 1,48,398 మందికి పట్టాలు ఇవ్వడానికి కొత్తగా భూసేకరణ చేయాల్సి ఉందన్నారు. వన్‌ టైం సెటిల్‌మెంట్‌ పథకానికి జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకంగా పేరు పెట్టినట్లు తెలిపారు. ఈ పథకంలో రిజిస్ట్రేషన్‌ పట్టాలు ఇచ్చే కార్యక్రమం కూడా డిసెంబర్‌లో చేయాలని తెలిపారు. పేదలందరికీ ఇళ్ల పథకలో భాగంగా మొదటి విడతలో 15.6 లక్షల ఇళ్లు కడుతున్నామని తెలిపారు. ఇప్పటివరకూ 10.31 లక్షల ఇళ్లు గ్రౌండ్‌ అయ్యాయని, అక్టోబరు 25 నాటికల్లా బిలో బేస్‌మెంట్‌ లెవల్‌ ఇళ్లను బేస్‌మెంట్‌ లెవల్‌పై స్థాయికి తీసుకొచ్చేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలన్నారు.