Google Chrome Feature : డెస్క్‌టాప్ యూజర్లకు పండగే.. గూగుల్ క్రోమ్‌లో సరికొత్త ఫీచర్లు.. ఇక మీ బ్రౌజర్ సూపర్ ఫాస్ట్..!
Google Chrome Feature : గూగుల్ క్రోమ్ బ్రౌజర్ (Chrome Browser) యూజర్లకు పండగే.. ప్రపంచవ్యాప్తంగా 2.65 బిలియన్ల కన్నా ఎక్కువ మంది వినియోగదారులు డిఫాల్ట్ బ్రౌజర్‌గా వాడుతున్నారు.

Google brings new feature to boost Chrome browser performance on desktop, details here
Google Chrome Feature : ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ ప్రొడక్టుల్లో ఒకటైన క్రోమ్ బ్రౌజర్ (Chrome Browser) యూజర్లకు పండగే.. ప్రపంచవ్యాప్తంగా 2.65 బిలియన్ల కన్నా ఎక్కువ మంది వినియోగదారులు డిఫాల్ట్ బ్రౌజర్‌గా (Google Chrome)ని వాడుతున్నారు. అందుకే గూగుల్ కూడా వినియోగదారుల సెక్యూరిటీ, ప్రైవసీతో పాటు వినియోగదారు ఇంటర్‌ఫేస్‌ను మెరుగుపరచడానికి అనేక కొత్త ఫీచర్లను ప్రవేశపెడుతోంది. అందులోభాగంగానే Chrome బ్రౌజర్ యూజర్ల కోసం Google తరచుగా కొత్త అప్‌డేట్స్, ఫీచర్లను రిలీజ్ చేస్తుంది.
ఇటీవలి కొన్ని అప్‌డేట్లలో Google డెస్క్‌టాప్ బ్యాటరీని మెరుగుపర్చేందుకు Chromeలో బ్రౌజింగ్‌ను మరింత స్పీడ్ పెరిగేందుకు రెండు ఫీచర్లను రిలీజ్ చేసింది. అందులో క్రోమ్ మెమరీ సేవర్ ఫీచర్ (Chrome Memory Saver) ఒకటి. Chrome మెమరీ సేవర్ మోడ్ Chrome మెమరీ వినియోగాన్ని ఆప్టిమైజ్ చేసేందుకు రూపొందించింది. ప్రత్యేకించి వినియోగదారులు మల్టీ ట్యాబ్‌లను ఒకేసారి ఓపెన్ చేసినప్పుడు.. ఈ ఫీచర్ ప్రస్తుతం ఉపయోగంలో లేని ట్యాబ్‌లను ఆటోమాటిక్‌గా గుర్తిస్తుంది. అప్పుడు ఆయా ట్యాబుల మెమరీని తాత్కాలికంగా డిలీట్ చేస్తుంది. అప్పుడు బ్రౌజర్ మొత్తం మెమరీ ఫుట్‌ప్రింట్‌ను తగ్గిపోతుంది. తద్వారా క్రోమ్ బ్రౌజర్ పర్ఫార్మెన్స్ స్పీడ్ అవుతుంది.
క్రోమ్ మెమరీ సేవ్ మోడ్ ఎలా పనిచేస్తుందంటే? :
గూగుల్ క్రోమ్‌లో మెమరీ సేవర్ మోడ్ ఇన్‌యాక్టివ్ ట్యాబ్‌లను తొలగిస్తుంది. అంటే.. ట్యాబ్ తప్పనిసరిగా హోల్డ్ చేస్తుంది. అందులోని కంటెంట్ మెమరీ నుంచి అన్‌లోడ్ అవుతుంది. తద్వారా మెమరీ ఖాళీ చేసేందుకు సాయపడుతుంది. యాక్టివ్ ట్యాబ్ వేగంగా, మరింత సమర్థవంతంగా పనిచేసేందుకు అనుమతిస్తుంది. మీరు సస్పెండ్ చేసిన ట్యాబ్‌కి తిరిగి ఓపెన్ చేయగానే మళ్లీ రీలోడ్ అవుతుంది.

Google brings new feature to boost Chrome browser performance on desktop
మీరు ఫ్యామిలీ వీడియోలను ఎడిట్ చేయడం లేదా గేమ్‌లు ఆడటం వంటి ఇతర ఇంటెన్సివ్ అప్లికేషన్‌లను రన్ చేస్తే.. ఈ ఫీచర్ అద్భుతంగా ఉంటుంది. ఏవైనా inactive ట్యాబ్‌లు మీకు అవసరమైనప్పుడు మళ్లీ లోడ్ అవుతాయని Google అధికారిక పోస్టులో తెలిపింది. మెమరీ సేవర్ (Memory Saver) ఫీచర్ గత సంవత్సరంలోనే రిలీజ్ అయింది. కానీ, ఇప్పుడు చాలా మంది Chrome యూజర్లకు అందుబాటులోకి వచ్చింది.
గూగుల్ క్రోమ్ మెమరీ సేవర్ మోడ్‌ని ఎలా ఆన్ చేయాలంటే? :
* మీ ల్యాప్‌టాప్ లేదా డెస్క్‌టాప్‌లో (Google Chrome) ఓపెన్ చేయండి.
* స్క్రీన్ రైట్ టాప్ కార్నర్‌లో మీ ప్రొఫైల్ ఫొటో పక్కన ఉన్న త్రిడాట్స్ మెను నొక్కండి.
* డ్రాప్-డౌన్ మెనుని ఓపెన్ చేసేందుకు త్రి డాట్స్ మెనుపై Click చేయండి.
* డ్రాప్-డౌన్ మెను నుంచి Settings ఎంచుకోండి.
* ‘Performance’ సెక్షన్‌లో కిందికి స్క్రోల్ చేయండి. ఆపై క్లిక్ చేయండి.
* ‘Performance’ సెక్షన్‌లో ‘Memory Saver’ కోసం ఆప్షన్ ఎంచుకోవచ్చు.
* ఆన్ చేసేందుకు పక్కన ఉన్న బటన్‌ను Toggle చేయండి.
– మెమరీ సేవర్ మోడ్‌ను ON చేసిన తర్వాత, మీ బ్రౌజింగ్ Chrome ఆటోమాటిక్‌గా Inactive ట్యాబ్‌ల నుంచి మెమరీని ఖాళీ చేస్తుంది.
ముఖ్యంగా, మెమరీ సేవర్ బ్యాక్‌గ్రౌండ్‌లో మీడియా ప్లేను డిసేబుల్ చేయదు. మీరు ఇప్పటికీ Youtube, పాడ్‌క్యాస్ట్‌లు మొదలైన వాటిలో పాటలను నిరంతరాయంగా వినవచ్చు.
ఈ సమయంలో, Google సెర్చ్‌లో డేటాను వెరిఫై చేసేందుకు తప్పుడు సమాచారాన్ని ఎదుర్కోవడంలో యూజర్లకు సాయపడేందుకు Google 5 కొత్త మార్గాలను కూడా రిలీజ్ చేసింది. వాస్తవంగా చెక్ చేసినప్పుడు సెర్చ్ రిజల్ట్స్‌లో కనిపించే fact-checking లేబుల్ ఒకటి. ఈ లేబుల్ వినియోగదారులు చదువుతున్న డేటా కచ్చితమైనదా కాదా అని సులభంగా గుర్తించవచ్చు.
సెర్చ్ రిజల్ట్స్‌లో కనిపించే తప్పు లేదా తప్పుదారి పట్టించే డేటాను నివేదించడానికి యూజర్లకు అనుమతించే ఫీచర్‌ను కూడా Google ప్రవేశపెట్టింది. అదనంగా, టెక్ దిగ్గజం తప్పుడు సమాచారాన్ని గుర్తించడానికి సెర్చ్ రిజల్ట్స్‌లో కనిపించకుండా నిరోధించేందుకు అల్గారిథమ్‌ల క్వాలిటీని మెరుగుపరచడానికి కృషి చేస్తోంది.