Card tokenisation: ఆన్‌లైన్‌లో క్రెడిట్ కార్డ్ వాడే వాళ్లకు గుడ్ న్యూస్

ఆన్ లైన్ పేమెంట్లు క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ వాడి చేస్తున్నారా.. అయితే మీకు ఆర్బీఐ గుడ్ న్యూస్ చెప్పినట్లే. గతంలో మరింత సేఫ్ గా ఉంచడానికి కొత్త ప్లాన్ తీసుకొచ్చింది.

Card tokenisation: ఆన్‌లైన్‌లో క్రెడిట్ కార్డ్ వాడే వాళ్లకు గుడ్ న్యూస్

Rbi Tokenization

Card Tokenisation: ఆన్ లైన్ పేమెంట్లు క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ వాడి చేస్తున్నారా.. అయితే మీకు ఆర్బీఐ గుడ్ న్యూస్ చెప్పినట్లే. గతంలో మరింత సేఫ్ గా ఉంచడానికి కొత్త ప్లాన్ తీసుకొచ్చింది. దీంతో ఇకపై మర్చంట్ సైట్స్ లో మీ డిటైల్స్ సేఫ్ అయి ఉండటం జరగదు. ఇలా జరగడం వల్ల డేటా చోరీ జరుగుతుందేమోననే భయం కూడా ఉండదు. ఈ కామర్స్ సైట్లలో కొనుగోలు జరిపే సమయంలో వేగవంతంగానూ సురక్షితంగానూ ఉండొచ్చు. పేమెంట్స్ చేసేటప్పుడు టోకెనైజేషన్ చేయడం ద్వారా ఇది సాధ్యపడుతుంది.

టోకెనైజేషన్ అంటే..:
టోకెనైజేషన్ ప్రక్రియలో కార్డ్ వివరాలను ఇతర కార్డులతో రీప్లేస్ చేస్తారు. దీనిని టోకెన్ అంటారు. కార్డ్, రిక్వెస్టర్ టోకెన్ లాంటి కాంబినేషన్స్‌తో కార్డ్ నెట్‌వర్క్‌కు ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. ఈ సిస్టమ్ పాయింట్ ఆఫ్ సేల్ దగ్గర క్యూఆర్ కోడ్ పేమెంట్స్ దగ్గర యూజ్ అవుతుంది.

ఈ సిస్టమ్‌ను 2022 జనవరి 1నుంచి అందుబాటులోకి తీసుకురానుంది ఆర్బీఐ. ఇవి కాకుండా అంతకుముందు సేవ్ అయి ఉన్న కార్డ్ వివరాలేమైనా ఉంటే రీప్లేస్ అయిపోతాయని ఆర్బీఐ సర్క్యూలర్ లో చెప్పుకొచ్చింది. కార్డ్ డేటా స్టోర్ చేసుకోవడాన్ని మార్చి 2020కే పరిమితం చేసిన ఆర్బీఐ.. 2021 డిసెంబర్ 31వరకూ పొడిగించింది.

……………………..Read Also: 8 లక్షల యాప్‌‌ ల‌ను నిషేధించిన గూగుల్, యాపిల్

టోకెన్ సర్వీస్ ప్రొవైడర్స్ గా ఉన్న వీసా, మాస్టర్ కార్డ్ కంపెనీలు మొబైల్ పేమెంట్స్ కోసం, ఈ కామర్స్ ప్లాట్ ఫాంల కోసం కార్డు వెనుక ఉండే సీవీవీ కాకుండా మూడు నెంబర్లను అడుగుతాయి. అలా ఎంటర్ చేయడం వల్ల కార్డును గుర్తించడంతో పాటు ట్రాన్సాక్షన్ ఆథరైజ్ అవుతుంది. మొబైల్ వ్యాలెట్స్, ఫిజికల్, ఫ్లిప్‌కార్ట్ లాంటి ఆన్‌లైన్ స్టోర్లలో కొనుగోలు జరిపేందుకు టోకెన్స్ జనరేట్ అవుతాయి.