Google Pixel 7a : భారత్‌లో తక్కువ ధరకే పిక్సెల్ 7a ఫోన్.. అదిరే ఫీచర్లు, మరెన్నో డిస్కౌంట్లు.. ఫ్లిప్‌కార్ట్‌లో సేల్ ఎప్పుడంటే?

Google Pixel 7a : గూగుల్ వార్షిక Google I/O ఈవెంట్‌లో సొంత బ్రాండ్ గూగుల్ పిక్సెల్ 7a ఫోన్ లాంచ్ చేసింది. ఈ ఫోన్‌పై లాంచ్ ఆఫర్లను ప్రకటించింది. పిక్సెల్ 7a ఫోన్ తక్కువ ధరకే కొనుగోలు చేయాలంటే..

Google Pixel 7a : భారత్‌లో తక్కువ ధరకే పిక్సెల్ 7a ఫోన్.. అదిరే ఫీచర్లు, మరెన్నో డిస్కౌంట్లు.. ఫ్లిప్‌కార్ట్‌లో సేల్ ఎప్పుడంటే?

Google Pixel 7a _ Google launches Pixel 7a in India at Rs 39,999; check offers and features

Google Pixel 7a : ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ (Google) సరికొత్త A-సిరీస్ స్మార్ట్‌ఫోన్ (Google Pixel 7a) భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ గూగుల్ పిక్సెల్ 7a ఫోన్ ప్రీమియం మిడ్-రేంజ్ విభాగంలో వస్తుంది. Samsung Galaxy A54, OnePlus 11R వంటి ఫీచర్లతో పోటీ పడుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్ వివిధ ఆఫర్‌లతో సహా (అసలు ధర రూ. 43,999) ఉండగా.. లాంచ్ ఆఫర్లతో ఈ ఫోన్ ధర రూ. 39,999కు కొనుగోలు చేయొచ్చు. మే 11 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో ఈ పిక్సెల్ 7a ఫోన్ కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది.

గూగుల్ పిక్సెల్ 7a ఆఫర్‌లు :
భారతీయ కొనుగోలుదారుల కోసం గూగుల్ అనేక ఆఫర్లను ప్రకటించింది. HDFC బ్యాంక్ కార్డ్ హోల్డర్‌లు రూ. 4వేల ఇన్‌స్టంట్ డిస్కౌంట్ కూడా పొందవచ్చు. ఏదైనా పిక్సెల్ డివైజ్ లేదా ఎంపిక చేసిన స్మార్ట్‌ఫోన్ మోడల్‌లకు బదులుగా నో-కాస్ట్ EMI లేదా రూ. 4వేల డిస్కౌంట్ పొందవచ్చు. పిక్సెల్ 7aని కొనుగోలు చేసే కస్టమర్‌లు (Fitbit Inspire 2)ని రూ. 3,999కి కొనుగోలు చేయొచ్చు. అంతేకాదు.. (Pixel Buds A-Series)ని స్మార్ట్‌ఫోన్‌తో అదే ధరకు కూడా పొందవచ్చు. అదనంగా, గూగుల్ ఏడాది పాటు ఉచిత స్క్రీన్ డ్యామేజ్ ప్రొటెక్షన్ కూడా అందిస్తుంది.

Read Also : Google Topic Filters : గూగుల్ డెస్క్‌టాప్ యూజర్ల కోసం కొత్త ‘టాపిక్ ఫిల్టర్స్’ ఫీచర్.. మీ టాపిక్ ఇలా సెర్చ్ చేస్తే చాలు..!

(YouTube Premium), Google One మూడు నెలల ట్రయల్‌ని కూడా అందిస్తుంది. గూగుల్ వినియోగదారులు Charcoal, Snow, Sea అనే మూడు కలర్ ఆప్షన్లలో ఎంచుకోవచ్చు. కొత్త Pixel 7a, Pixel 7, 7 Pro మాదిరిగానే (Google Tensor G2) చిప్, Titan M2 సెక్యూరిటీ చిప్‌తో వస్తుంది. ఈ ఫోన్ 6.1-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఫేస్ అన్‌లాక్, 8GB RAM, 90Hz డిస్‌ప్లే, IP67 డస్ట్, వాటర్ ప్రొటెక్షన్, వైర్‌లెస్ ఛార్జింగ్‌ని కూడా అందిస్తుంది.

Google Pixel 7a _ Google launches Pixel 7a in India at Rs 39,999; check offers and features

Google Pixel 7a _ Google launches Pixel 7a in India at Rs 39,999 

Pixel 7a కెమెరా ఫీచర్లు :
పిక్సెల్ 7a కెమెరా ఫీచర్లు.. Pixel 6a కన్నా 72 శాతం పెద్ద సెన్సార్‌ను కలిగి ఉంది. కొత్త 13MP అల్ట్రావైడ్ లెన్స్‌ను కలిగి ఉంది. వినియోగదారులు 13-MP ఫ్రంట్ కెమెరాను ఉపయోగించి 4K వీడియోని క్యాప్చర్ చేయవచ్చని గూగుల్ పేర్కొంది. Pixel 7a ఫోన్ 8x వరకు సూపర్ రెస్ జూమ్‌ను కూడా అందిస్తుంది. Pixel 7a, Google ఫోటోలలో మ్యాజిక్ ఎరేజర్, ఫొటో అన్‌బ్లర్‌ను కూడా కలిగి ఉంది. డిజైన్ పరంగా, Pixel 7a ఇతర వెర్షన్ల మాదిరిగానే ఉంటుంది.

గూగుల్ పిక్సెల్ కెమెరా బార్‌ను కలిగి ఉంటుంది. కొత్త మిడ్‌ఫ్రేమ్ ఆర్కిటెక్చర్ కలిగి ఉంటుందని గూగుల్ పేర్కొంది. ఈ ఫోన్ అల్యూమినియం హౌసింగ్ 100 శాతం రీసైకిల్ మెటీరియల్స్‌తో వస్తుంది. ఈ డివైజ్ లైవ్ ట్రాన్స్‌లేట్, రికార్డర్ స్పీకర్ లేబుల్‌లు, అసిస్టెంట్ వాయిస్ టైపింగ్, మెసేజెస్ యాప్‌లో వాయిస్ మెసేజింగ్ ట్రాన్స్‌క్రిప్షన్ వంటి టెన్సర్ G2 ద్వారా ఆధారితమైన పిక్సెల్ స్పీచ్ ఫీచర్‌లను కూడా ఇంటిగ్రేట్ చేస్తుంది.

గూగుల్ పిక్సెల్ సర్వీసు సెంటర్లు :
దేశవ్యాప్తంగా పిక్సెల్ వినియోగదారులు F1 ఇన్ఫో సొల్యూషన్స్‌తో పిక్సెల్ డివైజ్‌లకు వాక్-ఇన్ సపోర్ట్ అందించే 28 మల్టీ-బ్రాండ్ స్టోర్‌లను యాక్సెస్ చేయగలరని గూగుల్ పేర్కొంది. ఈ సర్వీసు సెంటర్లు దేశంలోని 27 నగరాల్లో విస్తరించి ఉన్నాయి. ఈ సెంటర్లు వినియోగదారులను సమస్యలను గుర్తించడానికి, చిన్న సమస్యలను పరిష్కరించడానికి, వారి డివైజ్ గురించి సమాచారాన్ని పొందేందుకు అనుమతిస్తాయని గూగుల్ పేర్కొంది. ఫిజికల్ రిపేర్ల కోసం సర్వీసింగ్ సెంటర్లు డివైజ్‌లను ప్యాక్ చేయడంతో పాటు షిప్పింగ్ కూడా చేస్తాయని గూగుల్ తెలిపింది.

Read Also : Google Bard AI : చాట్‌జీపీటీ, బింగ్ ఏఐకి పోటీగా.. గూగుల్ బార్డ్ ఏఐ.. భారత్‌లో ఎలా యాక్సెస్ చేస్తారో తెలుసా? పూర్తి వివరాలు మీకోసం..!