Mla Adi Srinivas: జస్ట్ మిస్..! ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కు తృటిలో తప్పిన ప్రమాదం.. వీడియో వైరల్..
వేములవాడ మున్సిపాలిటీ పరిధిలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పరిశీలనకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తో పాటు, ఇంఛార్జ్ కలెక్టర్ గరీమా అగర్వాల్, అధికారులు వెళ్లారు.
Mla Adi Srinivas: ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు పెను ప్రమాదం తప్పింది. వేములవాడ మున్సిపల్ పరిధిలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పరిశీలిస్తుండగా ఒక్కసారిగా బేస్ మెంట్ కుంగింది. ఆ సమయంలో అక్కడ ఆది శ్రీనివాస్ తో పాటు కలెక్టర్, ఇతర అధికారులు అక్కడే ఉన్నారు. బేస్ మెంట్ కాస్త కుంగి ఆగిపోవడంతో పెను ప్రమాదమే తప్పింది. అలర్ట్ అయిన అధికారులు ఆది శ్రీనివాస్ ను పక్కకు తీసుకొచ్చారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
వేములవాడ మున్సిపాలిటీ పరిధిలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పరిశీలనకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తో పాటు, ఇంఛార్జ్ కలెక్టర్ గరీమా అగర్వాల్, అధికారులు వెళ్లారు. కొన్ని ఇళ్లను పరిశీలిస్తున్న సమయంలోనే ఒక్కసారిగా ప్రమాదం జరిగింది. ఓ ఇంటి బేస్ మెంట్ ఒక్కసారిగా కుంగిపోయింది. దాని మీద నిల్చున్న ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, అధికారులు కుదుపునకు గురయ్యారు. ఐదేళ్ల క్రితం నిర్మించిన ఇంటి బేస్ మెంట్ అది. బేస్ మెంట్ కు సంబంధించిన నిర్వహణ లేకపోవడం, ఆనాడు నిర్మాణ సమయంలో నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడం, దీనికి తోడు ఎక్కువ మంది బేస్ మెంట్ పై నిలబడటం, ఓవర్ వెయిట్ కారణంగా ఒక్కసారిగా అది కుంగిపోయింది. ఈ ఊహించని పరిణామంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు.
దీనిపై ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ స్పందించారు. తృటిలో ప్రమాదం తప్పిందని చెప్పారు. నాణ్యతా ప్రమాణాలు లోపించడం వల్లే ఇలా జరిగి ఉంటుందన్నారు. ఐదేళ్ల క్రితం నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఆలనాపాలనా లేకపోవడం కారణం ఒకటైతే, నిర్మాణ పనుల్లో లోపాల వల్ల ఇలా జరిగి ఉంటుందన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. బేస్ మెంట్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుందని అంతా భావించారు. కానీ, ఇలా కుంగిపోవడం అందరినీ షాక్ కి గురి చేసింది.
