iPhone 13 : ఐఫోన్‌ లవర్స్‌కు గుడ్ న్యూస్.. 13 సిరీస్ రిలీజ్‌ డేట్ ఫిక్స్..

నూతన ఆవిష్కరణలు, సరికొత్త ఫీచర్లకు కేరాఫ్‌ అడ్రస్‌ యాపిల్ ఐఫోన్‌. యాపిల్‌ నుంచి ఏ ఉత్పత్తి మార్కెట్‌లోకి వచ్చినా హాట్‌ కేకుల్లా అమ్ముడైపోతాయి. స్మార్ట్‌ఫోన్‌ అభిమానులు ఎప్పటి నుంచో

iPhone 13 : ఐఫోన్‌ లవర్స్‌కు గుడ్ న్యూస్.. 13 సిరీస్ రిలీజ్‌ డేట్ ఫిక్స్..

Iphone 13

iPhone 13 : నూతన ఆవిష్కరణలు, సరికొత్త ఫీచర్లకు కేరాఫ్‌ అడ్రస్‌ యాపిల్ ఐఫోన్‌. యాపిల్‌ నుంచి ఏ ఉత్పత్తి మార్కెట్‌లోకి వచ్చినా హాట్‌ కేకుల్లా అమ్ముడైపోతాయి. స్మార్ట్‌ఫోన్‌ అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఐఫోన్ 13 సిరీస్‌ రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది. సెప్టెంబర్ 14న కాలిఫోర్నియా వేదికగా ఈ ఫోన్‌ను విడుదల చేయనుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న యాపిల్‌ అభిమానులు వీక్షించేలా ఈ వేడుకని ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు.

OnePlus: వన్ ప్లస్ నుంచి రూ.20వేల కంటే తక్కువ ధర ఫోన్లు

నాలుగు వెర్షన్లలో..
ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లో ప్రతీ మోడల్‌కి సంబంధించి లైట్‌, ప్రో, ‍మినీ, మ్యాక్స్‌, ప్లస్‌ లాంటి వెర్షన్లు మార్కెట్‌లోకి వస్తున్నాయి. మొదట ఒక వెర్షన్‌ విడుదలైన తర్వాత దానికి పైన కింద అన్నట్టుగా మిగిలిన వెర్షన్లు విడుదల అవుతున్నాయి. ప్రాథమికంగా ఫోన్‌ ఒకే రకంగా ఉన్నా ఫీచర్లలో కొన్ని తేడాల వల్ల ధరల్లో హెచ్చు తగ్గులు ఉంటాయి. అయితే ఈ మార్కెట్‌ స్ట్రాటజీకి భిన్నంగా వెళ్లాలని యాపిల్‌ నిర్ణయించినట్టు సమాచారం. అందువల్లే ఒకేసారి ఐఫోన్‌ 13కి సంబంధించి నాలుగు వెర్షన్లు విడుదల చేయనున్నట్టు సమాచారం.

Realme Pad : రియల్‌మి నుంచి ఫస్ట్ Tablet.. ఫీచర్లు కిరాక్, ధర ఎంతంటే?

యాపిల్‌ సంస్థ నుంచి వస్తున్న ఐఫోన్‌ 13కి సంబంధించి ఐఫోన్‌ 13, ఐఫోన్‌ 13 మినీ, ఐఫోన్‌ 13 ప్రో, ఐఫోన్‌ 13 ప్రోమ్యాక్స్‌ వెర్షన్లుగా మార్కెట్‌లోకి రాబోతున్నట్టు మొబైల్‌ పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఒకే మోడల్‌కి సంబంధించి వరుసగా వెర్షన్స్‌ వస్తుండటంతో కొనుగోలుదారుల సైతం వేచి చూసే ధోరణి అవలంభిస్తున్నారు. కాబట్టి ఒకేసారి అన్ని వెర్షన్లు రిలీజ్‌ చేయడం వల్ల ఎవరికి నచ్చింది వారు సెలక్ట్‌ చేసుకుంటారనే వ్యూహంతో యాపిల్‌ ఉంది.

ధర ఎంతంటే ?
మార్కెట్‌ వర్గాల అంచనా ప్రకారం అమెరికాలో కనిష్ట ధర 799 డాలర్లుగా ఉంది. అయితే భారత మార్కెట్‌కి వచ్చే సరికి స్థానిక ట్యాక్సుల ఆధారంగా ధర కొంచెం ఎక్కువ ఉండే అవకాశం ఉంది.

వెర్షన్‌ అమెరికా (ఇండియా)
ఐఫోన్‌ 13 799 డాలర్లు (రూ. 58,600)
ఐఫోన్‌ 13 మినీ 699 డాలర్లు (రూ. 51,314)
ఐఫోన్‌ 13 ప్రో 999 డాలర్లు (రూ.73,300)
ఐఫోన్‌ 13ప్రోమ్యాక్స్‌ 1,099 డాలర్లు (రూ 80,679)

ఐఫోన్‌ 13కి సంబంధించి ఇప్పటికే అనేక రూమర్స్‌ చక్కర్లు కొడుతున్నాయి. సిమ్‌ కార్డ్‌ అవసరం లేకుండా లియో టెక్నాలజీ ఆధారంగా ఈ ఫోన్‌ పని చేస్తుందని, ఎమర్జెన్సీ మెసేజ్‌ ఆప్షన్‌ అందుబాటులో ఉంటుందని వార్తలు వస్తున్నాయి. అయితే వీటిలో ఏ ఒక్కదాన్ని యాపిల్‌ సంస్థ అధికారికంగా ధ్రువీకరించలేదు.

ఫేస్‌ ఐడీ ఫీచర్‌లో కొన్ని మార్పులు చేసినట్లు మీడియా రిపోర్ట్స్‌ చెబుతున్నాయి. యూజర్‌ ఫేస్‌మాస్క్‌తో కూడా ఫోన్‌ను అన్‌లాక్‌ చేసేలా కొత్త సాంకేతికతను యాపిల్‌ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోందట. అలానే పొగమంచు, సూర్యరశ్మి అధికంగా ఉన్నప్పుడు కొంతమంది కళ్లాద్దాలు పెట్టుకుంటూ ఉంటారు. అప్పుడు కూడా ఫేస్‌ను గుర్తించి అన్‌లాక్‌ అయ్యేలా చేస్తుంది. ఇప్పుడంతా ఎక్కడ చూసినా 5G టెక్నాలజీ. ఐఫోన్‌ 13 సిరీస్‌ mmWave 5G సపోర్ట్‌తో వస్తుందని రూమర్స్ వస్తున్నాయి. హై స్పీడ్‌ 5జీ టెక్నాలజీ కోసం ఈ ఏడాది నుంచి చాలా దేశాలు mmWave 5G బ్యాండ్‌విడ్త్‌తో సేవలను ప్రారంభిస్తున్నాయి. ఇతర 5జీ నెట్‌వర్క్స్ కంటే స్పీడ్‌ అధికంగా ఉంటుంది. అయితే ఈ టెక్నాలజీ ధర కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఐఫోన్‌ 13 సిరీస్‌ ఫోన్లతోపాటు యాపిల్‌ వాచ్‌ సిరీస్‌ 7ను విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.