Producer SKN : నిర్మాతకు వచ్చేది కేవలం 17 పైసలే.. అసలు పాప్ కార్న్ తో మాకు సంబంధమే లేదు.. SKN ట్వీట్ వైరల్..

నిర్మాత SKN ఒక ఫ్యామిలీ సినిమాకు ఖర్చుపెట్టేదాంట్లో, ఒక టికెట్ రేటులో, థియేటర్లో అమ్మే వాటి మీద క్లారిటీ ఇస్తూ ట్వీట్ చేసాడు. (Producer SKN)

Producer SKN : నిర్మాతకు వచ్చేది కేవలం 17 పైసలే.. అసలు పాప్ కార్న్ తో మాకు సంబంధమే లేదు.. SKN ట్వీట్ వైరల్..

Producer SKN

Updated On : November 25, 2025 / 3:02 PM IST

Producer SKN : ఇటీవల సినీ పరిశ్రమ విషయంలో టికెట్ రేట్ల పెంపు, పైరసీ బాగా చర్చనీయాంశంగా మారాయి. పలువురు నెటిజన్లు ప్రతిదానికి నిర్మాతనే తప్పు పడుతూ సినిమా వాళ్ళను తిడుతున్నారు. ఇటీవల రాజు వెడ్స్ రాంబాయి సినిమాకు 99 రూపాయలే టికెట్ రేట్లు బన్నీ వాసు పెట్టిన ఎగ్జిబిటర్స్ రెండు రోజులు నడిపి మళ్ళీ టికెట్ రేట్లు పెంచారు. ఇది ఎగ్జిబిటర్స్ చేసినా నిర్మాతలనే తప్పు పడుతున్నారు.(Producer SKN)

టికెట్ రేట్లు, సినిమాల విషయంలో చాలా మందికి అవగాహన లేక ప్రతిదానికి నిర్మాతలని విమర్శిస్తున్నారు. ముఖ్యంగా మల్టిప్లెక్స్ ల విషయంలో నిర్మాతలే దోచేసుకుంటున్నారన్నట్టు, పాప్ కార్న్ రేట్లు ఎక్కువగా ఉన్నాయని, నిర్మాతలే మల్టిప్లెక్స్ లలో దోచుకుంటున్నారని చిత్రీకరిస్తున్నారు. కానీ రియాలిటీ వేరు. అందరికంటే ఎక్కువ నష్టపోయేది, తక్కువ లాభం తీసుకునేది నిర్మాతలే. గతంలో బాహుబలి 2 కి వెయ్యి కోట్లు వచ్చినప్పుడు కూడా నిర్మాత తమకేమి లాభం రాలేదని చెప్పారు.

Also Read : Dharmendra : స్టార్ హీరో మరణం.. 100 కోట్ల ఫామ్ హౌస్.. రెస్టారెంట్ బిజినెస్.. ఈయన ఆస్తి ఎన్ని వందల కోట్లో తెలుసా?

ఇలాంటి నేపథ్యంలో నిర్మాత SKN ఒక ఫ్యామిలీ సినిమాకు ఖర్చుపెట్టేదాంట్లో, ఒక టికెట్ రేటులో, థియేటర్లో అమ్మే వాటి మీద క్లారిటీ ఇస్తూ ట్వీట్ చేసాడు.

నిర్మాత SKN తన ట్వీట్ లో.. కష్టపడి దర్శకుడుని పట్టుకొని కథ చేయించుకొని హీరోని ఒప్పించి డబ్బులు అప్పులు చేసి సినిమా తీసే నిర్మాతకి మిగిలేది కేవలం 17 శాతం. పాప్కార్న్ సమోసా కూల్ డ్రింక్ థియేటర్ యాడ్స్ తో నిర్మాతకి పైసా సంభంధం ఉండదు. ఒక ఫ్యామిలీ ఆన్లైన్ లో సినిమా టికెట్స్ కు 2178 రూపాయలు ఖర్చు చేస్తే అందులో 70.95 శాతం అంటే 1545.33 రూపాయలు మల్టిప్లెక్స్ లకు వెళ్తాయి. నిర్మాతకు 17.08 శాతం అంటే 372 రూపాయలు వస్తాయి. గవర్నమెంట్ GST ట్యాక్స్ – 8.36 శాతం అంటే 182 రూపాయలు వెళ్తాయి. బుక్ మై షోకి 3.61 శాతం వస్తాయి అంటే 78.67 రూపాయలు.

కాబట్టి ఆడియన్స్ పెట్టే డబ్బుల్లో ఎక్కువగా మల్టిప్లెక్స్ వాళ్ళకే వెళ్తాయి. రిస్క్ చేసి అప్పులు తెచ్చి సినిమాలు తీసే నిర్మాతలకు కేవలం 17 శాతం అంటే ఒక రూపాయిలో కేవలం 17 పైసలు మాత్రమే వస్తాయి. ఇంతకు మించి వేరే వాటిల్లోంచి మల్టిప్లెక్స్ ఆదాయం నుంచి నిర్మాతకు ఇంకేమి రాదు. జనాలకు, ప్రేక్షకులకు తప్పుగా వెళ్తుందని ఈ వివరణ ఇస్తున్నాను. నిర్మాత కేవలం 17 శాతం మాత్రమే తీసుకుంటున్నాడు. మిగతా అంతా మల్టిప్లెక్స్ లు, బుక్ మై షో తీసుకుంటున్నాయి. అసలు పాప్ కార్న్, కూల్ డ్రింక్స్ కి సినిమా ఆదాయానికి, నిర్మాతలకు ఎలాంటి సంబంధం లేదు. అదంతా మల్టిప్లెక్స్ ల వాళ్లదే అని తెలిపారు.

Also Read : Meena Kumari : పెళ్లయినా ధర్మేంద్రని ప్రేమించిన బాలీవుడ్ స్టార్ హీరోయిన్.. రివెంజ్ తీర్చుకున్న భర్త..

దీంతో నిర్మాత SKN ట్వీట్ వైరల్ గా మారగా నిర్మాతల కష్టాలు తెలిసినవాళ్ళు ఇది కదా కావాల్సింది, జనాలకు ఇలా ఎవరూ క్లారిటీ ఇవ్వట్లేదు అని కామెంట్స్ చేస్తుంటే పలువురు సింగిల్ స్క్రీన్స్ విషయంలో కూడా డిటైలింగ్ ఇవ్వండి అని పోస్ట్ చేస్తున్నారు. SKN ఈ టికెట్ ఆదాయం ఎవరికి ఎంత వెళ్తుంది అని చార్ట్ కూడా వేసి పోస్ట్ చేయడం గమనార్హం.