Google Pixel 6a : గూగుల్ పిక్సెల్ 7a లాంచ్.. ఫ్లిప్‌కార్ట్‌లో పిక్సెల్ 6a ఫోన్ ధర భారీగా తగ్గిందోచ్.. ఏ ఫోన్ కొంటే బెటర్ అంటే?

Google Pixel 6a : గూగుల్ పిక్సెల్ 7a ఫోన్ ఇలా లాంచ్ అయిందో లేదో ఫ్లిప్‌కార్ట్‌లో పిక్సెల్ 6a మోడల్ ఫోన్ ధర భారీగా తగ్గింది. రూ.20వేల లోపు ధరకే ఈ ఫోన్ సొంతం చేసుకోవచ్చు.

Google Pixel 6a : గూగుల్ పిక్సెల్ 7a లాంచ్.. ఫ్లిప్‌కార్ట్‌లో పిక్సెల్ 6a ఫోన్ ధర భారీగా తగ్గిందోచ్.. ఏ ఫోన్ కొంటే బెటర్ అంటే?

After Google Pixel 7a launch, Pixel 6a gets massive discount on Flipkart; how to get it for under Rs 20K

Google Pixel 6a : ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ (Google) వార్షిక ఈవెంట్ (Google I/O) సందర్భంగా గూగుల్ మిడ్ రేంజ్ పిక్సెల్ 7a (Google Pixel 7a) ఫోన్ లాంచ్ చేసింది. అదే సమయంలో ఫ్లిప్‌కార్ట్‌ (Flipkart)లో మిడ్-రేంజ్ పిక్సెల్ 7aని భారత మార్కెట్లో రూ. 43,999 ధరకు రిలీజ్ చేసింది. లాంచ్ చేసిన వెంటనే, గత Pixel 6a ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో ఆఫర్‌లు, డిస్కౌంట్‌లతో అందుబాటులో ఉంది. పిక్సెల్ 7a మాదిరిగానే ఈ స్మార్ట్‌ఫోన్ గత ఏడాదిలో భారత్‌లో రూ. 43,999 ప్రారంభ ధరతో లాంచ్ అయింది.

గూగుల్ పిక్సెల్ 6a భారీగా తగ్గింపు :
ఫ్లిప్‌కార్ట్‌లో (Google Pixel 6a) ప్రారంభ ధర రూ. 43,999 నుంచి రూ. 27,999కి అందుబాటులో ఉంది. 6GB RAM, 128GB ఇంటర్నల్ స్టోరేజ్‌ని అందించే స్టోరేజ్ వేరియంట్‌లో వస్తుంది. అంతేకాదు.. HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ EMI లావాదేవీలపై కొనుగోలుదారులు రూ. 1,250 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. భారత మార్కెట్లో ఈ ఫోన్ ధర రూ.26,750కి తగ్గుతుంది. ఇంకా, కొనుగోలుదారులు పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేసుకోవచ్చు. ఈ ఫోన్ ధరను రూ. 20వేలలోపు తగ్గించవచ్చు. ఈ పిక్సెల్ ఫోన్ చాక్, చార్కోల్ కలర్ వేరియంట్‌లో వస్తుంది.

Read Also : Google Bard AI : చాట్‌జీపీటీ, బింగ్ ఏఐకి పోటీగా.. గూగుల్ బార్డ్ ఏఐ.. భారత్‌లో ఎలా యాక్సెస్ చేస్తారో తెలుసా? పూర్తి వివరాలు మీకోసం..!

గూగుల్ పిక్సెల్ Pixel 7a ధర, ఆఫర్ :
కొత్తగా లాంచ్ అయిన గూగుల్ Pixel 7a ధర రూ. 43,999 వద్ద లాంచ్ అయింది. చార్‌కోల్, సీ, స్నో కలర్ వేరియంట్‌లలో లభిస్తుంది. 8GB RAM, 128GB ఇంటర్నల్ స్టోరేజీని అందిస్తుంది. ఆఫర్ల పరంగా చూస్తే.. పిక్సెల్ యూజర్లు కొనుగోలు చేసిన Pixel 7Aపై HDFC బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డ్‌లపై రూ.4వేల ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. ఈ ఫోన్ ధర రూ.39,999కి తగ్గుతుంది.

After Google Pixel 7a launch, Pixel 6a gets massive discount on Flipkart; how to get it for under Rs 20K

After Google Pixel 7a launch, Pixel 6a gets massive discount on Flipkart

పిక్సెల్ 7a vs పిక్సెల్ 6a :
పిక్సెల్ 6a, పిక్సెల్ 7a రెండూ ఒకే 6.1-అంగుళాల OLED డిస్‌ప్లేతో వస్తాయి. Pixel 7A డిస్‌ప్లే 90Hz రిఫ్రెష్ రేట్‌ను అందిస్తుంది. అయితే Pixel 6A డిస్‌ప్లే 60Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. Pixel 6Aలో 6GB RAM నుంచి 8GB RAMతో Pixel 7A వస్తుంది. రెండు హ్యాండ్‌సెట్‌లు ఒకే 128GB స్టోరేజీతో అందిస్తాయి. చిప్‌సెట్ పరంగా, Pixel 7a సరికొత్త Tensor G2 చిప్‌సెట్ అందిస్తుంది. అయితే, గత ఫోన్ మాదిరిగానే ఫస్ట్ జనరేషన్ టెన్సర్ చిప్‌సెట్‌తో వచ్చింది.

కెమెరా విభాగంలో, Pixel 7A అప్‌గ్రేడ్ 64MP డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌తో వచ్చింది. Pixel 6A 12MP డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. సెల్ఫీల కోసం Pixel 7A మెరుగైన 13MP కెమెరాను కలిగి ఉంది. Pixel 6A 8MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో వచ్చింది. Pixel 7a గత ఫోన్ కన్నా మెరుగైన బ్యాటరీతో రాలేదు. వాస్తవానికి Pixel 6A కన్నా కొంచెం తక్కువ బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. పిక్సెల్ 7A 4,385 mAh బ్యాటరీని కలిగి ఉంది. Pixel 6A 4,410 mAh బ్యాటరీతో వచ్చింది.

Read Also : Google Pixel 7a : భారత్‌లో తక్కువ ధరకే పిక్సెల్ 7a ఫోన్.. అదిరే ఫీచర్లు, మరెన్నో డిస్కౌంట్లు.. ఫ్లిప్‌కార్ట్‌లో సేల్ ఎప్పుడంటే?