Google Topic Filters : గూగుల్ డెస్క్‌టాప్ యూజర్ల కోసం కొత్త ‘టాపిక్ ఫిల్టర్స్’ ఫీచర్.. మీ టాపిక్ ఇలా సెర్చ్ చేస్తే చాలు..!

Google Topic Filters : గూగుల్ (Google) యూజర్ల కోసం సరికొత్త ఫీచర్లను తీసుకొస్తోంది. ఇప్పటికే, మొబైల్ వెర్షన్‌లో ‘టాపిక్ ఫిల్టర్స్‘ (Topic Filters) ఫీచర్ అందుబాటులోకి తెచ్చింది. ఇప్పుడు డెస్క్‌టాప్ వెర్షన్ యూజర్లు కూడా అదే ఫీచర్ అందిస్తోంది.

Google Topic Filters : గూగుల్ డెస్క్‌టాప్ యూజర్ల కోసం కొత్త ‘టాపిక్ ఫిల్టర్స్’ ఫీచర్.. మీ టాపిక్ ఇలా సెర్చ్ చేస్తే చాలు..!

Google Topic Filters _ Search Gaint Google brings its popular Search ‘Topic filters’ feature on mobile to desktop users

Google Topic Filters : ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ (Google) తమ సర్వీసుల్లో అనేక కొత్త అప్‌డేట్స్ (Google New Updates) తీసుకొస్తోంది. గూగుల్ తమ సెర్చ్ రిజల్ట్స్ (Google Search Results) విషయంలోనూ అనేక మార్పులు చేస్తోంది. అందులో భాగంగా అనేక సరికొత్త ఫీచర్లను యాడ్ చేస్తోంది. గత ఏడాది (2022) డిసెంబర్‌లో, డెస్క్‌టాప్‌ యూజర్ల (Google Desktop Users) కోసం సెర్చ్ చేయడానికి ‘Topic Filters’ అనే ఫీచర్‌ను గూగుల్ రూపొందించింది.

ఈ కొత్త ఫీచర్ ద్వారా యూజర్లు తమ కావాల్సిన టాపిక్ ఆధారంగా సెర్చ్ చేసి రిజల్ట్స్ పొందవచ్చు. మీరు సెర్చ్ చేసిన పదం ఆధారంగా ఆయా అంశాలను గూగుల్ సెర్చ్ రిజల్ట్స్ (SERP)లో సూచిస్తుంది. ఉదాహరణకు.. మీరు గూగుల్ (Google Pixel 7) కోసం (Google)లో సెర్చ్ చేస్తే.. సూచించే రిజల్ట్స్‌లో ‘Shopping‘, ‘Photos‘ ‘News‘ వంటి సాధారణ సెర్చ్ ట్యాబ్‌లకు కుడి వైపున ‘Details‘, ‘Reviews‘ వంటి అంశాలను కేటగిరీలుగా చూపిస్తుంది.

Read Also :  Google Bard vs ChatGPT: మరింత పెరిగిన పోటీ.. గూగుల్ ఉద్యోగులకు సుందర్ పిచాయ్ కీలక సూచనలు

ఇటీవల, టెక్ దిగ్గజం గూగుల్ సెర్చ్ డెస్క్‌టాప్ వెర్షన్‌కు ఈ కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. అయితే, ఇందులో టాపిక్‌లు డైనమిక్‌గా ఉన్నాయని, సెర్చ్ చేసిన కొద్ది రిజల్ట్స్ మారుతున్నాయని గూగుల్ చెబుతోంది. ఈ మార్పు సర్వీసును ఉపయోగించే వారికి వారు సెర్చ్ చేసే సమాచారాన్ని కచ్చితంగా అందించడానికి సాయపడుతుంది. ఇందులోని ఫిల్టర్‌లను సెట్ చేసేందుకు యూజర్లకు అనుమతించే ‘All Filters’ అని లేబుల్ కింద కొత్త డ్రాప్-డౌన్ మెనుని కూడా గూగుల్ ప్రవేశపెట్టింది.

Google Topic Filters _ Search Gaint Google brings its popular Search ‘Topic filters’ feature on mobile to desktop users

Google Topic Filters : Google brings its popular Search Topic filters feature on mobile to desktop users Photo : (Google)

గూగుల్ ఆల్గారిథమ్ (Google Algorithm)లో యూజర్లకు ఆసక్తి కలిగించే పదాలను చూపిస్తుంది. అన్నింటిని బ్రౌజ్ చేస్తున్న యూజర్లకు తర్వాత ఏ ట్యాబ్‌లు కనిపించాలనే దానిపై కంట్రోల్ ఉండదని చెప్పవచ్చు. అందుకే ఈ ఫీచర్ చాలా బాగా ఉపయోగపడుతుందని గూగుల్ భావిస్తోంది. ఇప్పటివరకు, సెర్చ్ ట్యాబ్‌లు 8 కేటగిరీలుగా చూపించింది. అందులో ఫొటోలు (Images) మ్యాప్‌లు (Maps), షాపింగ్ (shopping), వార్తలు (News), వీడియోలు (Videos), విమానాలు (Flights), పుస్తకాలు (Books), ఫైనాన్స్ (Finance) అనేవి ఉంటాయి.

ప్రస్తుతం అమెరికాలోని గూగుల్ యూజర్లకు మాత్రమే ఈ కొత్త ఫీచర్ అందుబాటులో ఉంది. త్వరలో ఇతర భాషలు, ప్రాంతాలకు విస్తరించాలని గూగుల్ భావిస్తోంది. కొన్ని నెలల క్రితంమే గూగుల్ తమ సెర్చింగ్‌లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ (Reverse Image Search) చేసే సామర్థ్యాన్ని యాడ్ చేసింది. భారతీయ యూజర్ల కోసం హిందీలో మల్టీ-సెర్చ్, ద్విభాషా సెర్చ్ (bilingual search) రిజిల్ట్స్ సపోర్టు చేసే కొత్త ఫీచర్లపై పనిచేస్తున్నట్లు ప్రకటించింది.

Read Also : Google Chrome Feature : డెస్క్‌టాప్‌ యూజర్లకు పండగే.. గూగుల్ క్రోమ్‌‌లో సరికొత్త ఫీచర్లు.. ఇక మీ బ్రౌజర్‌ సూపర్ ఫాస్ట్‌..!