Pawan Kalyan : కనకవల్లీసహిత లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో డిప్యూటీ సీఎం పవన్.. గడ్డంతో మాస్ లుక్ లో ఫొటోలు వైరల్..
ఏలూరు జిల్లా ఐ.ఎస్. జగన్నాథపురంలోని శ్రీ కనకవల్లీసహిత లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని నేడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దర్శించుకున్నారు. పుష్పార్చనలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయం వద్ద పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసారు. అలాగే ఐ.ఎస్. జగన్నాథపురం శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయ స్థల పురాణం పుస్తకాన్ని ఆవిష్కరించారు పవన్. .














