Airtel New Data Pack : ఎయిర్‌టెల్‌ అదిరే ఆఫర్.. డేటా దాహం తీర్చే Top-Up ప్లాన్‌‌‌!

ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం ఎయిర్ టెల్ తమ ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం అదిరిపోయే కొత్త డేటా ఆఫర్ తీసుకొచ్చింది. అదే.. Airtel Rs.119 Data Pack. ఇదో కొత్త డేటా యాడ్-ఇన్ ప్యాక్..

Airtel New Data Pack : ఎయిర్‌టెల్‌ అదిరే ఆఫర్.. డేటా దాహం తీర్చే Top-Up ప్లాన్‌‌‌!

Airtel Rs 119 Data Pack Introduced

Airtel Rs 119 data pack : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం ఎయిర్ టెల్ తమ ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం అదిరిపోయే కొత్త డేటా ఆఫర్ తీసుకొచ్చింది. అదే.. Airtel Rs.119 Data Pack. ఇదో కొత్త డేటా యాడ్-ఇన్ ప్యాక్.. ప్రీపెయిడ్ యూజర్లు తమ డేటాను కోల్పోకుండా ఎప్పుడూ కనెక్ట్ అయ్యేందుకు వీలుగా ఈ కొత్త డేటా ప్లాన్ ప్రవేశపెట్టింది ఎయిర్ టెల్. ప్రస్తుత డేటా ప్లాన్ ఉన్నప్పటికీ అదనంగా డేటా పొందవచ్చు. డేటా వ్యాలిడిటీ కూడా రన్నింగ్ ప్యాక్ పైనే ఆధారపడి ఉంటుంది. కొత్త ధరలతో అందుబాటులో ఉన్న అనేక డేటా ప్యాక్‌లకు అదనంగా కొత్త యాడ్-ఆన్ ప్యాక్ ఆఫర్ చేస్తోంది. అందులో భాగంగానే ఎయిర్‌టెల్ రూ .119 ప్లాన్ ప్రీపెయిడ్ కస్టమర్లకు అందుబాటులోకి తెచ్చింది.

ఈ కొత్త రూ .119 ఎయిర్‌టెల్ ప్లాన్ వినియోగదారులకు 15GB 4G డేటాను ఆఫర్ చేస్తోంది. ఇదో యాడ్-ఆన్ ప్యాక్.. దీనికి వ్యాలిడిటీ (N/A) ఉండదు. అంటే.. ఇప్పటికే ఉన్న ప్రీపెయిడ్ ప్లాన్ వ్యాలిడిటీ గడువు ముగిసే వరకు మాత్రమే ఈ డేటా అందుబాటులో ఉంది. ఆ తర్వాత ఇది కూడా ఎక్స్ పెయిర్ అవుతుంది. కేవలం డేటాను మాత్రమే పొందవచ్చు. అదనంగా కాలింగ్, SMS బెనిఫిట్స్ పొందలేరు. Unlimited Plans మీకు నచ్చిన ప్లాన్ ఏదైనా ఎంచుకోవచ్చు. కానీ, ఈ కొత్త యాడ్-ఇన్ డేటా ప్యాక్ తీసుకుంటే.. అదనపు బెనిఫిట్స్ ఉన్నాయి.
Read More: iPhone 13 : ఐఫోన్‌ లవర్స్‌కు గుడ్ న్యూస్.. 13 సిరీస్ రిలీజ్‌ డేట్ ఫిక్స్..

ఈ ప్లాన్ వినియోగదారులకు Xstream Mobile pack అందిస్తుంది. Airtel Xstream యాప్ ద్వారా ErosNow, Hoichoi, ManoramaMax ఉచితంగా యాక్సెస్ చేసుకోవచ్చు. ఇది 30 రోజులకు వర్తిస్తుంది. ఎయిర్ టెల్ అందించే add-on packs జాబితాలో ఈ కొత్త డేటా ప్యాక్ చేరింది. ఈ జాబితాలో రూ .48, రూ .78, రూ .89, రూ .98, రూ .131, రూ .248 రూ .251 ప్లాన్‌లు అందుబాటులో ఉన్నాయి. ఈ ప్లాన్‌లన్నీ యూజర్ల ప్రస్తుత ప్లాన్‌ల వ్యాలిడిటీపై ఆధారపడి ఉంటాయి. రూ .48, రూ .98 రూ .251 ప్యాక్‌లతో అదనపు డేటాను మాత్రమే పొందవచ్చు. ఇతర ప్లాన్‌లు వివిధ ఎంటర్ టైన్మెంట్ ప్లాట్‌ఫారమ్‌ల్లో అడిషనల్ బెనిఫిట్స్ పొందవచ్చు.

ఎయిర్‌టెల్ ఇటీవలే కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌లలో free Disney+ Hotstar సబ్‌స్క్రిప్షన్‌ ప్రవేశపెట్టింది. రూ .499 ప్లాన్ 3GB డెయిలీ డేటా, అన్ లిమిటెడ్ కాల్స్, రోజుకు 100SMS, ఒక ఏడాది పాటు Disney+ Hotstar Mobile, Amazon Prime Video Mobile 30 రోజుల వరకు యాక్సస్ చేసుకోవచ్చు. Wynk Music Free, free Hellotunes, Apollo 24/7 Circle, free online courses ఏడాదివరకు పొందవచ్చు.

FASTag recharge ద్వారా రూ .100 క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. ఇది 28 రోజుల వరకు వ్యాలిడిటీ ఉంటుంది. రూ .699 ప్లాన్ కస్టమర్లకు రోజుకు 2GB డేటాను అందిస్తుంది. 56 రోజులు అన్ లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 SMS లు పొందవచ్చు. ఇతర బెనిఫిట్స్ చూస్తే.. రూ .499 ప్లాన్ మాదిరిగానే ఉన్నాయి. రూ .2,798 ప్లాన్ రూ .699 ప్లాన్ మాదిరిగానే 365 రోజుల వ్యాలిడిటీతో వస్తోంది.

Read More: JioPhone Next.. ఫస్ట్ 4G స్మార్ట్ ఫోన్ దీపావళికి లాంచ్!