Ford Motor: భారత్‌లో ఉత్పత్తి నిలిపేసిన ఫోర్డ్.. కారు కావాలంటే ఇక దిగుమతే!

ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఫోర్డ్ మోటార్స్ ఇండియాలో తమ కంపెనీ కార్ల ఉత్పత్తిని నిలిపివేసింది. మన దేశంలో రెండు ప్లాంట్లు కలిగిన ఫోర్డ్ రెండిటినీ మోసేసేందుకు సిద్ధమైంది.

Ford Motor: భారత్‌లో ఉత్పత్తి నిలిపేసిన ఫోర్డ్.. కారు కావాలంటే ఇక దిగుమతే!

Ford Motor

Ford Motor: ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఫోర్డ్ మోటార్స్ ఇండియాలో తమ కంపెనీ కార్ల ఉత్పత్తిని నిలిపివేసింది. మన దేశంలో రెండు ప్లాంట్లు కలిగిన ఫోర్డ్ రెండిటినీ మోసేసేందుకు సిద్ధమైంది. గత కొంత కాలంగా లాభాలు లేకపోగా నష్టాల్లో నడుస్తున్న కారణంగానే ఇండియాలో ఉత్పత్తి నిలివేసేందుకు సిద్దమైనట్లుగా ఫోర్డ్ మోటార్స్ ప్రతినిధులు వెల్లడించారు. అయితే, మన దేశంలో కార్ల అమ్మకాలతో పాటు స్పేర్ పార్టులు విక్రయాలు యధావిధిగానే జరుగుతాయని.. వాటిని ఆపబోమని చెప్పింది.

Viral Video: డిఫరెంట్ గులాబ్ జామున్.. నోట్లో వేసుకుంటే మత్తులో తూగాల్సిందే!

ఇతర దేశాలలో గల ఫోర్డ్ ప్లాంట్ల నుండి దిగుమతి చేసుకొని మన దేశంలో వాటిని విక్రయించనున్నారు. దీంతో కార్ల ధరలు పెరుగుతాయా లేదా అన్నదానిపై కంపెనీ ఇప్పుడే ఏ విషయాన్ని వెల్లడించలేదు కానీ.. ప్రస్తుతానికి ఇండియాలో ప్రొడక్షన్ నిలివేసి తమ సంస్థకు చెందిన రెండు ప్లాంట్లను మూసేయాలని నిర్ణయించుకున్నట్లుగా సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. కాగా, ఇప్పటికే ఇండియాలో హార్లీ డేవిడ్ సన్, జనరల్ మోటార్స్ కూడా తమ సంస్థ ప్లాంట్లను మూసేయగా ఇప్పుడు అదే బాటలో ఫోర్డ్ కూడా పయనిస్తుంది.

laknavaram Lake: ఇదేదో యూరప్ కంట్రీ కాదు.. మన లక్నవరం సరస్సే!

కరోనా మహమ్మారి లాక్ డౌన్ ముందు నుండే ఇండియాలో కార్ల అమ్మకాలు ఘోరంగా పడిపోగా భారత ఆర్థికశాఖ పలు రాయితీలతో ఊతమిచ్చి ఉత్పత్తి, విక్రయాలను పెంచేందుకు ప్రయత్నించింది. కానీ అంతలోనే కరోనా లాక్ డౌన్స్ వచ్చి పడడంతో పాటు ఆటో మొబైల్స్ లో ఘోరమైన క్రయ విక్రయాలు తగ్గడంతో కొందరు ఉత్పత్తి దారులు దేశాన్ని వీడేందుకు సిద్ధమయ్యారు. ఇందులో ఇప్పుడు ఫోర్డ్ మోటార్స్ కూడా చేరింది. ఫోర్డ్ తీసుకున్న ఈ నిర్ణయంతో రెండ్లు ప్లాంట్లలో పనిచేసే ఉద్యోగులతో పాటు పరోక్షంగా వాటిపై ఆధారపడిన వారు మొత్తం 4 వేల మంది ఉపాధి కోల్పోనున్నట్లుగా తెలుస్తుంది.