Meena Kumari : పెళ్లయినా ధర్మేంద్రని ప్రేమించిన బాలీవుడ్ స్టార్ హీరోయిన్.. రివెంజ్ తీర్చుకున్న భర్త..

ధర్మేంద్ర మొదటి భార్య ప్రకాష్ కౌర్ ఉన్నప్పుడే హేమ మాలినిని వివాహం చేసుకున్నాడు. అయితే వీళ్లిద్దరి రిలేషన్స్ మధ్యలో ధర్మేంద్రకు మరో ప్రేమ వ్యవహారం ఉంది. (Meena Kumari)

Meena Kumari : పెళ్లయినా ధర్మేంద్రని ప్రేమించిన బాలీవుడ్ స్టార్ హీరోయిన్.. రివెంజ్ తీర్చుకున్న భర్త..

Dharmendra

Updated On : November 24, 2025 / 9:10 PM IST

Meena Kumari : ఒకప్పటి బాలీవుడ్ స్టార్ హీరో ధర్మేంద్ర నేడు ఉదయం మరణించారు. దేశవ్యాప్తంగా సినీ, రాజకీయ ప్రముఖులు, ఫ్యాన్స్ ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. ఆయనకు సంబంధించిన పాత విషయాలు ఇప్పుడు మరోసారి వైరల్ గా మారాయి. ధర్మేంద్ర విడాకులు ఇవ్వకుండానే రెండు పెళ్లిళ్లు చేసుకున్న సంగతి తెలిసిందే.(Meena Kumari)

ధర్మేంద్ర మొదటి భార్య ప్రకాష్ కౌర్ ఉన్నప్పుడే హేమ మాలినిని వివాహం చేసుకున్నాడు. అయితే వీళ్లిద్దరి రిలేషన్స్ మధ్యలో ధర్మేంద్రకు మరో ప్రేమ వ్యవహారం ఉంది. ఒకప్పటి బాలీవుడ్ స్టార్ హీరోయిన్, ట్రాజెడీ క్వీన్ మీనాకుమారి ధర్మేంద్రని ప్రేమించింది.

Also Read : Dharmendra : నందమూరి ఫ్యామిలీతో ప్రత్యేక అనుబంధం.. ధర్మేంద్ర సినిమాలు రీమేక్ చేసి హిట్స్ కొట్టిన తండ్రి కొడుకులు..

మీనా కుమారి చిన్న వయసులోనే సక్సెస్ అయి స్టార్ డమ్ తెచ్చుకుంది. అనుకోకుండా దర్శకుడు, నిర్మాత కమల్ అమ్రోహీని పెళ్లి చేసుకుంది మీనాకుమారి. 21 ఏళ్లకే పెళ్లి చేసుకుంది. అప్పటికే కమల్ అమ్రోహీకి ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. ఈ వివాహంలో మీనా కుమారి ఆనందంగా లేకపోవడం, కమల్ తో విబేధాలు వస్తుండటంతో అప్పుడప్పుడే హీరోగా ఎదుగుతున్న ధర్మేంద్రను ఇష్టపడింది.

మీనా కుమారి – ధర్మేంద్ర కలిసి కాజల్, ఫూల్ ఔర్ పత్తర్, చందన్ క పల్నా, మాఝిల్ దీదీ, పూర్ణిమ, బాహర్న్ కి మంజిల్ సినిమాల్లో నటించారు. దీంతో వీరి మధ్య అనుబంధం పెరిగింది. మీనా కుమారి ధర్మేంద్రను ఇష్టపడింది. అప్పటికే మీనాకుమారి స్టార్ హీరోయిన్ కావడంతో దర్శక నిర్మాతలకు ధర్మేంద్రని పరిచయం చేసి అతనికి సినిమాలు ఇప్పించింది. ధర్మేంద్ర స్టార్ హీరో అవ్వడానికి మీనా కుమారి కూడా ఒక కారణం.

Also Read : Dharmendra : స్టార్ హీరో మరణం.. 100 కోట్ల ఫామ్ హౌస్.. రెస్టారెంట్ బిజినెస్.. ఈయన ఆస్తి ఎన్ని వందల కోట్లో తెలుసా?

అయితే మీనా కుమారి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ తో, అనారోగ్య సమస్యలతో 38 ఏళ్ళ వయసులోనే మరణించింది. ధర్మేంద్ర – మీనా కుమారి ప్రేమ వ్యవహారం బాలీవుడ్ అంతా తెలుసు. ఆమె భర్తకు కూడా తెలుసు. మీనా కుమారి భర్త కమల్ ఈ విషయంలో ధర్మేంద్ర పై రివెంజ్ కూడా తీర్చుకున్నాడు.

కమల్ అమ్రోహీ దర్శకుడు కావడంతో 1983 లో తాను తీసిన రజియా సుల్తాన్ అనే సినిమాలో ధర్మేంద్రకు ఒక బానిస పాత్ర ఇచ్చి చాలా కష్టపెట్టాడు. కావాలని ఫేస్ మీద మట్టి పూయడం, మండే ఎండలో నిల్చోపెట్టడం, ముఖంపై బురద వేయడం లాంటి సీన్స్ పెట్టి ధర్మేంద్రని ఇబ్బంది పెట్టాడు. అప్పట్లో ఈ విషయం బాలీవుడ్ లో చర్చగా మారింది.

Meena Kumari