Dharmendra : స్టార్ హీరో మరణం.. 100 కోట్ల ఫామ్ హౌస్.. రెస్టారెంట్ బిజినెస్.. ఈయన ఆస్తి ఎన్ని వందల కోట్లో తెలుసా?

ఈ క్రమంలో ధర్మేంద్రకి చెందిన పలు విషయాలు వైరల్ గా మారాయి.(Dharmendra)

Dharmendra : స్టార్ హీరో మరణం.. 100 కోట్ల ఫామ్ హౌస్.. రెస్టారెంట్ బిజినెస్.. ఈయన ఆస్తి ఎన్ని వందల కోట్లో తెలుసా?

Dharmendra

Updated On : November 24, 2025 / 5:49 PM IST

Dharmendra : ఒకప్పటి బాలీవుడ్ స్టార్ హీరో, హీ మ్యాన్, యాక్షన్ హీరో ధర్మేంద్ర నేడు ఉదయం మరణించారు. దీంతో బాలీవుడ్ లో తీవ్ర విషాదం నెలకొంది . సినీ సెలబ్రిటీలు, అభిమానులు ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. ఈ క్రమంలో ధర్మేంద్రకి చెందిన పలు విషయాలు వైరల్ గా మారాయి.(Dharmendra)

ధర్మేంద్రకు ప్రకాష్ కౌర్, హేమమాలిని ఇద్దరు భార్యలు ఉన్నారు. బాబీ డియోల్, సన్నీ డియోల్ తో పాటు మొత్తం ఆరుగురు పిల్లలు ఉన్నారు. ధర్మేంద్రకు ఆస్తి వందల కోట్లలోనే ఉంది.

Also See : Allu Arha Birthday : దుబాయ్ లో బన్నీ కూతురు అల్లు అర్హ పుట్టిన రోజు వేడుకలు.. ఫొటోలు వైరల్..

పలు బిజినెస్ నివేదికల ప్రకారం ధర్మేంద్ర మొత్తం ఆస్తి దాదాపు 335 కోట్ల పైనే అని సమాచారం. ధర్మేంద్రకు ముంబై జుహులో ఓ ఖరీదైన ఫ్లాట్ ఉంది. లోనావాలాలో 100 కోట్ల విలువ గల ఫామ్ హౌస్ ఉంది. ధర్మేంద్రకు షూటింగ్స్ లేనప్పుడు అక్కడికి వెళ్లి రెస్ట్ తీసుకుంటాడు.

ధర్మేంద్ర 2015 లో గరమ్ ధరమ్ ధాబా అనే రెస్టారెంట్ ని 2012 లో ప్రారంభించాడు. అనంతరం హి మ్యాన్ అనే పేరుతో ఓ రెస్టారెంట్ ని, ఆ తర్వాత పలు రెస్టారెంట్ లను వివిధ ప్రాంతాల్లో ప్రారంభించారు. వేరే రెస్టారెంట్ చైన్ లో కూడా ధర్మేంద్ర భాగస్వామిగా ఉన్నారు. లోనావాలాలో ఆయన ఫామ్ హౌస్ దగ్గర ఒక రిసార్ట్ పెట్టాలని ప్లాన్ చేసారు కానీ అది అవ్వకముందే మరణించారు.

Also Read : Dhjarmendra : స్టార్ హీరో మరణం.. 19 ఏళ్లకే పెళ్లి.. ఇద్దరు భార్యలు.. ఆరుగురు పిల్లలు.. ఈయన పెళ్లి వివాదం గురించి తెలుసా?

అలాగే ధర్మేంద్రకు మహారాష్ట్రలో 17 కోట్ల రూపాయల బిల్డింగ్ ప్రాపర్టీ ఉంది. 88 లక్షల విలువ చేసే అగ్రికల్చర్ ల్యాండ్, 52 లక్షలు విలువ చేసే నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉన్నాయి. ధర్మేంద్రకు ఖరీదైన కార్లు కూడా ఉన్నాయి. తన కెరీర్ మొదట్లో కొనుక్కున్న పాత వింటేజ్ ఫియట్ తో పాటు దాదాపు కోటి రూపాయలు విలువ చేసే రేంజ్ రోవర్, బెంజ్ కార్లు ఉన్నాయి. ధర్మేంద్ర నిర్మాతగా కూడా విజేత ఫిలిమ్స్ బ్యానర్ పై పలు సినిమాలు నిర్మించారు. ఈ ప్రాపర్టీస్ అన్ని కేవలం ధర్మేంద్ర పేరు మీద ఉన్నవే. ఇక ఆయన ఇద్దరు భార్యలు, పిల్లల ఆస్తులు ఎవరి పేరు మీద వారివే.

 

View this post on Instagram

 

A post shared by Dharmendra Deol (@aapkadharam)