Gmail : జీమెయిల్ యూజర్లకు కొత్త సదుపాయం

జీమెయిల్‌ అంటే మేసేజ్ లు పంపడం, రిసీవ్ చేసుకోవడం. ఇప్పటివరకు ఇంతే. కానీ, ఇకపై అదనపు ఫీచర్లు రానున్నాయి. అవును, జీమెయిల్ యూజర్లకు గూగుల్‌ గుడ్‌న్యూస్‌ చెప్పింది. కొత్త సదుపాయం..

Gmail : జీమెయిల్ యూజర్లకు కొత్త సదుపాయం

Gmail

Gmail : జీమెయిల్‌ అంటే మేసేజ్ లు పంపడం, రిసీవ్ చేసుకోవడం. ఇప్పటివరకు ఇంతే. కానీ, ఇకపై అదనపు ఫీచర్లు రానున్నాయి. అవును, జీమెయిల్ యూజర్లకు గూగుల్‌ గుడ్‌న్యూస్‌ చెప్పింది. కొత్త సదుపాయం అందుబాటులోకి తెచ్చింది. జీమెయిల్‌ మొబైల్‌ యాప్‌ లేదా వెబ్‌ యాప్స్‌ ఉపయోగించి నేరుగా గూగుల్‌ మీట్‌ యూజర్లకు వాయిస్‌, వీడియో కాల్స్‌ను చేసుకునే సదుపాయాన్ని యూజర్లకు అందుబాటులోకి తెచ్చింది.

అలాగే జీమెయిల్‌ యూజర్లు ఒకరికొకరు వాయిస్‌, వీడియో కాలింగ్‌ సదుపాయాన్ని కూడా కలిగించనుంది. భవిష్యత్తులో వాయిస్‌ ఇంటర్నెట్‌ ప్రొటోకాల్స్‌ను చేసే సామర్థ్యాన్ని కూడా గూగుల్‌ అందుబాటులోకి తీసుకురానుంది. జీమెయిల్‌ యాప్స్‌లో గ్రూప్‌ చాట్‌ సర్వీసులను కూడా యూజర్లు పొందే సౌకర్యాన్ని గూగుల్‌ అందించనుంది.

Remove Apps : వార్నింగ్.. మీ ఫోన్‌లో ఈ 4 యాప్స్ ఉంటే వెంటనే డిలీట్ చేయండి

గూగుల్ ప్రకటించిన కొత్త ఫీచర్లలో భాగంగా జీమెయిల్‌ యాప్స్‌లో చాట్, స్పేసెస్‌, గూగుల్‌ మీట్‌ వంటి మూడు ట్యాబ్‌లను వర్క్‌స్పేస్ టూల్స్‌కు మరింతగా అనుసంధానంగా ఉండనున్నాయి. గూగుల్‌ మీట్‌ బటన్‌పై క్లిక్‌ చేసిన తర్వాత జనరేట్‌ అయిన లింక్‌ను ఇతరులకు పంపడం ద్వారా వీడియో కాలింగ్‌ను చేయవచ్చు. ప్రస్తుతం తెచ్చిన ఫీచర్‌తో నేరుగా జీమెయిల్‌ ఖాతాతో గూగుల్‌ మీట్‌ పాల్గొనే సదుపాయం కలగనుంది. తాజాగా గూగుల్‌ మీట్‌ కంపానియన్‌ మోడ్‌ను నవంబర్‌లో అందుబాటులోకి తీసుకురావడానికి గూగుల్‌ ప్రయత్నిస్తుంది.

Google Drive : గూగుల్ డ్రైవ్ ఫైల్స్ ఆఫ్‌లైన్‌లోనూ ఓపెన్ చేయొచ్చు.. ఎలానంటే?

గూగుల్‌ క్యాలెండర్, డ్రైవ్, డాక్స్, షీట్‌, స్లయిడ్‌లు, మీట్, టాస్క్‌లతో సహా ఇతర గూగుల్ వర్క్‌స్పేస్ టూల్స్‌ సహకారంతో టీమ్‌ మీటింగ్‌లకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని గూగుల్‌ ఒక ప్రకటనలో తెలిపింది. గ్రూప్ చాట్ లాంటి ఫీచర్‌లో భాగంగా పాల్గొనే వారికి డాక్యుమెంట్లను షేర్ చేయడానికి సులువుగా ఉండనుంది. యూజర్ల మధ్య జరిగిన కాన్వర్ జేషన్ ను పూర్తిగా సేవ్‌ చేసుకోవచ్చు. గూగుల్‌ అదనంగా గూగుల్‌ క్యాలెండర్‌ పలు కొత్త ఫీచర్లను కూడా అందుబాటులోకి తెచ్చింది. యూజర్లు తమ వర్క్‌ డే లోకేషన్‌ స్టోర్‌ చేసుకునే సౌకర్యాన్ని కల్పించనుంది.