Google Drive : గూగుల్ డ్రైవ్ ఫైల్స్ ఆఫ్‌లైన్‌లోనూ ఓపెన్ చేయొచ్చు.. ఎలానంటే?

గూగుల్ అందించే సర్వీసుల్లో ఒకటైన Google Drive నుంచి కొత్త ఫీచర్ వచ్చింది. ఈ కొత్త ఫీచర్ ద్వారా డ్రైవ్ నుంచి వెబ్‌లో అన్నిరకాల ఫైల్స్ ఓపెన్ చేయొచ్చు.

Google Drive : గూగుల్ డ్రైవ్ ఫైల్స్ ఆఫ్‌లైన్‌లోనూ ఓపెన్ చేయొచ్చు.. ఎలానంటే?

Google Drive Brings Offline Viewing Support

Updated On : September 7, 2021 / 7:54 PM IST

Google Drive brings offline viewing support : ప్రముఖ ఆన్ లైన్ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ అందించే సర్వీసుల్లో ఒకటైన Google Drive నుంచి కొత్త ఫీచర్ వచ్చింది. ఈ కొత్త ఫీచర్ ద్వారా గూగుల్ డ్రైవ్ నుంచి వెబ్‌లో అన్నిరకాల ఫైల్స్ ఓపెన్ చేసుకోవచ్చు. గూగుల్ డ్రైవ్ లో మీరు దాచిన PDFs, Images, MS Office Documents సహా ఇతర నాన్ గూగుల్ ఫైల్స్ కూడా ఓపెన్ చేయొచ్చు.. అది కూడా ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం లేకుండానే.. Android Central ప్రకారం.. ఈ కొత్త ఫీచర్ నెమ్మదిగా అందరి గూగుల్ డ్రైవ్ యూజర్లకు అందుబాటులోకి రానుంది. వచ్చేవారంలో ప్రతిఒక్కరికి ఈ గూగుల్ డ్రైవ్ కొత్త ఫీచర్ అందుబాటులోకి రానుంది. 2019 ప్రారంభంలో గూగుల్.. డ్రైవ్ వెబ్ వెర్షన్ లో ఒక ఆప్షన్ పై టెస్టింగ్ జరిపింది. ఆ ఆప్షన్ ద్వారా అన్ని రకాల ఫైల్స్ PDFs, Images, MS Office documents ఆఫ్ లైన్ లోనూ చూసుకోవచ్చు.
LPG New Connection: కొత్త గ్యాస్‌ కనెక్షన్‌ కావాలా? ఇలా మిస్డ్ కాల్‌ ఇవ్వండి చాలు!

ప్రస్తుతానికి ఈ ఫీచర్ బీటా వెర్షన్ లో మాత్రమే అందుబాటులో ఉందని ఓ నివేదిక వెల్లడించింది. గూగుల్ డ్రైవ్ ఫైల్స్ ఆఫ్ లైన్ లోనూ (Turn on) ఓపెన్ చేయాలంటే.. Google Driveలోని ఏదైనా ఫైల్ పై రైట్ క్లిక్ ఇవ్వండి. అప్పుడు మీకు మెనూలో Available offline అనే ఆప్షన్ కనిపిస్తుంది. కంప్యాటబుల్ యాప్స్ ద్వారా ఈ ఫైల్స్ ఓపెన్ చేసుకోవచ్చు. మీ పీసీ ద్వారా డ్రైవ్ వెబ్ ఆదారిత పోర్టల్ లో ఇన్ స్టాల్ అయిన యాప్స్ ద్వారా ఈ ఫైల్స్ ఈజీగా ఆఫ్ లైన్ లోనూ యాక్సస్ చేసుకోవచ్చు. అంతేకాదు.. Chrome OS యూజర్లు కూడా డాక్యుమెంట్లు, ఎక్స్ఎల్ షీట్లు, స్లయిడ్స్ ఫైల్స్ కూడా ఆఫ్ లైన్ లోనే యాక్సస్ చేసుకోవచ్చు. క్రోమ్ అందించే బెస్ట్ క్రోమ్ బుక్స్ కొన్నింటి ద్వారా ఆఫ్ లైన్ లోనూ ఈ ఫైల్స్ అన్ని యాక్సస్ చేసుకోనే వీలుంది.

ఈ ఫైల్స్ ఆఫ్ లైన్ వ్యూలో యాక్సస్ చేయాలంటే మీరు గూగుల్ డ్రైవ్ ఓపెన్ చేయడం లేదా ఏదైనా డాక్యుమెంట్ ఓపెన్ చేయాల్సిన పనిలేదని నివేదిక తెలిపింది. అలాగే ఈ కొత్త ఫీచర్ అన్ని డ్రైవ్ యూజర్లకు అందుబాటులో ఉంటుంది. అది పర్సనల్ అకౌంట్ లేదా బిజినెస్ అకౌంట్ కావొచ్చు.. అదే ఆఫీసుల్లో అయితే మాత్రం అడ్మిన్లు మాత్రమే తమ డొమైన్ ఆఫ్ లైన్ లో యాక్సస్ చేసుకోగలరు. ఇప్పటికే గూగుల్ ఈ కొత్త ఫీచర్ రిలీజ్ చేయడం ప్రారంభించింది. ప్రతిఒక్క యూజర్ కు అందుబాటులోకి రావడానికి సెప్టెంబర్ 14 వరకు సమయం పట్టొచ్చు.
Salary Hike : ఉద్యోగులకు గుడ్ న్యూస్- వచ్చే ఏడాది 9.4 శాతం జీతాలు పెంపు