Dharmendra : నందమూరి ఫ్యామిలీతో ప్రత్యేక అనుబంధం.. ధర్మేంద్ర సినిమాలు రీమేక్ చేసి హిట్స్ కొట్టిన తండ్రి కొడుకులు..
ధర్మేంద్రకు తెలుగులో నందమూరి ఫ్యామిలీతో మంచి అనుబంధమే ఉంది. (Dharmendra)
Dharmendra
Dharmendra : బాలీవుడ్ మొదటి తరం యాక్షన్ హీరో, హీ మ్యాన్ ధర్మేంద్ర నేడు ఉదయం మరణించారు. దీంతో బాలీవుడ్ లో తీవ్ర విషాదం నెలకొంది. బాలీవుడ్ సినీ ప్రముఖులే కాక అన్ని పరిశ్రమల స్టార్స్, ఫ్యాన్స్ ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. ఈ క్రమంలో ధర్మేంద్రకు సంబంధించిన విషయాలు వైరల్ గా మారాయి.(Dharmendra)
ధర్మేంద్రకు తెలుగులో నందమూరి ఫ్యామిలీతో మంచి అనుబంధమే ఉంది. ధర్మేంద్ర చేసిన పలు సినిమాలు ఎన్టీఆర్, బాలకృష్ణ రీమేక్ చేసి ఇక్కడ హిట్స్ కొట్టారు. ఎన్టీఆర్ తో ధర్మేంద్రకు మంచి అనుబంధం ఉంది. ఆయన రాజకీయాల్లో విజయం సాధించాక ధర్మేంద్ర ఎన్టీఆర్ ని కలిసి మరీ అభినందించారు.
ధర్మేంద్ర హీరోగా 1966 లో వచ్చిన ఫూల్ ఔర్ పత్తర్ సినిమా భారీ విజయం సాధించగా దీన్ని తెలుగులో ఎన్టీఆర్ నిండు మనసులు గా రీమేక్ చేసారు. 1970 లో ధర్మేంద్ర చేసిన జానీ మేరా నామ్ సినిమాని తెలుగులో ఎన్టీఆర్ ఎదురులేని మనిషి గా రీమేక్ చేసి హిట్ కొట్టారు.
1973లో వచ్చిన ధర్మేంద్ర సూపర్ హిట్ సినిమా ‘యాదోంకి బారాత్’ ని తెలుగులో అన్నదమ్ముల అనుబంధం గా రీమేక్ చేసారు. ధర్మేంద్ర మెయిన్ హీరో కాగా మరో ఇద్దరు హీరోలు ఉన్నారు ఇందులో. తెలుగులో ఎన్టీఆర్ ధర్మేంద్ర పాత్రను చేయగా బాలకృష్ణ, మురళీ మోహన్ మరో రెండు పాత్రలు చేసారు. 1975లో ఎమర్జన్సీ సమయంలో రిలీజయినా ఈ సినిమా మంచి విజయం సాధించింది. బాలయ్యకు ఇది మూడో సినిమా. అంతే కాకుండా బాలయ్య తొలి వంద రోజుల సినిమా ఇదే. అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి ఎమ్జీఆర్ చేతుల మీదుగా బాలయ్య షీల్డ్ అందుకున్నారు.
Also Read : Dharmendra : బాలీవుడ్ హీ మ్యాన్.. ఒకప్పటి స్టార్ హీరో ధర్మేంద్ర కన్నుమూత.. తీవ్ర విషాదం..
1983 లో ధర్మేంద్ర చేసిన ఖయామత్ సినిమాని బాలకృష్ణ ‘నిప్పలాంటి మనిషి’ గా రీమేక్ చేసి విజయం సాధించారు. ఇలా ఎన్టీఆర్, బాలకృష్ణ ధర్మేంద్ర సినిమాలను రీమేక్ చేసి విజయాలు సాధించారు. అలా ధర్మేంద్రతో ఎన్టీఆర్ – బాలయ్య బాబు ఇద్దరికీ మంచి అనుబంధమే ఉంది. నేడు ధర్మేంద్ర మరణంపై బాలయ్య స్పందిస్తూ నివాళులు కూడా అర్పించారు. ఇవే కాకుండా ధర్మేంద్ర చాలా సినిమాలు తెలుగులో, మలయాళం, తమిళ్ లో రీమేక్ అయ్యాయి.
