Realme Pad : రియల్‌మి నుంచి ఫస్ట్ Tablet.. ఫీచర్లు కిరాక్, ధర ఎంతంటే?

రియల్ మి నుంచి Realme Pad ఫస్ట్ ట్యాబ్లెట్ భారత్‌లో లాంచ్ అయింది. ఈ కొత్త ట్యాబ్లెట్ 10.4 అంగుళాల డిస్‌ప్లేతో గోల్డ్, గ్రే అనే రెండు కలర్ ఆప్షన్లలో వచ్చింది.

Realme Pad : రియల్‌మి నుంచి ఫస్ట్ Tablet.. ఫీచర్లు కిరాక్, ధర ఎంతంటే?

First Ever Tablet Realme Pad In India

first-ever tablet Realme Pad in India : చైనీస్ స్మార్ట్ ఫోన్ దిగ్గజం రియల్ మి నుంచి ఫస్ట్ ట్యాబ్లెట్ వచ్చేసింది. భారత మార్కెట్లోకి Realme Pad పేరుతో రిలీజ్ చేసింది. ఈ కొత్త ట్యాబ్లెట్ 10.4 అంగుళాల (WUXGA+) డిస్‌ప్లేతో పాటు స్లిమ్ ప్రొఫైల్, సైజబుల్ బ్యాటరీలో ఆకర్షణీయంగా ఉంది. ఈ ట్యాబ్లెట్ గోల్డ్, గ్రే అనే రెండు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. WiFi, LTE రెండింటిలోనూ ఈ ట్యాబ్లెట్ లభించనుంది. ఆక్టా కోర్ MediaTech హీలియో G80SoC ప్రాసెసర్‌తో రన్ అవుతుంది.

Dolby Atmos సౌండ్ సిస్టమ్ ప్రత్యేక ఆకర్షణగా ఉండనుంది. ట్యాబ్లెట్ డిస్‌ప్లే 2000×1200, స్ర్కీన్ బాడీ రేషియో 82.5శాతం రెజుల్యుషన్ తో వచ్చింది. రియల్ మి పాడ్ 3GB ప్లస్ 32GB స్టోరేజ్ కెపాసిటీతో Wi-Fi వేరియంట్ ఫోన్ ధర భారత మార్కెట్లో రూ.13,999గా కంపెనీ నిర్ణయించింది. Wi-Fi Plus 4G వేరియంట్ ధర రూ.15,999గా నిర్ణయించింది. అలాగే 4GB Plusu 64GB మోడల్, Wi-Fi Plus 4G వేరియంట్ ధర రూ.17,999గా రియల్ మి నిర్ణయించింది. ఈ మూడు మోడల్స్ గోల్డ్, గ్రే కలర్ ఆప్షన్లలో అందుబాటులోకి వచ్చాయి.
Read More : JioPhone Next : ఫీచర్లు అదుర్స్.. చౌక ధరకే జియో ఫస్ట్ 4G స్మార్ట్ ఫోన్

ఆపిల్ iPad Pro లుక్ డిజైన్ :
ఈ కొత్త ట్యాబ్లెట్ చామ్ పీయర్డ్ ఎడ్జెస్.. చూడటానికి అచ్చం ఆపిల్ ప్రవేశపెట్టిన iPad Pro మాదిరిగానే లుక్ కనిపిస్తోంది. ట్యాబ్లెట్ 6.99mm మందటి పరిమాణంలో వచ్చింది. బ్యాక్ ప్యానెల్ సింగిల్ లెన్స్ కెమెరా చిన్నపాటి బంబ్ సెటప్ ఉంది. Realme Pad ట్యాబ్లెట్ 7100mAh బ్యాటరీతో వచ్చింది. దీనికి 18W క్విక్ చార్జ్ సపోర్టు అందిస్తోంది.

ఒకసారి ఛార్జ్ చేస్తే.. 12 గంటల పాటు వీడియోలు చూడొచ్చు.. 65రోజుల వరకు స్టాండ్ బై అందిస్తుంది. ఇందులో Reverse Charging ఆప్షన్ ఎట్రాక్టివ్ ఫీచర్.. Relame Pad ట్యాబ్లెట్ లో నాలుగు స్పీకర్లు ఉండగా.. Dolby Atmos, Adaptive Surround Soundతో మరింతగా యూజర్లను ఆకట్టుకుంటోంది. కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ Realme UI ఇంటర్ ఫేస్ తో వచ్చింది. ఆండ్రాయిడ్ 11 ఓఎస్ ఆధారంగా రియల్ మి పాడ్ ట్యాబ్లెట్ రన్ అవుతుంది.

Wi-Fi Plus 4G వేరియంట్ల ఫోన్లు.. సెప్టెంబర్ 16 నుంచి Flipkart, Realme.com, ఆఫ్ లైన్ స్టోర్లలో అందుబాటులోకి రానున్నాయి. Wi-Fi వేరియంట్ ఫోన్ సేల్స్ ఎప్పుడు ప్రారంభం కానున్నాయో రియల్ మీ రివీల్ చేయలేదు. HDFC Bank కార్డుల ద్వారా లేదా Easy EMI ద్వారా ఫోన్ కొనుగోలు చేస్తే రూ.2వేల వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు.

ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డు కస్టమర్లు రూ.1000 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. Realme Pad, Bluetooth Speaker కూడా రియల్ మి రిలీజ్ చేసింది. కబుల్, పాకెట్ బ్లూటూత్ స్పీకర్ లాంచ్ చేసింది. కబుల్ బ్లూటూత్ స్పీకర్ ధర రూ.1799గా ఉంటే.. పాకెట్ బ్లూటూత్ స్పీకర్ ధర రూ.1099 గా నిర్ణయించింది. సెప్టెంబర్ 15 నుంచి ఈ రెండు బ్లూటూత్ స్పీకర్ సేల్స్ ప్రారంభం కానున్నాయి.
Read More : Ford Motor: భారత్‌లో ఉత్పత్తి నిలిపేసిన ఫోర్డ్.. కారు కావాలంటే ఇక దిగుమతే!