Dhjarmendra : స్టార్ హీరో మరణం.. 19 ఏళ్లకే పెళ్లి.. ఇద్దరు భార్యలు.. ఆరుగురు పిల్లలు.. ఈయన పెళ్లి వివాదం గురించి తెలుసా?
హీరోగా ధర్మేంద్ర ఎన్ని సక్సెస్ లు చూసినా ఫ్యామిలీ విషయంలో మాత్రం వివాదంలో నిలిచారు. (Dharmendra)
Dharmendra
Dhjarmendra : ఒకప్పటి బాలీవుడ్ స్టార్ హీరో ధర్మేంద్ర నేడు ఉదయం పలు ఆరోగ్య సమస్యలతో మరణించారు. ఎన్నో సినిమాలతో హిందీ ప్రేక్షకులను మెప్పించి ఒక లెజెండరీ యాక్టర్ గా నిలిచారు. అమితాబ్ తో సమానంగా స్టార్ హీరోగా ఎదిగారు. చివరి శ్వాస వరకు సినిమాలో అడపాదడపా నటిస్తూనే ఉన్నారు ధర్మేంద్ర. అయితే హీరోగా ధర్మేంద్ర ఎన్ని సక్సెస్ లు చూసినా ఫ్యామిలీ విషయంలో మాత్రం వివాదంలో నిలిచారు.
ధర్మేంద్ర ఇండస్ట్రీకి రాకముందే 1954 లో 19 ఏళ్ళ వయసులోనే ఇంట్లో వాళ్ళు చూసిన సంబంధం ప్రకాష్ కౌర్ ని పెళ్లి చేసుకున్నారు. ప్రకాష్ కౌర్ తో ధర్మేంద్రకు సన్నీ డియోల్, బాబీ డియోల్, విజేత డియోల్, అజిత డియోల్.. అని ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. సన్నీ డియోల్, బాబీ డియోల్ హీరోలుగా, విలన్స్ గా బాలీవుడ్, సౌత్ లో సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే.
Also Read : Dharmendra : బాలీవుడ్ హీ మ్యాన్.. ఒకప్పటి స్టార్ హీరో ధర్మేంద్ర కన్నుమూత.. తీవ్ర విషాదం..
సినిమాల్లోకి వచ్చాక నటి హేమమాలినిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ధర్మేంద్ర. హేమమాలినితో కలిసి ధర్మేంద్ర అనేక సినిమాలు చేసాడు. ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ మొదలయింది. ఆమె రాకతో ధర్మేంద్ర మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండానే హేమమాలిని ని పెళ్లి చేసుకోవడంతో అప్పట్లో అది పెద్ద వివాదంగా నిలిచింది. హిందూ వివాహ చట్టం ప్రకారం భార్య బతికుండగా, విడాకులు ఇవ్వకుండా రెండో పెళ్లి చేసుకోకూడదు. అయితే హేమమాలిని తో పెళ్లి కోసం ధర్మేంద్ర ఇస్లాం మతంలోకి మారాడని కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి.
హేమమాలిని – ధర్మేంద్ర జంటకు అహనా డియోల్, ఈషా డియోల్ ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఈ ఇద్దరూ కూడా ప్రస్తుతం సినీ పరిశ్రమలోనే ఉన్నారు. హేమమాలినితో పెళ్లి తర్వాత కూడా ధర్మేంద్ర మొదటి భార్య ప్రకాష్ కౌర్ తో కూడా కలిసి ఉన్నాడు. అలా ఒకేసారి ఇద్దరితో వివాహ బంధంలో ఉన్నాడు ధర్మేంద్ర. ప్రకాష్ కౌర్ – హేమమాలిని మధ్య మొదట్లో వివాదాలు వచ్చినా తర్వాత వీరు కూడా దీనికి అంగీకరించడం గమనార్హం. ఇలా ధర్మేంద్ర బాలీవుడ్ స్టార్ హీరోగానే కాక ఇద్దరు భార్యలు, ఆరుగురు పిల్లలతో గతంలో వివాదాల్లో, వార్తల్లో నిలిచాడు.
Also Read : Suman : ఆదిపురుష్ సినిమాపై సుమన్ ఫైర్.. ఇలా వేరే మతం మీద తీయగలరా..?
