JioPhone Next : ఫీచర్లు అదుర్స్.. చౌక ధరకే జియో ఫస్ట్ 4G స్మార్ట్ ఫోన్

డేటా సంచలనం రిలయన్స్ జియో ఫస్ట్ 4G స్మార్ట్ ఫోన్ తీసుకొస్తోంది. వినాయక చవితి (Ganesh Chaturthi) పురస్కరించుకుని సెప్టెంబర్ 10న భారత మార్కెట్లో Jio Phone Next ఫోన్ లాంచ్ కాబోతోంది

JioPhone Next : ఫీచర్లు అదుర్స్.. చౌక ధరకే జియో ఫస్ట్ 4G స్మార్ట్ ఫోన్

Jio Phone Next To Launch On September 10

JioPhone Next  Launch : ప్రముఖ దేశీయ డేటా సంచలనం రిలయన్స్ జియో ఫస్ట్ 4G స్మార్ట్ ఫోన్ తీసుకొస్తోంది. వినాయక చవితి (Ganesh Chaturthi)ని పురస్కరించుకుని సెప్టెంబర్ 10న భారత మార్కెట్లో Jio Phone Next ఫోన్ లాంచ్ చేయనుంది కంపెనీ. ఈ జియో ఫస్ట్ 4G స్మార్ట్ ఫోన్ ప్రపంచంలోనే అత్యంత చౌకైన ధరకే అందుబాటులోకి రానుంది. జియో నుంచి మొట్టమొదటి స్మార్ట్ ఫోన్ కూడా ఇదే. Jio Phone Next.. 4G నెట్ వర్క్ ఆండ్రాయిడ్ యాప్స్ వెర్షన్ తో రిలయన్స్ రిలీజ్ చేస్తోంది. గత జూన్‌లో జరిగిన 44వ రిలయన్స్ ఇండస్ట్రీస్ AGM సమావేశంలోనే రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ సరసమైన ధరకే 4G స్మార్ట్ ఫోన్ ప్రవేశపెడతామని ప్రకటించారు.

Jio Phone Next To Launch On September 10 (1)

ఈ ఫోన్ రిలయన్స్, సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ భాగస్వామ్యంలో రూపొందించాయి. ఈ కొత్త జియో స్మార్ట్ ఫోన్ ఫీచర్లు, ధర ఎంత అనేది కంపెనీ అధికారికంగా ప్రకటించలేదు. కానీ, జియో 4G స్మార్ట్ ఫోన్‌కు సంబంధించి ఫీచర్లు లీక్ అయ్యాయి. జియో ఫోన్ నెక్స్ట్ లో గూగుల్ ప్లే స్టోర్ (Google Play Store) యాక్సస్ చేసుకోవచ్చు. ఇందులో Voice Assistant, Automatic Read-alould screen text, Lanugage translation వంటి ఫీచర్లను ఈజీగా యాక్సస్ చేసుకోవచ్చు. 2G ఫోన్ యూజర్లకు చౌకైన ధరలో లభించే బెస్ట్ స్మార్ట్ ఫోన్ జియో ఫోన్ నెక్స్ట్ (Jio Phone Next) బెస్ట్ స్మార్ట్ ఫోన్ అంటోంది జియో.. లీకైన సమాచారం ప్రకారం.. ఈ ఆండ్రాయిడ్, 4G జియో ఫోన్ ధర రూ.3499గా నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ ఫోన్ లాంచ్ తర్వాత సేల్స్ కూడా ప్రారంభం కానున్నాయి.

Read More : Gmail : జీమెయిల్ యూజర్లకు కొత్త సదుపాయం

Jio Phone Next Specifications :
రిలయన్స్ జియో 4G స్మార్ట్ ఫోన్ స్పెషిఫికేషన్లలో Jio Phone Next ఫోన్.. అల్ట్రా 4G మోడల్ తో వస్తోంది. ఫోన్ డిస్ ప్లే చుట్టూ ప్రత్యేకమైన బెజిల్స్ ఉండనున్నాయి. సింగిల్ రియర్ కెమెరాతో పాటు ఫ్రంట్ కెమెరా సెటప్ ఉంది. 2G నుంచి 4G కన్వర్ట్ అయ్యే యూజర్లకు ఈ ఫోన్ పర్ ఫెక్ట్ అని చెప్పొచ్చు. ఈ ఫోన్ ఇన్ బుల్ట్ Real Aloud, Translate Now ఫీచర్లు ఆకర్షణీయంగా ఉండనున్నాయి. ఈ రెండు ఫీచర్ల సాయంతో Webpages, Apps, Messages, Photos ఈజీగా యాక్సస్ చేసుకోవచ్చు. Google Assistant ద్వారా వాయిస్ అసిస్టెడ్ ఫీచర్లను యాక్సస్ చేసుకోవచ్చు. స్నాప్ భాగస్వామ్యంతో జియో.. భారత్ ప్రత్యేకమైన స్నాప్ చాట్ లెన్సులను ఫోన్ కెమెరాలో అమర్చింది. అదనంగా గూగుల్ ప్లే స్లోర్ తో పాటు Google Play Protect కూడా ప్రీలోడెడ్ అయి ఉంటుంది.

Jio Phone Next To Launch On September 10 (2)

Android 11 (Go edition) ఆపరేటింగ్ సిస్టమ్ తో రన్ అవుతుంది. 5.5 అంగుళాల HD డిస్‌ప్లే, Qualcomm QM215 SoC, 2GB RAM లేదా 3GB RAM, 16GB లేదా 32GB eMMC 4.5 ఇంటర్నల్ స్టోరేజీ ఆప్షన్ తో రానుంది. 13MP బ్యాక్ కెమెరా, సెల్ఫీలు, వీడియోల కోసం 8MP సెన్సార్ ఫ్రంట్ సైడ్ ఉండనున్నాయి. 2,500mAh బ్యాటరీ, డ్యుయల్ సిమ్ సపోర్ట్ అందించనుంది. Bluetooth v4.2 సపోర్ట్, GPS కనెక్టవిటీ, 1080p వీడియో రికార్డింగ్ కెపాబులిటీ, DuoGO, Google Camera Go ప్రీ ఇన్ స్టాల్ అయి ఉన్నాయి. బిగ్ స్క్రీన్, AI, ఫాస్ట్ ప్రాసెసర్, గొరిల్లా గ్లాస్ ఆకర్షణీయమైన ఫీచర్లతోనే Jio Phone Next 4G స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి రిలీజ్ అవుతోంది.
Read MoreJio Fiber : కొత్త పోస్ట్‌పెయిడ్‌ ప్లాన్స్ తీసుకొచ్చిన జియో.. మీరు ఓ లుక్కేయండి!